అమరావతి: మాజీ సీఎం జగన్ ట్వీటర్‌లో వ్యక్తం చేసిన అంశాలన్నీ అబద్దాల పుట్ట అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో మాజీ సీఎయం జగన్ చేసిన ట్వీట్లపై విరుచుకు పడ్డారు. ఆయన పార్టీ నేతలు కూడా ఆత్మ విమర్శ మాని ఎదురుదాడిలో మునిగిపోతున్నారన్నారు. జగన్ వంటి దోపిడీదారే వ్యవస్థీకృత నేర రాజకీయాలు చేస్తాడన్నారు. 2004లో కేవలం రెండు కోట్ల రూపాయల లోపు ఆస్తి ఉన్న జగన్‌కు లక్షల కోట్ల ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని మితిమీరి దోపిడీ చేశాడని సీబీఐ ఛార్జిషీట్లలో లేదా అని నిలదీశారు. చట్టబద్ద వ్యాపారం, పాలన చేసే చంద్రబాబుకు వ్యవస్థీకృత నేర రాజకీయాల అవసరం లేదన్నారు. ఉచ్చనీచాలు మరచి మహిళల శీలహననం చేసే అపర దుశ్శాసనుల భరతం పట్టడం స్వీవస్థీకృత నేరమా అని ప్రశ్నించారు.
జగన్ తన దుష్ట లక్షణాల్ని ఎదుటివారికి అంటగట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం అలవాటుగా మార్చుకున్నారన్నారు.
జగన్ ట్వీట్‌లో సారాంశం నేరాల సమర్థన పరనింద తప్ప ఆత్మ విమర్శ లేదన్నారు. అబ్దాలతో ఎదురుదాడి చేసే నేత రాజకీయ భవిత కనుమరుగౌతుందనేది చారిత్రక సత్యమన్నారు.
ఎక్స్ వేదికగా జగన్ అబద్దపు ఆరోపణ నెం.1 : ‘‘వ్యవస్థీకృత నేర రాజకీయాల్లో చంద్రబాబు బరితెగింపు’’
నిప్పులాంటి నిజం : చట్టబద్దంగా 35 ఏళ్ల నుండి ఒకే ఒక్క పరిశ్రమ నడుపుతూ లక్షలాది పాడి రైతులకు, వినియోగదారులకు నమ్మకమైన సేవ చేస్తూ సక్రమంగా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్న చంద్రబాబు కుటుంబానికి వ్యవస్థీకృత నేర రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది?
వ్యవస్థీకృత నేరాలు చేసేవారు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రతిఏటా బహిరంగంగా ప్రజలకు చెబుతారా? చంద్రబాబు లాగా జగన్ తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు బహిరంగంగా ఎందుకు ప్రకటించడంలేదు?
2004 లో 2 కోట్ల లోపు ఆస్తి ఉన్న జగన్ కు నేడు లక్షల కోట్ల ఆక్తికి ఎలా పడగలెత్తారు?
చట్టబద్దమైనవి మరియు సూట్ కేసు కంపెనీలు అన్నీ కలిపి 50కి పైగా కంపెనీలు ఎలా వచ్చాయి?
వ్యవస్థీకృత దోపిడి, నేర రాజకీయాలతోనేనని సీబీఐ చార్జిషీట్లు స్పష్టం చేయడంలేదా? మీ కుటుంబం దోపిడీ ఆస్తుల పంపకం బజారున పడిరది అందుకే కదా? దీన్ని డైవర్షన్ చేయడానికి చివరకు తల్లి, చెల్లి శీల హననానికి బరితెగిచింది వ్యవస్థీకృత జగన్ సోషల్ మీడియా సైకోలు కాదా? దోపిడీ దారే వ్యవస్థీకృత నేర రాజకీయాలు చేస్తారు. చివరకు చిన్నానన్నను క్రూరంగా చంపిన నేరస్థులకు కొమ్ము కాయడానికి బరితెగిస్తారు. చట్టబద్దమైన వ్యాపారం, పాలన చేసే చంద్రబాబుకు వ్యవస్థీకృత నేర రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు అభివృద్ధి, సంక్షఏమ పాలనకు బ్రాండ్ అంబాసిడర్ అనేది జగమెరిగిన సత్యం. జగన్ మీ దుష్ట లక్షణాల్ని చంద్రబాబుకు అంటగట్టి చెప్పిన అబద్దమే వంద సార్లు చెబితే ఎల్లకాలం జనం నమ్మరు. అందేకు 11 సీట్లతో బుద్ధి చెప్పారు. నిర్మాణాత్మక రాజకీయాల వైపు మారకపోతే మీ వైసీపీ మునిగిపోక తప్పదు.
జగన్ అబద్ధపు ఆరోపణ : 2 : కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి వాటి ప్రసారాలు ప్రజలకు చేరనీయకుండా కట్ చేశారు. చంద్రబాబుకు కొరుకుడు పడనిది ఒకే ఒకటి. అదే సోషల్ మీడియా.
నిప్పులాంటి నిజం : జగన్ పాలనలోనే కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి ఏబీఎన్, టీవీ5, ఈటీవీ ప్రసారాల్ని కట్ చేశారు. జీవో నెంబర్ 2430 తెచ్చి పత్రికా స్వాతంత్య్రం హరించేశాడు. జీవో నెం. 1 తెచ్చి ప్రతిపక్షాలపై నిర్బంధాలు విధించాడు. అసెంబ్లీ కవరేజ్ కు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, టీవీ5, ఏబీఎన్ లను అనుమతించలేదు. సాక్షికి యాడ్స్ ద్వారా రూ.430 కోట్లు ప్రజాధనం దోచిపెట్టారు. ఐప్యాక్, సజ్జల ఆధ్వర్యంలో వేలాది మందితో పెయిడ్ సోషల్ మీడియా సైకో గ్యాంగుల్ని సృష్టించారు. ప్రశ్నించే పార్టీలు, ప్రజాసంఘాలు, చివరకు కుటుంబ సభ్యుల శీల హననానికి పాల్పడుతున్న సైకో గ్యాంగులను విచ్చలవిడిగా అనుమతిస్తే సభ్య సమాజం ఏమౌతుంది? ఏ పౌరుని వ్యక్తిత్వానికైనా రక్షణ ఉంటుందా? దోపిడీ డబ్బు వెదజల్లి నేటికి రాష్ట్రంలోని నీలి మీడియాతోపాటు, కొంత జాతీయ మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నది మీరే. 11 ఏళ్ల నుండి కోర్టు విచారణకు హాజరు కాకుండా ఎలా వుండగలుతున్నారు?
జగన్ అబద్ధపు ఆరోపణ.. 3: ‘ప్రజలకు మంచి చేసి కాకుండా, మభ్య పెట్టి, మోసం చేసి, అబద్ధాలాడి అధికారంలోకి రావాలని, దాన్ని ఇలాగే నిలబెట్టుకోవాలన్నది చంద్రబాబు సిద్ధాంతం
నిప్పులాంటి నిజం : పైన చెప్పిన లక్షణాలన్నీ అచ్చం జగన్ వే. తన దుష్ట లక్షణాల్ని చంద్రబాబుకు అంటగట్టి, చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్ నైజం. జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజలకు పది రూపాయలిచ్చి వారి వద్ద వంద దోచేశాడు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించి సామాజిక న్యాయం గొంతు కోయడమేకాక, పేదలకు మేలు చేసినట్టు అబద్దపు ప్రచారాలకు వేల కోట్లు తగలేశాడు. పేదలకు చెప్పింది అబ్దాలు కాబట్టే వారు, మరియు అభివృద్ధి చేయలేదు కాబట్టి జగన్ ను జనం 11 సీట్లతో పతనం చేశారు. జగన్ పాలనలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదనేది నిజం. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అనేది జగమెరిగిన సత్యం. రాష్ట్రం దివాళా తీసినా ఐదు నెల్లోనే చంద్రబాబు 150కి పైగా మంచి పనులు చేశారు. 2019 లో చంద్రబాబు మీ అబద్దపు ప్రచారాలకు, కుట్రలకు ఓడిపోకుండా కొనసాగి వుంటే ఈసరికే పోలవరం నదుల అనుసంధానం పూర్తయి, ఏపీ కరువు రహిత రాష్ట్రమయ్యేది. ప్రజా రాజధాని అమరావతి పూర్తి అయి 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు, ఉపాధి వచ్చివుండేది.
జగన్ అబద్దపు ఆరోపణ…4 :- ఎప్పుడో రెండేళ్ల క్రిందట మా అమ్మ కారు బరస్ట్ అయితే, అప్పటి వీడియోను…లేటెస్ట్ గా ఇప్పుడే జరిగినట్టుగా, మీరు మీ ట్వీట్ లో పెడుతూ, నాతల్లిని నేను చంపాలని అనుకొన్నానని సిగ్గుమాలిన రీతిలో వ్యక్తిత్వ హననానికి దిగావు.
నిప్పులాంటి నిజం : ఎప్పుడు అనేది కాదు విజయమ్మగారి కొత్త కారు టైర్ బరస్ట్ అయ్యిందనేది నిజం. ఇది అసాధారణం కాదా? మీ తల్లిని కోర్టుకు మీరే లాగింది నిజం. ఆమెను వైకాపా గౌరవాధ్యక్షురాలిగా తొలగించింది నిజం. ఓడిపోయే విశాఖలో నిలబెట్టింది నిజం. వివేకానందరెడ్డి హంతకులను కాపాడుతున్నది నిజం. వివేకా హత్య నారాసుర రక్తచరిత్ర అని సాక్షిలో రాసింది నిజం. ఆస్తికోసం సునీత తన తండ్రి వివేకానందరెడ్డిని చంపించిందని మీ మీడియాలో రాయిస్తున్నది నిజం. అందరి వ్యక్తిత్వాలను మీ సైకో సోషల్ మీడియా ద్వారా హననం చేస్తున్నది నిజం కాదా జగన్?
జగన్ అబద్దం…5 :- వ్యవస్థీకృత నేరాల క్రింద అరెస్టు చేయాల్సింది ఎవరిని? జీవిత ఖైదు చేయాల్సింది ఎవరికి? చంద్రబాబుకు కాదా?
నిప్పులాంటి నిజం:- క్రైం రికార్డు ఉన్నది జగన్ కే. సుమారు 38 తీవ్రమైన కేసులు విచారణలో ఉన్నవి. కోర్టు వాయిదాలకు 11 ఏళ్ల నుండి కుంటి సాకులతో తప్పించుకుని తిరుగుతున్నావు. కోర్టు వాయిదాలకు హాజరైతే జీవిత ఖైదు పడేది జగన్ కే. చంద్రబాబుపై తండ్రి తనయుల పాలనలో డజన్ల కొలది అక్రమ కేసులు, సభాసంఘాలు వేసి విచారణలు జరిపారు. ఒక్కదానికి రుజువు చూపలేక న్యాయస్థానాల్లో తెల్లముఖం పెట్టింది మీరు కాదా? చంద్రబాబుది చట్టబద్దపాలన. జగన్ ది దోపిడీ, నేర సామ్రాజ్యమని తెలియందెవరికి? సాక్షి మరియు నీలి మీడియా అబద్దాలతో వాస్తవాలను తారుమారు చేయడం ఇక సాధ్యం కాదు జగన్. ప్రజల్లో చైతన్యం వచ్చింది.