- టీడీపీ నేతల ఇళ్లలో పోలీసుల తనిఖీలు అప్రజాస్వామికం
- ఈసీ తక్షణం జోక్యం చేసుకోవాలి
- ప్రత్యేక పరిశీలకులను పంపించాలి
- అవసరమైతే కేంద్రబలగాలను దించాలి
అమరావతి: ఓటమి ఖాయమని తేలి పోవడంతో ముఖ్యమంత్రి జగన్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నాడని టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండి పడ్డారు. జగన్ నియంత పోకడలకు తట్టు కోలేక ఇటీవల నెల్లూరు జిల్లాలోని సీని యర్ నేతలంతా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడంతో జీర్ణించు కోలేని సైకో జగన్ టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పాడని ఒక ప్రకటనలో లోకేష్ ధ్వజమెత్తారు.
మాజీమంత్రి నారా యణ అనుచరులైన విజేతారెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, ఫైనా న్షియర్ గురుబ్రహ్మం ఇళ్లపైకి పోలీసులను పంపి భయానక వాతావరణం సృష్టించా రు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్న సమయంలో పోలీసులు జగన్ చేతిలో కీలుబొమ్మలుగా మారడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడమే. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే జోక్యం చేసుకొని జగన్ తొత్తులుగా మారిన కొంతమంది పోలీసు అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలి. నోటిఫికేషన్‌కు ముందే ఆంధ్రప్రదేశ్‌లో అధికారపార్టీ అరాచకపర్వానికి తెరలేపిన నేపథ్యంలో ప్రత్యేక పరిశీలకులను పంపించాలి. అవసరమైతే కేంద్రబలగాలను రంగంలోకి దించాల్సిందిగా లోకేష్ కోరారు.