- పింఛను సొమ్ము కాంట్రాక్టర్లకు దోచిపెట్టాడు
- పండుటాకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు
- పులివెందుల కంటే దారుణంగా కోనసీమ
- జగన్‌ది సంక్షేమం కాదు సంక్షోభం
- వైసీపీ ఎన్నికల గుర్తు ‘గొడ్డలి’ పెట్టుకోవాలి
- టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు వేరైనా అజెండా ఒక్కటే
రామచంద్రాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు
రామచంద్రాపురం (చైతన్యరథం): అవ్వా తాతల ఫించన్ సొమ్మును కమీషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్లకు దోచిపెట్టి జగన్‌రెడ్డి శవరాజకీయాలకు తెరలేపాడని తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబునాయుడు ధ్వజమెత్తారు. పింఛన్లు సైతం సక్ర మంగా పంపిణీ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని దుయ్యబట్టారు. బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో నిర్వహిం చిన ప్రజాగళం సభలో జగన్ పింఛను డ్రామాలపై చంద్రబాబు తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశాడన్నారు. నాడు ముద్దులు పెట్టి నేడు పిడి గుద్దులు గుద్దుతున్నాడని, వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ‘మే 13ఎప్పుడొస్తుందా? వైసీపీని బంగాళాఖాతంలోకి ఎప్పు డు విసిరికొడతామా అని ప్రజలు ఎదురు చూస్తున్నా రు. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు వేరైనా అజెండా ఒక్కటే. మా కలయిక రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని చంద్రబాబు ఉద్ఘాటించారు.
జగన్ గత ఎన్నికల్లో బాబాయిని చంపి, కోడికత్తి డ్రామాతో లబ్ది పొందాడు. ఈ ఎన్నికల్లో పింఛన్లపై శవ రాజకీయాలు చేసి లబ్ది పొందాలనుకుంటున్నాడు. పింఛన్లు ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ. నాడు ఎన్టీఆర్ రూ.35 పించన్ ఇచ్చారు.నేను రూ.200 ఉన్న పింఛన్‌ని రూ.2వేలకు పెంచా. జగన్‌రెడ్ది విడతలవారీ గా రూ.1000 పెంచి గొప్పలు చెప్పుకుంటున్నాడు. వాలంటీర్లు లేకపోతే సచివాలయ సిబ్బందితో పింఛన్లు ఇవ్వలేరా? 1.25లక్షల సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఒక్కొక్కరు 40 మందికి పంపిణీ చేస్తే రెండు రోజుల్లో ఫించన్లు పంపిణీ పూర్తవుతుంది.కానీ కేవలం రాజకీయ లబ్దికోసం సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేస్తు న్నారు. ఒకటో తేదీనే ఫించన్ ఇవ్వాలి. కానీ నేడు 3వ తేదీ అయినా ఫింఛన్లు ఇవ్వలేదు. కమీషన్ల కోసం రూ.13 వేల కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పేదలకు పింఛన్లు ఇవ్వటం చేతకాని దద్దమ్మ శవ రాజకీయం చేస్తున్నాడంటూ జగన్ వైఖరిపై విరుచుకుపడ్డారు. ‘సచివాలయం సిబ్బంది లబ్దిదారుల ఇళ్లకువెళ్లి రెండు రోజుల్లో ఇవ్వొచ్చు. నీకు చేతకాకపోతే దిగిపో. నేను ఒక్కరోజులో పంపిణి చేసి చూపిస్తా అని చంద్రబాబు సవాల్ చేశారు. పింఛన్లు ఇస్తామని ఉదయం రమ్మన్నా రు. సాయంత్రం వరకు పింఛన్ ఇవ్వలేదు. కనీసం మంచినీటి సౌకర్యాన్నీ కల్పించలేదు. ఎండదెబ్బకు చనిపోయిన వృద్దులతో శవ రాజకీయం మెదలు పెట్టారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. సొంత బాబాయిని చంపి నాపై, సొంత చెల్లిలిపై నింద వేశారు. 2014లో తండ్రిలేని బిడ్డను అంటూ తిరిగాడు. 2019లో బాబా యిని చంపి మా మీద నెట్టారు. ఇప్పుడు వృద్ధులను చంపి శవ రాజకీయం చేస్తున్నారు. ఈ పాపం వైసీపీనే వెంటాడుతుంది. వైసీపీ భూస్థాపితం కాక తప్పదు. మృతదేహంతో ఒక మంత్రి నా ఇంటికి వస్తానని హడా వుడి చేస్తున్నాడు. ఇలాంటి డ్రామాలు నా దగ్గర కాదు. అలాంటి వారికి తగిన గుణాపాఠం చెబుతా?’ అని చంద్రబాబు తీవ్రస్వరంతో హెచ్చరించారు.
పులివెందులకంటే దారుణం కోనసీమ
కోనసీమలో గతంలో ఎప్పుడైనా అల్లర్లు, దాడులు జరిగాయా? నేడు పులివెందులకంటే దారుణంగా తయారైంది. దీనికి కారణం సైకో జగనేనని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘మద్య నిషేధం చేయకపోతే ఓటడగనన్నాడు. ఇప్పుడు ఓటెందుకు అడుతున్నాడు? మద్యం తయారీ, అమ్మకం అంతా జగన్‌దే. మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవు? జగన్ బ్రతుకే ఫేక్ బ్రతుకు. నేడు పేదలకు ఇసుక దొరకటం లేదు. టీడీపీ హయాంలో రూ.1000 ఉన్న ట్రాక్టర్ ఇసుక నేడు రూ.5 వేలు. శాండ్, లిక్కర్ మాఫియాకు డాన్ జగన్‌రెడ్డి. ఆయన తిన్నదంతా కక్కిస్తా’నని చంద్రబాబు హెచ్చరించారు.
జగన్‌ది సంక్షేమం కాదు సంక్షోభం
ఎన్నికల ముందు కరెంట్ చార్జీలు పెంచనని చెప్పి అధికారంలోకి వచ్చాక 9సార్లు పెంచారు. చెత్త పన్ను, వృత్తి పన్నులు వేశారు. నిత్యవసర ధరలు, ఆర్టీసీ, పెట్రోల్ ధరలన్నీ పెంచారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచేశాడని ధ్వజమెత్తారు. పరిపాలన చేతకాని జగన్, పేదలను నిరుపేదలు చేశాడని ఆగ్రహించారు. రాష్ట్ర విభజన నాటికి తెలంగాణకు ఏపీకి తలసరి ఆదాయంలో 35శాతం వ్యత్యాసం ఉంది. 2014-19లో దాన్ని 27 శాతానికి తగ్గించాం. జగన్ అసమర్దత వల్ల అది నేడు 45 శాతానికి పెరిగింది. ఇదేనా జగన్ చేసిన అభివృద్ది? జగన్‌ది సంక్షేమం కాదు సంక్షోభం అని విమర్శించారు. తాను సీఎంగా ఉన్నపుడు 100కి పైగా సంక్షేమ పధకాలు అమలు చేశామని, అన్న క్యాంటీన్, చంద్రన్న భీమా, పెళ్లికానుక, రంజాన్, క్రిస్మస్ కానుకలు, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్, కార్పొరేషన్ రుణాలు, ఆదరణ పనిముట్లు.. ఈ పథకాలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. జగన్ నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడ్డాడని విమర్శలు గుప్పించారు.
ఒక్క టీచర్ పోస్టయినా భర్తీ చేశావా?
తాను సీఎంగా 8సార్లు డీఎస్సీ పెట్టామని, ఎన్టీఆర్ 3 డీఎస్సీలు పెట్టారని గుర్తు చేస్తూ.. ఇప్పుడున్న టీచర్లలో 75శాతం నేను నియమించిన వాళ్లేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్‌రెడ్డి ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదు. ఒక్క డీఎస్సీ పెట్టలేని, ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేని దద్దమ్మ నాగురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఇస్తానని, ఉద్యోగాలు కల్పిస్తానని ప్రామిస్ చేశారు. ‘జాబు రావాలంటే బాబు రావాలి. జగన్ పాలనలో గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్స్‌తో యువత నిర్వీర్యమైతోంది. పరిశ్రమలు తీసుకువస్తే ఉద్యోగాలు వచ్చి సంపద పెరుగుతుంది. అంతేతప్ప కమీషన్ల కోసం పరిశ్రమల్ని తరిమేస్తే సంపద పెరుగుతుందా? జగన్‌రెడ్డి ఐదేళ్లలో రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశాడు. ఆ అప్పంతా ఎవరు కట్టాలి? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక్కడ మంత్రి చెల్లుబోయిన వేణు చెల్లని కాసులా మారాడు. దోపిడితో నియోజకవర్గాన్ని కొల్లగొట్టాడు. వైవీ సుబ్బారెడ్డి దగ్గర మోకాళ్లు మీద కూర్చుని బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. అలాంటి వ్యక్తి కావాలా? ఆత్మగౌవరంతో బ్రతికే ఎన్డీయే అభ్యర్ది సుభాష్ కావాలా? అని ప్రజలను అడిగారు.
అధికారంలోకి రాగానే హామీలు నెరవేర్చుతాం
ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే కోటిపల్లి, కుమ్మర సావరం, కోళ్ల గ్రామాల్లో గోదావరి కరకట్ట మరమ్మతు చేస్తాం. రామచంద్రాపురం, గంగవరం మండలాల్లో డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తాం. రోడ్లకు మహర్దశ తీసుకొస్తాం. కాల్వ ఆధునీకరణ చేస్తాం. టిడ్కో ఇళ్లు లబ్దిదారులకే అప్పగిస్తాం. కోటిపల్లి, నర్సాపురం రైల్వే లైన్ బాలయోగి కల. దీన్ని పూర్తి చేసే బాధ్యత మాదే. ఇక్కడ ఓఎన్జీజీసీ ప్రాజెక్టు పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. అది అయ్యే వరకు మత్స్యకారులకు నెలకు రూ. 11500 ఇవ్వాలి. కానీ టీడీపీ వస్తే అవి నిలిచిపోతాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది, నమ్మొద్దు. మీకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తాం. పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామని, ప్రజలు ఎన్డీయే కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు నాయడు విజ్ఞప్తి చేశారు.
వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌కి బదులు గొడ్డలి పెట్టాలి
దళితులకు శిరోముండనం చేసిన వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది. మరో ఎమ్మెల్సీ దళిత డ్రైవర్‌ని చంపి డోర్ డెలివరి చేశాడు. ఇలాంటి వాళ్లను జగన్ పక్కన పెట్టుకుని ఊరేగుతున్నాడని ధ్వజ మెత్తారు. ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ అంటూ, బాలయోగిని లోక్‌సభ స్పీకర్ చేసింది తమ పార్టీయేనని, అది మా బ్రాండ్ అన్నారు. జగన్ బ్రాండ్ బూమ్‌బూమ్ అని ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే నోరు పారేసుకోవడమో, శవరాజకీయాలో కాదంటూ, అలాంటి రాజకీయాలు చేసేవారికి తగిన విధంగా గుణపాఠం చెబుతానన్నారు. బాబాయిని ఎవరు చంపారో నీ చెల్లికి సమాధానం చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. ఫ్యాన్ అరిగిపోయి తిరగడం మానేసిందంటూ, వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌కి బదులు గొడ్డలి గుర్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. గొడ్డలి రాజకీయాలు సహిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు.