అమరావతి: చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ పై వైసీపీ నేతల్ని ప్రజలు ఛీ కొడుతున్నా..ఇంకా సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్ర హం వ్యక్తం చేశారు.ఈ భూమ్మీద తానే అపరమేధావిని అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. బెయిల్ పై విడుదలైన చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేందుకు తరలి వచ్చిన జనసందోహాన్ని చూసి సీఎం జగన్ సహా వైసీపీ నేతలు వణికి పోతున్నా రని బుధవారం ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు పేర్కొ న్నారు. కోర్టు నిభంధనలున్నా చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వేలాది మంది జనం వచ్చారు, అందుకే రాజమండ్రి నుంచి విజయవాడ రావటానికి 16 గంట లు పట్టింది. అదే కోర్టు నిభంధనలు లేకుంటే అంతకు నాలుగు రెట్లు జనం వచ్చేవారు. రాజమండ్రి నుంచి విజయవాడరావటానికి ఇకఎన్నిరోజులు పట్టేదో? కోర్టు నిభంధనలు ఉల్లంఘించకుండా చంద్రబాబునాయుడు కారులోనే ఉండి ప్రజలు, కార్యకర్తలకు చిరునవ్వుతో అభివాదంచేశారు. చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు ఇబ్బందేంటి?
చంద్రబాబు నాయుడుని, లోకేశ్‌ని చూస్తే వైసీపీ నేతలు ఎందుకింతగా వణికిపోతున్నారు? లోకేశ్ ఢల్లీి వెళ్తే వైసీపీ నేతలు గల్లీల్లో పెడబొబ్బలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు బెయిల్ పై బయటకొస్తే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి 52 రోజులు జైల్లో నిర్బందించారు, బెయిల్ రాకుండా అనేక కుట్రలుచేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఇన్ని రోజులైనా ఒక్క ఆధారం సేకరించలేకపోయారు. ఇప్పుడు మద్యం లో అక్రమాలంటూ చంద్రబాబునాయుడుపై మరో అక్ర మ కేసుపెట్టారు. ప్రజా బలం ఉన్న నాయకుడు చంద్ర బాబు నాయుడు. ఎన్ని కేసులు పెట్టినా టీడీపీ జెండా దారంలోని నూలుపోగును కూడా పీకలేరు. మరో 5 నెలల తర్వాత వైసీపీ నేతల్ని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.