అమరావతి, చైతన్యరథం: ప్రభుత్వశాఖ ల వెబ్సైట్లలో సీఎం జగన్, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మార్చి 18 మధ్యాహ్నం 8 గంట లకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కోడ్ అమల్లోకి వచ్చిన క్షణం నుంచి ప్రభు త్వ వెబ్ పేజీల్లో రాజకీయ పార్టీలకు చెం దినవారి ఫొటోలు ఉండరాదని పేర్కొన్నా రు. నేటికీ వాటిలో ముఖ్యమంత్రి, మంత్రు ల చిత్రాలు దర్శనమిస్తున్నాయని ఆరోపిం చారు. వీటిని తొలగించాలంటూ వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన సెక్రటరీలు, శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేయాల ని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.