- ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు కారణం ఆయనే
- ఐదేళ్ల పాలనలో గంజాయి,డ్రగ్స్‌తో భ్రష్టుపట్టించాడు
- మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులకు కారణం జగన్‌రెడ్డి పెంచిపోషించిన గంజాయి, డ్రగ్సే అని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. మం గళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆమె మాట్లాడారు. జగన్ పాలనలో ఏపీ అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యం వల్ల మృగాళ్లుగా మారిన మగాళ్లు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆ పాపం ఇంకా రాష్ట్రాన్ని వెంటాడు తూ ఆడబిడ్డల పాలిట శాపమైందన్నారు. జగన్‌రెడ్డి హయాంలో వేలాదిగా అత్యాచారాలు, హత్యలు జరిగితే ఒక్కరోజూ ఎందుకు పరామర్శించలేదు? ఆ కుటుం బాలను ఎందుకు ఆదుకోలేదు? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఇంటి సమీపంలో ఎస్సీ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నిందితుడు వెంకటరెడ్డిని ఐదేళ్ల పాటు అరెస్ట్ చేయకుండా చోద్యం చూసి ఇప్పుడు మహిళల రక్షణ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌రెడ్డికి లేదన్నారు. సొంత నియోజ కవర్గంలో దళిత మహిళ నాగమ్మ అత్యాచారానికి గురైతే పట్టించుకోకపోగా ప్రశ్నించిన టీడీపీ దళిత నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారని అన్నారు. రాజమండ్రిలో 16 ఏళ్ల బాలికపై ఏడుగురు యువకుల అత్యాచారం, విశాఖలో ఎస్సీ బాలికపై 10 మంది మృగాళ్ల అత్యాచారం, నెల్లూరు జిల్లాలో విదేశీ యువతిపై మృగాళ్ల దాడి వంటి ఘటనలు, మైనారిటీ విద్యార్థిని మిస్బాను వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేయడం వంటి ఘటనలు మహిళా భద్రత విషయంలో జగన్ రెడ్డి పాలనలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో తెలుస్తుం దన్నారు. తెనాలిలో దాడికి గురైన మహిళ కేసులో నిందితుడు నవీన్ అతని కుటుంబం మొదటినుంచి వైసీపీ పార్టీకి చెందిన వారమని స్వయంగా నవీన్ తల్లి చెబుతుండగా జగన్‌రెడ్డి అండ్ కో నిందితుడు టీడీపీ నాయకుడంటూ అబద్ధపు ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. కాకినాడలో దుర్గాప్రసాద్, నెల్లూరులో హరిప్రసాద్ హత్యకు గురైతే ఆ దళిత కుటుంబాలను జగన్‌రెడ్డి ఎందుకు పరామర్శించలేదు? అక్కడ నేరస్థులు వైసీపీ వారు కావడమేనా కారణమా? అని ప్రశ్నించారు. లేని దిశ చట్టం పేరుతో హడావిడి చేసిన జగన్ రెడ్డి ఆ చట్టంతో ఎంతమంది నేరస్థులను శిక్షించారో సమాధానం చెప్పాలని కోరారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయని జగన్ మహిళలకు ఏం న్యాయం చేస్తాడు? పిన్నమ్మ తాళి తెంచిన నేరస్తులను కాపాడుతున్న సైకో జగన్, దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఆయన భార్య తాళి తెంచిన నేరస్తుడిని కాపాడుతున్న సైకో జగన్ మహిళలకు ఏం న్యాయం చేస్తాడు అని ప్రశ్నించారు. సొంత చెల్లిపై, తల్లిపై కేసులు వేసి వాళ్లను ఇబ్బందులు పెడుతున్న జగన్‌రెడ్డి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలోని మహిళలపై చెల్లెమ్మ లంటూ కపట ప్రేమ చూపిస్తున్నాడన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిర్ణీత సమయంలోనే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడానికి ఆదేశాలిస్తున్నారని తెలిపారు.