- నా ఎస్సీలు అని రాగాలు తీయడం తప్ప జగన్ రెడ్డి దళితులకు చేసింది శూన్యం
- నాలుగున్నరేళ్ల పాలనలో దళితులపై జరిగిన దారుణాలే అందుకు నిదర్శనం
- రూ.28వేల కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించిన దళిత ద్రోహి జగన్‌రెడ్డి
- సామాజికంగా.. ఆర్థికంగానే కాక రాజకీయంగా కూడా దళితుల్ని జగన్ అణిచివేస్తున్నాడు
- నియోజకవర్గాలు మార్చిన 11 మంది ఎమ్మెల్యేల్లో దళితులే ఎక్కువ, ఇతరుల్ని మార్చే ధైర్యం జగన్ రెడ్డికి లేదు
అమరావతి: దళితులపై జగన్‌రెడ్డిది కపట ప్రేమ అని టీడీపీ సాంస్కృతికవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంత గాని నరసింహ ప్రసాద్ విమర్శించారు.నోరు తెరిస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు అని రాగాలు తీసే జగన్ రెడ్డికి నిజంగా దళితులపై ఎంత ప్రేమ ఉందో ఎన్సీఆర్బీ నివేదికతో బట్టబయలైందన్నారు. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో దాదాపు 188మంది దళితులు ప్రాణాలు కోల్పోతే, 637మంది దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయని, 300పై చిలుకు హత్యాయత్నాలు, వేలసం ఖ్యలో దాడులు జరిగాయని తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుని పుణ్యమా అని దళితులు ఇప్పటికి తమ కాళ్లపై తాము నిలబడి ఎవరిపైనా ఆధారపడకుండా బతుకుతున్నా రన్నారు. కానీ జగన్‌రెడ్డి వల్ల దళితులు మరలా ఇతరు ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన పరిస్థితు లు వచ్చాయి. దాదాపు రూ.28వేల కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించిన దళిత ద్రోహి జగన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం దళితులకు అమలు చేస్తున్న పథకాల్ని రాష్ట్రంలో ఎక్కడా అమలు కాకుండా చేసిన దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి.చంద్రబాబునాయుడు దళితుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన విదేశీవిద్య, పెళ్లికానుక, క్రిస్మస్ కానుక, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, భూమి కొను గోలు పథకం వంటి అనేక పథకాల్ని రద్దుచేసిన దళిత వ్యతిరేకి జగన్‌రెడ్డి అని పంతగాని మండిపడ్డారు.
కళ్లుండి చూడనట్టుగా దళితులపై జరిగే దారుణాల్ని సమర్థిస్తున్నాడు
డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడే జగన్‌రెడ్డి నోరు తెరిచి ఉంటే, నేడు రాష్ట్రంలో దళితులపై ఈ స్థాయిలో నేరాలు, దారుణాలు జరిగేవి కావు. వరప్రసాద్‌కు శిరో ముండనం చేయించినప్పుడు, దళిత బాలికపై అత్యాచా రానికి పాల్పడి ఆమెను పోలీస్‌స్టేషన్ ఎదుట పడేసిన ప్పుడు జగన్‌రెడ్డి పెదవి విప్పి ఉంటే, వేలసంఖ్యలో దళితులపై దారుణాలు జరిగేవికావు. కళ్లుండి చూడ నట్టుగా, నోరుండి మాట్లాడలేని మూగవాడిగా జగన్ రెడ్డి దళితులపై జరిగే దారుణాల్ని సమర్థిస్తున్నాడు. దళితులు వాళ్ల కాళ్లపై వారు నిలబడి, స్వయంగా ఎదిగేలా చంద్రబాబు వారికి ఊతాన్ని అందిస్తే, నాలు గున్నరేళ్లలో జగన్‌రెడ్డి వారిని నమ్మించి నట్టేట ముం చాడు. దళితజాతిని నిర్వేదం, నిరాశా, నిస్పృహల్లో ముంచేశాడు. రాత్రి కాళ్లు నరికేసి, పగలు చేతికి ఊతకర్ర అందించినట్టుగా జగన్‌రెడ్డి దళితులపై కపట ప్రేమ చూపుతున్నాడని పంతగాని దుయ్యబట్టారు.
దళితులు తలుచుకుంటే ఎక్కడి నుంచి వచ్చాడో మరలా అక్కడికే పోతాడు
యర్రగొండపాలెంలో పోలీసుల చేతిలో అవమానానికి గురైన దళిత యువకుడు మోజేశ్ నేడు ప్రాణాలు కోల్పోవడానికి కారణం జగన్ రెడ్డి కాదా? నా ఎస్సీలు అని ఊరికే మాట అనడం కాదు.. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్ రెడ్డి తక్షణమే దళితుల పక్షాన నోరెత్తాలి. దళితుల్ని సామాజికంగా, ఆర్థికంగా అణచివేసిన జగన్ రెడ్డి.. నేడు రాజకీయంగా కూడా తన పార్టీలోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రుల్ని ఇతర స్థానాలకు మార్చేసి, వారికి అన్యాయం చేశాడు. ఇతర వర్గాల ఎమ్మెల్యేల్ని మార్చే సాహసం జగన్ రెడ్డికి లేదు. ఎందుకంటే వారు తిరగబడతారని జగన్ కు భయం. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో రానున్నది టీడీపీ ప్రభుత్వమే. చంద్రబాబు అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి చేతిలో దగాపడిన దళితులకు న్యాయం జరుగుతుంది. దళితులు తలుచుకుంటే జగన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడో మరలా అక్కడికే వెళ్తాడని పంతగాని హెచ్చరించారు.