- వైసీపీ నేతలకు ఏది కనిపించినా దోచేస్తున్నారు
- ప్రతి రోజు మీ పొలాలు, స్థలాలు ఉన్నాయో లేదో చూసుకోండి
- చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రభవిష్యత్తు బాగుంటుంది
- బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు భువనేశ్వరి పిలుపు
బద్వేల్, పోరుమామిళ్ల: జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలన మొత్తం దోపిడీల పర్వంగా కొనసాగిందే తప్ప, సామాన్యులకు ప్రయోజనం కలిగించే పనులేవీ వైసీపీ ప్రభుత్వం చేయలేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం, పోరుమామిళ్లలో చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతి చెం దిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి గురువారం పరామర్శించారు.
పరామర్శల అనంతరం పోరు మామిళ్ల ప్రజలతో భువనేశ్వరి మాట్లాడుతూ… వైసీపీ పాలనలో కల్తీ మద్యం, ఇసుక దోపిడీ, భూ కబ్జాలు, గంజాయి, డ్రగ్స్, మహిళలపై దాడుల్లో ఏపీని భారత దేశంలోనే జగన్మోహన్రెడ్డి మొదటిస్థానంలో నిలబెట్టాడని విమ ర్శించారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం లో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీని నిలబెట్టారు. టీడీపీ పాలనలో ఏపీకి పెట్టుబడులు భారీగా వచ్చాయి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి.
గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో ఒక్క పెట్టు బడి కూడా రాలేదు.. ఒక్క కంపెనీ కూడా రాలేదు. యువత నిరుద్యోగ సమస్యతో చాలా ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. టీడీపీ ప్రభుత్వం తెచ్చిన కంపెనీలన్నీ వైసీపీ పాలనలో పక్కనున్న రాష్ట్రాలకు తరలి వెళ్లిపో యాయి. ఏపీకి రాజధాని లేకుండాచేసి వైసీపీ ప్రభు త్వం రాష్ట్రం పరువు తీసింది.
తెలంగాణను తలదన్నేది
గత ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఐదేళ్లు మన ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే, చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నట్లయితే ఏపీ రూపురేఖలు తెలంగాణాను తల దన్నేలా మారేవి. తెలంగాణ నేడు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కారణం చంద్రబాబు ముందు చూపుతో తెచ్చిన కంపెనీలే. నేడు తెలంగాణలో స్థిరపడిన ఐటీ ఉద్యోగులు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో బయటకు వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. రాష్ట్రానికి మేలు చేస్తారని, ప్రజల్లో బలంగా నిలిచిపోతారనే కుట్రతోనే చంద్రబాబును వైసీపీ ప్రభు త్వం అక్రమంగా జైల్లో పెట్టింది. ఒక్క కేసును కూడా నేటికీ నిరూపించలేకపోయారు.
కార్యకర్తలే రథసారథులు
గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అనేక దారుణాల ను టీడీపీ నేతలు, కార్యకర్తలు సమర్థవంతంగా ఎదు ర్కొన్నారు. వారిపై వైసీపీ ప్రభుత్వం అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టింది. వందలాది టీడీపీ కార్యకర్తలను దారుణంగా చంపి పొట్టనపెట్టుకుంది. పార్టీకోసం ప్రాణాలర్పించిన కార్యకర్తలందరికీ నాజోహార్లు. తెలు గుదేశంపార్టీకి కార్యకర్తలే రథ సారథులు.. నా ధైర్యం కూడా అదే.పార్టీ కార్యకర్తలు రక్షణగా ఉన్నారనే ధైర్యం తోనే నేను అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. బయటకు వచ్చి ధైర్యంగా తిరగగలుగుతున్నాను. రానున్న ఎన్నిక లు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ఎన్ని కలు. దీనికి ప్రతి కార్యకర్త, నాయకుడు సంసిద్ధంగా ఉండాలి.
వైసీపీ చేసే అరాచకాలను ధైర్యంగా తిప్పి కొట్టి, 2024ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో దుర్మా ర్గుల పాలనను అంతం చేయాలి. రాష్ట్ర ప్రజలు ప్రతి రోజు మీఓటుజాబితాలో ఉందో,లేదో సరిచూసు కోవా లి. అదేవిధంగా మీకు సంబంధించిన స్థలాలు, పొలా లు కూడా ఉన్నాయా,లేదా చూసుకోవాలి. వైసీపీ నాయ కులు తమకు ఏది కనిపిస్తే దాన్ని ఇష్టారీతిన దోచు కుంటున్నారు.. అడిగితే దాడులు చేస్తున్నారు. చంద్ర బాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు… భావితరాల భవిష్యత్తు బాగుంటుంది.చంద్రబాబు సీఎం అయితే సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తారు. సంక్షేమంతో పాటు భవిష్యత్తుకు కూడా గ్యారెంటీ ఉం టుందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గుర్తుపెట్టుకోవా లని భువనేశ్వరి అన్నారు.