అమరావతి: అక్రమ కేసులతో జగన్ చేస్తున్న క్షుద్ర రాజకీయానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా క్షోభిస్తుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ఏపీ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత నీచమైన రాజకీయాలు ఎవరూ చేయలేదు. రోజుకో అరెస్టుతో జగన్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు… ప్రతి పక్షాలతో రాజకీయంగానే పోరాడారు తప్ప…తప్పుడు కేసులతో వేధించలేదు. నేడు పులివెందుల ప్రజల్లో కూడా జగన్ రెడ్డిపై వ్యతిరేకత మొదలైంది. కడప జిల్లాలో టీడీపీ ఇన్చార్జులు ప్రవీణ్ రెడ్డి, బీటెక్ రవి అరెస్టులు జగన్ పిరికితనానికి అద్దంపడుతున్నాయని సోమిరెడ్డి ట్వీట్ చేశారు.