అమరావతి: ఉత్తరాంధ్రలోని ప్రకృతి సంపద, ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఆస్తుల్ని కొట్టేయడానికే జగన్ రెడ్డికి ఉన్నఫళంగా విశాఖపట్నంలో నివాసముండాలనే ఆలోచన వచ్చిందని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. దానికోసం ఏకం గా సాగర నగరానికే తలమానికంగా నిలిచే రుషికొం డను ముఖ్యమంత్రి బోడికొండగా మార్చేసి,ఆ కొండను తన అడ్డాగా మార్చుకుంటున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రంపై రూ.10లక్షల కోట్లకు పైగా అప్పులభారం మోపిన వ్యక్తి తననివాసం కోసం రూ.400కోట్లు తగలే యడం ఎంత దారుణమో ప్రజలే ఆలోచించాలన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రుషికొండపై ఉన్న రిసార్ట్స్, ఇతర పర్యాటక నిర్మాణాల్ని తొలగించి, తన రాజ ప్రాసాదం నిర్మించుకుంటున్న జగన్ రెడ్డి, నిర్మాణంలో భాగంగా ఒక్కో చదరపు అడుగుకి రూ.24 వేల రూపాయల వ్యయంతో, మొత్తంగా రూ.164 కోట్లతో అంచనాలు రూపొందించారు. జగన్ తన రాజ భవనం నిర్మించుకోవడానికి అప్పటికే అంతకు ముందు రుషి కొండపై ఉన్న దాదాపు రూ.200 కోట్ల విలువైన నిర్మాణాలను నేలమట్టం చేయించాడు. అక్కడి మట్టిని, ఇతరత్రా భవన నిర్మాణ వ్యర్థాలను రూ.190 కోట్లకు అమ్ముకున్నారు. రూ.164కోట్ల అంచనా వ్యయంతో రుషికొండపై తాను నివాసముండటానికి రాజభవనం నిర్మాణాన్ని మొదలుపెట్టిన జగన్‌రెడ్డి, ఇప్పుడు ఆ వ్య యాన్ని ఏకంగా రూ.350 నుంచి రూ.400 కోట్లకు పెంచాడని అనిత విమర్శించారు.
రాష్ట్రంపై రూ.10లక్షల కోట్లకు పైగా అప్పుల భారం మోపిన జగన్‌రెడ్డి..ప్రజలకు అరకొర సంక్షేమం అందిస్తూ, ఉద్యోగులకు సరిగా జీతాలు, పింఛన్ దారు లకు నెలానెలా సక్రమంగా పింఛన్లు అందించకుండా తన ప్యాలెస్ నిర్మాణానికి మాత్రం ఏకంగా రూ.350 కోట్ల నుంచి రూ.400కోట్లు వెచ్చిస్తున్నాడు. ప్రజలు.. రాష్ట్రం ఎలాపోతే నాకేంటి.. నా దర్జా.. రాజభోగాలు మాత్రం తగ్గకూడదన్నదే జగన్‌రెడ్డి ఆలోచన. కేవలం లక్షా 40వేల చదరపు అడుగుల భవననిర్మాణానికి రూ.400కోట్లు ఖర్చు చేయడం ఎంత దారుణమో ప్రజ లు ఆలోచించాలని అనిత అన్నారు.
ఏదో ఒకనాడు ప్రజల పరం కాక తప్పదు
జగన్‌రెడ్డి రుషికొండపై తాను ఉండటానికి నిర్మిస్తు న్న భవనానికి వెచ్చిస్తున్న రూ.400కోట్ల సొమ్ముతో కొన్నేళ్లపాటు పేదలకు అన్న క్యాంటీన్ల ద్వారా కడుపు నింపవచ్చు. అదే సొమ్ముతో ఎన్నో గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించవచ్చు. వృద్ధులు, వికలాంగు లకు కొన్నేళ్లు పింఛన్లు ఇవ్వవచ్చు. కానీ ఇలాంటి మంచిపనులు చేయడానికి జగన్‌రెడ్డికి మనసురాదు. జగన్‌రెడ్డి ఈ విధంగా ప్రజల సొమ్ముతో కట్టే భవనా లు.. ఆక్రమించే ఆస్తులు అన్నీ ఏదో ఒకనాడు ప్రజల పరం కాక తప్పదని అనిత హెచ్చరించారు.