- వైసీపీ నేతలకు కట్టబెట్టేందుకు సాగిన సెటిల్‌మెంట్లు
- కలెక్టర్లు.. వ్యూహాత్మకంగా సహకరించడం దారుణం
- తక్కువ ధరకే బేరసారాలు.. వినకుంటే నాడు బెదిరింపులు
- భూములు ఇప్పించాలంటూ గగ్గోలుపెట్టిన బాధితులు
- పలు సమస్యల పరిష్కారానికి ప్రజావేదికలో అర్జీలు
అమరావతి (చైతన్య రథం): జగన్ జమానాలో రాష్ట్రంలోని చుక్కల భూములను గత పాలకుడు జగన్ టార్గెట్ చేసుకున్నారని ‘ప్రజావేదిక’లో బాధితులు మొరపెట్టుకున్నారు. దాదాపు 2 లక్షల ఎకరాలకు పైగావున్న భూములను కొట్టేయడానికి జగన్, అతని పరివారం స్కెచ్ వేసుకుందని అర్జీలలో ఆరోపించారు. ఆ నేపథ్యంలోనే `భూములపై సర్వాధికారాలు కలెక్టర్లకు అప్పగించి.. పేదల అనుభవంలోవున్న చుక్కల భూములపై జిల్లా కలెక్టర్లతోనే సెటిల్‌మెంట్లు చేయించారన్నారు. భూములు వైసీపీ నేతలకు అమ్మాలని ఒత్తిడి చేశారని.. తక్కువ ధరకే భూములను కొట్టేసే ప్రణాళికలు అమలు చేశారన్నారు. పేదల అనుభవంలోని భూములకు సంబంధించి అన్ని ఆధారాలువున్నా.. పేదలకు చెందాల్సిన భూములు వారికి దక్కుండా ఆఫీసుల చుట్టూ తిప్పారని.. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాం గ్రామానికి చెందిన పలువురు బాధితులు వాపోయారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో వాన్‌పిక్ భూముల విషయమై నేతలు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఎమ్మెల్సీ అనురాధ, రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తిలకు అర్జీ ఇచ్చి తమ గోడు చెప్పుకున్నారు. ఆరేళ్లనుంచీ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని.. వాస్తవం పరిశీలించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
టీడీపీకి ఓట్లు వేశామన్న కోపంతో వేణుగోపాల్ అనే వ్యక్తి అర్థరాత్రి తమ ఇంటిపై దాడి చేసి తన భార్య తల పగలకొట్టాడని.. తీవ్రమైన గాయాలతో మార్టూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే అధికారులు వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని బాపట్ల జిల్లా మార్టూరు మండలం రాజుపాలానికి చెందిన బాధితులు నేడు గ్రీవెన్స్‌లో వాపోరారు.
అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం గానుగలగొంది గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు విజ్ఞప్తి చేస్తూ.. ఆదివాసీలకు చెందాల్సిన పోలవరం ముంపు పరిహారాన్ని వైసీపీ నేతలు తప్పుడు పత్రాలు, నకిలీ రికార్డులతో దండుకున్నారని.. దీనిపై విచారించి చర్యలు తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని అర్జీ సమర్పించారు.
గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా గన్నవరం మండలం అజ్జంపురంలో 54.74 ఎకరాలు రైతుల నుండి తీసుకుని వారికి అమరావతిలో ఫ్లాట్లు కేటాయిస్తామని చెప్పి కేటాయించకపోవడంతో వారు నేడు న్యాయం కోసం గ్రీవెన్స్‌లో నేతలను అభ్యర్థించారు.
అధికారుల తప్పుతో నిరుద్యోగులు నష్టపోతున్నారని.. ప్రకాశం జిల్లాలో 167 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగావున్నా.. 72 పోస్టుల భర్తీకే అధికారులు వివరాలు ఇవ్వడంతో నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని.. అన్ని పోస్టులను భర్తి చేసి ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగ వ్యాయామ విద్యా పోరాట సమితి సభ్యులు కోరారు.
తాము కొనుగోలు చేసి ఎమ్మిగనూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రర్ చేయించుకున్న భూమి ఆన్‌లైన్‌లో ప్రభుత్వ భూమిగా పడిరదని.. తప్పును సరిచేయాలని ఏడాదిగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని.. విచారించి ప్రభుత్వ భూమి నుండి తమ భూమిని వ్యవసాయ భూమిగా మార్చాలని కర్నూలు జిల్లా నందవరం గ్రామానికి చెందిన వి. గోవింద రాజులు విజ్ఞప్తి చేశారు.
ఏపీ ప్రభుత్వం 28.11.22న కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కొరకు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ప్రిలిమనరీ పరీక్ష 22.01.2023 న నిర్వహించగా ప్రశ్నాపత్రంలో తప్పులు ఉండటంతో తమకు మార్కులు తగ్గాయని.. తగ్గిన మార్కులు యాడ్ చేయకుండా దాన్నే ఫైనల్ చేయడంతో తాము నష్టపోతున్నామని.. మార్కులు యాడ్ చేసి క్వాలిఫై అయిన వారిని కూడా పిజికల్ టెస్ట్, ఫైనల్ రాత పరీక్షకు పిలిచి ఉద్యోగాలు కల్పించాలని పలువురు అభ్యర్థులు వేడుకున్నారు.
గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన ఓ మహిళ అర్జీని సమర్పిస్తూ.. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోగా పోలీస్టేన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళితే.. అక్కడ సీఐ ముందే స్టేషన్ రైటర్ అన్యాయంగా తనను కొట్టాడని.. అతన్ని సస్పెండ్ చేయాలని బాధిత మహిళ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.