- డ్రామాను ముందే బయటపెట్టిన వైసీపీ నేత
- స్క్రిప్ట్ ప్రకారమే డ్రామాను రక్తికట్టించిన వైనం
- చిన్న గాయానికి ఫొటో షూట్ పటాటోపం!
- కీలక ‘పాత్ర’ పోషించిన పోలీస్ వ్యవస్థ?
- సానుభూతి ప్రచారానికి వైసీపీ హడావుడి
- డ్రామాను కామెడీ సీన్‌లా చూసిన రాష్ట్ర ప్రజలు
ఆకతాయి విసిరిన గులకరాయి కారణంగా `సీఎం జగన్ నుదుటిన చిన్న గాయమైంది. వైద్యులు `ఫస్ట్ ఎయిడ్ చేసి చిన్న ప్లాస్టరేశారు. ఇదీ `ఓపెనింగ్ సీన్. ఇక్కడినుంచి ‘సానుభూతి’ స్క్రిప్ట్ మొదలైంది. సీపంను సర్కారీ దవాఖానకు తరలించారు. ఆపరేషన్ థియేటర్లో అటు వైద్యుడు స్టిచెస్ వేస్తుంటే, ఇటు ఫొటోషూట్ మొదలైంది. అనుగుణంగా సానుభూతి ప్రచార పటాటోపం ఆరంభమైంది. ఇంకేముంది? సీఎం జగన్‌ను మట్టుబెట్టేందుకు కుట్ర జరిగిందన్న బిల్డప్ క్రియేట్ చేశారు. ‘డ్రామా’ పతాక సన్నివేశానికి ఇదే ముక్తాయింపు!
అమరావతి (చైతన్య రథం): ఎదుటివాడికి గోతులు తవ్వేవాడు `ఏదోకరోజు వాడు తీసిన గోతిలో వాడు పడతాడు. ఇది `గోతి’తార్కిక సూత్రం. ఎదుటివాడిపై కుట్రలు పన్నేవాడు `ఏదోకరోజు వాడి కుట్రకు వాడే బలైపోతాడు. ఇది `చరిత్ర చెప్పే సత్యం. ఈ రెండూ ఏకకాలంలో అన్వయించుకుంటే.. జగన్ నుదుటికి తగిలిన గులకరాయి కథ. చిన్న గులకరాయి `ఎన్నికల గతిని మారుస్తుందని ఎవ్వరూ ఊహించరు. అదే చిన్న గులకరాయి `జగన్ ‘నుదుటి’రాతను మార్చేస్తుందనీ అనుకోరు. కాని `జరిగేదీ, జరగబోయేదీ అదే. వర్తమాన రాజకీయానికి మలుపు, భవిష్యత్ రాజకీయానికి మేల్కొలుపు `ఈ ‘గులకరాయే’ కావొచ్చు. మహోజ్వలంగా సాగుతోన్న మహా ‘కూటమి’ ప్రభంజనాన్ని ఎదుర్కోడానికి `పాలకపక్ష జగన్ ‘గులకరాయి డ్రామా’ ప్రయోగించి బోర్లాపడ్డట్టే కనిపిస్తోంది. వంద గొడ్డు తిన్న రాబంధు కూడా ఒక్క గాలివానకు కూలిపోయిందన్నట్టు.., ఐదేళ్లు రాష్ట్రాన్ని పీడిరచుకుతిన్న పాలకుడు `కూటమి తుపానుకు కుప్పకూలే పరిస్థితి వచ్చింది. కూటమిని, ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబును ఇరికించాలన్న ప్రయత్నంతో ‘గులకరాయి డ్రామా’కు తెరలేపిన జగన్ `చివరకు తానే సెల్ఫ్‌గోల్ చేసుకున్నట్టే కనిపిస్తోంది. ఏ ‘గులకరాయి’ని విపక్షం మీదకు ప్రయోగించాలనుకున్నాడో.. అదే ఇప్పుడు జగన్ ‘నుదిటి’రాతకు గుదిబండగా మారిందనడంలో సందేహం లేదు.
ఏంటీ గులకరాయి కథ?
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై ఆగంతక దాడి జరిగింది. శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్‌నగర్ డాబా కొట్ల సెంటరుకు చేరుకున్న సమయంలో `ఆగంతకుడు గులకరాయి విసిరినట్టు నిర్థారించారు. ప్రాథమిక చికిత్స తర్వాత సీఎం జగన్ యాత్ర కొనసాగిండం నిన్నటి పరిణామం.
‘తీవ్రమైన గాయం కాదు. జగన్ నుదుటికి రెండు కుట్లు పడాయి. రెండు, మూడు రోజుల్లో కోలుకుంటా’రన్నది వైద్యుల నివేదిక. ఇక పోలీసులూ దర్యాప్తు ముమ్మరం చేశారు. వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడిమధ్యలో 30 అడుగుల దూరం నుంచి దాడి జరిగినట్టు ప్రాథమికంగా నిర్థారించారు. జగన్, వెల్లంపల్లి ఇద్దరికీ తగిలిన రాయి ఒకటేనా లేక వేర్వేరా? అన్న కోణాన్నీ పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసలు, సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అదే సమయంలో ఈసీకి బెజవాడ సీపీ కాంతిరాణా నివేదిక ఇచ్చారనీ తెలుస్తోంది. దర్యాప్తునకు 20మందితో 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు నివేదికలో పొందుపర్చారని సమాచారం. ఘటనపై `హత్యాయత్నం కింద ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు. కేసరపల్లి సీఎం క్యాంప్ సైట్‌కు వెళ్లిన ఇంటెలిజెన్స్ డీజీ ఘటనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదీ ఆదివారంనాటి పరిణామాలు.
కోడికత్తికి మించిన డ్రామా?
గత ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామాతో గద్దెనెక్కిన జగన్ `ఈసారి గులకరాయిని ప్రయోగించాడంటూ విపక్షాలు, అంతకుమించి ప్రజాపక్షలు విరుచుకుపడుతున్నాయి. జగన్ నుదుటికి తగిలిన గాయం, వైసీపీ చేస్తోన్న రచ్చను రాష్ట్ర ప్రజలు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. గత ‘కోడి కత్తి డ్రామా’, కేసు సాగదీస్తున్న తీరు, దాని పర్యావసానాలు పూర్తిగా అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రజలు.. జగన్ మరో కామెడీ పీస్‌కు తెరలేపాడనే చర్చించుకుంటున్నారు. విపక్షాలు ఇప్పటికే జగన్ డ్రామాను తిప్పికొట్టడమే కాదు, జగన్ మెడకే గులకరాయిని గుదిబండ చేశాయి. విపక్షాలు సంధిస్తున్న సవాలక్ష అనుమాన ప్రశ్నలకు సమాధానాలు లేక.. సెల్ఫ్‌గోల్ కొట్టుకున్నామన్న విషయం అర్థమై.. డ్రామాను మెలితిప్పే ప్రయత్నాల్లో వైసీపీ నిమగ్నమైంది.
వైసీపీ కుట్రకు ఇదీ ఆధారం!
నాలుగు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 10న సీఎం జగన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ నాయకుడు, హైకోర్టు న్యాయమూర్తులనే బెదిరించిన కేసులను ఎదుర్కొంటున్న అవుతు శ్రీధర్‌రెడ్డి తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు. ‘‘నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన ఘటనలు జరిగే అవకాశం?? ఎన్నికల మూడ్ మార్చేసే సంఘటనలు’’. ఇదీ పోస్టు సారాంశం. సరిగ్గా నాల్గవరోజున శనివారం విజయవాడలో గులకరాయి దాడి జరగడం.. డ్రామాకు ముందే స్క్రీన్‌ప్లే రాసుకున్నారన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. పైగా `ఎన్నికల తరుణంలో అత్యంత అలెర్ట్‌గా ఉండాల్సిన డీజీపీ, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టలేకపోవడం.. డ్రామాలో పోలీస్ పాత్రనూ శంకించాల్సి వస్తుంది. విజయవాడ సీపీ అతనిపై కేసు పెట్టి విచారించాల్సిన సంఘటన ఇది.
అలాంటిదేమీ జరక్కపోవడం `కాన్‌స్పిరసీ కోణంలో పోలీస్ పాత్రను అనుమానించకుండా ఉండలేం. సీఎం యాత్ర సాగే సందర్భంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఎందుకు కలిగింది? గులకరాయి ఏ దిక్కునుంచి తగిలిందో పసిగట్టినపుడు వైసీపీ కార్యకర్తలు, పోలీసులు తక్షణం ఆ దిక్కుకు ఎందుకు వెళ్లలేదు? సీఎం జగన్‌రెడ్డికి రక్షణగా బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఎందుకు అడ్డు పెట్టలేదు? అసలు చీకట్లో సీఎం యాత్రను పోలీసులు ఎలా అనుమతించారు? ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే చంద్రబాబును దూషిస్తూ ప్లకార్డులతో వైసీపీ నేతలు రోడ్లపైకి ఎలా రాగలిగారు? వీవీఐపీ వాహనం చుట్టూ ఉండే రోప్ పార్టీ ఎందుకు లేదు? రాయి తగిలాక కూడా బస్సువద్ద జనాన్ని పోలీసులు ఎందుకు క్లియర్ చేయలేదు? బస్సులోనే రెండుసార్లు చికిత్స చేసిన వైద్యులు, అంతా అయిపోయాక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని కోరడం వెనుక కారణం?
ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తర్వాత మళ్లీ కేసరపల్లి క్యాంప్‌కు జగన్ ఎందుకొచ్చినట్టు? స్వల్ప గాయమేమని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు చెప్పిన తరువాతా, జగన్ నాటకీయ పరిణామాలకు తెరలేపడం? దాడి జరిగిన బెదురుగానీ, ఆగ్రహంకానీ జగన్‌లో కనిపించక పోవడం.. ఇత్యాది ప్రశ్నలన్నీ ‘పక్కా డ్రామా’ అనడానికి ఊతమిచ్చేవే.
ఇటీవల ఎర్రగొండపాలెంలో ఎన్నికల యాత్ర నిర్వహిస్తున్న విపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ మూకలు రాళ్లదాడికి దిగడం తెలిసిందే. అప్పటికప్పుడు రక్షణ దళాలు తక్షణం బుల్లెట్ ఫ్రూఫ్ షీట్లు అడ్డుపెట్టి చంద్రబాబుకు గాయాలు కాకుండా అడ్డుకోగలిగారు. అలా ఇక్కడ ఇప్పుడు ఎందుకు చేయలేదన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఎందుకూ అంటే `ఇక్కడ పక్కాగా స్కెచ్ ప్రకారం రాయి దాడి జరగాలి, జగన్‌కు గాయం కావాలి… రక్తం కారాలి.. డ్రామా రక్తికట్టాలి.. జగన్‌పట్ల సానుభూతి పండాలి… విపక్ష నేతపై ప్రజలు ఆగ్రహంచాలి.. జగన్‌కు ఎన్నికల మైలేజ్ రావాలి.. అద్భుతమైన నట కౌశలాన్ని ప్రదర్శించిన జగన్ నెగ్గాలి. ఇంతుంది `వైసీపీ స్కెచ్. ఇదీ వాస్తవానికి ఎన్నికలను గతి తిప్పే గులకరాయి కథ. పోగాలం దాపురించినపుడు `బుద్ధి వక్రీకరించి పెడమార్గం పడతాడు ఎవడైనా అని పెద్దలంటారు. ఇపుడు జగన్ అదే స్థితిలో ఉన్నాడు. గులకరాయి దెబ్బా తప్పలేదు. రేపు ఎన్నికలలో జనంకొట్టే ఓటు దెబ్బా తప్పదు. రాజకీయ ‘మలుపు’, భవిష్యత్‌కు ‘మేల్కొలుపు’ అంటే ఇదే!!