మద్యం మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని, ఈ మాఫియాకు సూత్రధారి..పాత్రధారి మీరు కాదా చంద్రబాబు అని, అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం షాపులను మూసివేసి వాటిని ప్రైవేటుకు, మీ వాళ్లకు అప్పగించాలన్న ఉద్దేశంతో అవినీతి కోసం వేసిన స్కెచ్ కాదా? అని జగన్‌రెడ్డి ప్రశ్నించారు. ఫక్తు లిక్కర్ వ్యాపారిలా ఆలోచిస్తున్నారు..మీరు అమలు చేస్తున్న మద్యం విధానం రాష్ట్రానికి, ప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరం..మీ చర్యలు వెంటనే సరిదిద్దుకోవాలంటూ సుభాషితాలు చెప్పా రు జగన్‌రెడ్డి. అసలు మద్యం విధానంపై మాట్లాడే అర్హత మీకు ఉందా జగన్‌రెడ్డి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీ హయాంలో మద్యం మాఫియా ఎంతటి సామాజిక విధ్వంసం సృష్టించిందో కళ్లకు కడుతున్నా మద్యంపై సుభాషితాలు, నీతులు చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదా? కాలకూట విషం వంటి మందును తాగబోయించి జనాన్ని రోగాల పాలు జేసి మద్యం విక్రయాల ద్వారా వేల కోట్ల రూపాయలను దండుకున్నది మీరు, మీ ముఠా కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మద్యం మీద ఆదాయం అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమేనని సుద్దులు చెప్పిన పెద్ద మనిషి అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని నంగనాచి కబుర్లు చెప్పి ఆ వాగ్దానాలన్నింటికీ మంగళం పాడి దేశంలో మరెక్కడా కనీవినీ ఎరగని స్థాయిలో మద్యం కుంభకోణానికి పాల్పడిరది మీరు కాదా? ప్రభుత్వ మందు షాపుల్లో నగదు లావాదేవీలకు మాత్రమే అను మతించి స్వాహా పర్వానికి పాల్పడిరది మీరు కాదా? మోసకారి మాటలతో అధికారంలోకి వచ్చి మద్యం మహమ్మారిని రాష్ట్రం మీదకు వదిలి జనం సొమ్యును, ఆయురారోగ్యాలను దోచేసిన మీకు మద్యంపై మాట్లాడే అర్హత ఉందా? విషతుల్యమైన మద్యం కారణంగా ఎన్నో తాళిబొట్లు తెగిపోయా యి. ప్రభుత్వ మందు మాయల కారణంగా రూ.18 వేల కోట్లకు పైగా రాష్ట్ర ఆదాయం కోల్పోయినట్లు, మద్యం సరఫరా సంస్థల నుంచి రూ.3,113 కోట్ల వరకు కమీషన్లు మీ ముఠా దండుకొన్నట్లు సమాచారం. దీనికి సమాధానం చెప్పగలరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రతిపక్ష నేతగా ఇంటింటా కాపురాల్లో చిచ్చు పెడుతున్న మద్యాన్ని మూడు దశల్లో నిషేధించి, స్టార్ హోటళ్లలో తప్ప ఎక్కడా మద్యం దొరక్కుండా చేస్తానని అధికారంలోకి వచ్చి గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రాన్ని మధ్యధరా సముద్రం చేసి, అభాగ్య జన జీవితా ల్ని ఛిద్రం చేసిన జనకంటక పాలనలో రూ.3.50 లక్షల కోట్ల మేర పేదల రక్తాన్ని కాసు లుగా పిండుకొన్నది నిజం కాదా? రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ వంద బ్రాండ్ల మద్యం తయారీకి అనుమతించినా వాటిలో తమకు ఇష్టమైన పదహారు బ్రాండ్ల అమ్మకాలు ఎక్కు వగా సాగేలా చక్రం తిప్పింది మీరు కాదా? జే బ్రాండ్ మద్యంలో ప్రాణాంతకమైన హానికర రసాయనాలున్నాయని రుజువైనా మద్యం రాబడికి గండికొట్టి, సంక్షేమ అభివృద్ధి కార్యక్ర మాలను అడ్డుకోవాలన్నదే లక్ష్యం అంటూ ప్రతిపక్షంపై విషం కక్కి పిచ్చి మందును వెనకేసు కొచ్చింది మీరు కాదా? ప్రముఖ బ్రాండ్లను రాష్ట్రం నుంచి తరిమేసి మీ వాళ్ల డిస్టిలరీల నుంచే అడ్డమైన బ్రాండ్ల మద్యాన్ని కొనిపించి అభాగ్యుల జీవితాలతో మృత్యుక్రీడలాడిరది మీ ప్రభుత్వం కాదా? మందుబాబుల గొంతుల్లో గరాటాలు పెట్టి గరళం పోసిన మీ పైశా చికత్వం అంతటితో ఆగకుండా భవిష్యత్తులో వచ్చే మద్యం ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి, రూ.40 వేల కోట్ల రుణాలను తెచ్చింది మీ ప్రభుత్వం కాదా? మీ హయాంలో పిచ్చిమందు విక్రయాల విలువ ఏకంగా 44 శాతం పెరిగింది నిజం కాదా? మద్యం తయారీ, సరఫరా, అమ్మకం అన్నీ మీ వాళ్ల పరం చేసి, బార్ల సంఖ్యను పెంచి, వాక్ ఇన్ స్టోర్లు తెరిచి, బెల్టుషాపుల దందా కొనసాగించి, బార్లు, బెల్టు షాపుల్లో అధిక ధరలతో అనధికారికంగా దోచుకున్నది రూ.30 వేల కోట్లని సమాచారం. దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు?
నకిలీ మద్యం బారిన పడిన మందుబాబుల ఆరోగ్యం వేగంగా క్షీణించి ప్రాణాలు కోల్పోయారు. మద్యం తాగే అలవాటున్నా సరే కాలేయం దెబ్బతినాలంటే కనీసం 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. కానీ రాష్ట్రంలో మద్యం తాగే అలవాటున్న వారికి నాలు గున్నరేళ్లలోనే కాలేయం పాడైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో లభించే నాసిరకం మద్యం వల్లే ఇంత త్వరగా కాలేయం పాడైపోయిందని బాధితులు, వారి కుటుంబసభ్యులు నాడు దుమ్మెత్తి పోసింది నిజం కాదా? మద్యానికి బలైపోయింది నీరుపేదలే. మద్యం అలవాటు మానుకోలేక..వారు కోరుకునే మద్యం దుకాణాల్లో లభించక తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నాసిరకం మద్యాన్ని తాగి మీ పాలనలో పేద, మధ్యతరగతి వారే చివరికి సమిధలు అయ్యారు. నెలల వ్యవధిలోనే ఆరోగ్యం క్షీణించిపోయి ప్రాణాలు కోల్పో యారు. బాధితుల్లో యువత కూడా ఎక్కువగా ఉండటం బాధాకరం. యువత మొదట్లో మద్యం సరదాగా మొదలుపెట్టి తర్వాత దానికి బానిసలైపోతున్నారు. మత్తు చాలక గంజా యి వంటి మాదకద్రవ్యాల వైపు మళ్లారు.
జగన్‌రెడ్డి అయిదేళ్ల పాలనలో కాలకూట విషం మద్యం తాగి దాదాపు పది లక్షల మంది రోగాలబారిన పడ్డారు. విషతుల్యమైన బ్రాండ్లను జనం మీదకు వదలడంతో ఆరో గ్యం దెబ్బతిని వైద్యఖర్చుల రూపేణా అభాగ్యులు నష్టపోయింది రూ.40 వేల కోట్లని సమాచారం. రాష్ట్రంలో మద్యం సేవించేవారు సుమారు 40 లక్షల మంది ఉంటే అందులో 30 లక్షల మంది మద్యానికి బానిసలయ్యారు. రాష్ట్రంలో రోజూ తాగేవారు 30 లక్షల మంది ఉంటారు. రోజూ తాగే వారిని ప్రాతిపదికగా తీసుకుంటే రోజుకు రూ.270 చొప్పున నెలకు రూ.81 కోట్లు అవుతుంది. జగన్ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రూ.30 వేల కోట్ల మద్యం అమ్మేలా ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనాలు వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.28,108 కోట్ల విలువైన మద్యాన్ని వైసీపీ ప్రభుత్వం విక్రయించింది. జగన్ ప్రభుత్వానికి మందుబాబులు కొండంత అండగా నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వంలోనూ రూ.లక్ష కోట్ల మద్యం అమ్మకాలు అనే మాట వినలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో దాదాపు రూ.లక్షన్నర కోట్ల మద్యం విక్రయించి రికార్డు సృష్టిం చింది. షాపుల సంఖ్య తగ్గింపు, ధరల పెంపు వంటివి ప్రజలను మభ్యపెట్టడానికేనని రికార్డు మద్యం అమ్మకాల ద్వారా తేలిపోయింది. ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో రూ.3 లక్షల కోట్ల వరకూ వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు చెబు తుంటే అందులో రూ.లక్ష కోట్లు ఒక్క మద్యం రాబడిపైనే జగన్ ప్రభుత్వం సమీకరించింది. పేదలు రోజంతా కష్టపడి రూ.500 సంపాదిస్తే అందులో సగానికి పైగా మందుకే ఖర్చు పెట్టారు. నాటుసారా తాగితే ఎక్కువ, లిక్కర్ తాగితే తక్కువ ప్రమాదం అంటూ తన మద్యం విధానాన్ని అడ్డగోలుగా అసెంబ్లీలోనే సమర్థించుకున్న జగన్‌రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వ మద్యం విధానాన్ని విమర్శించడం గురివింద సామెతను గుర్తు చేస్తుంది. జగన్‌రెడ్డి సారథ్యం లోని మద్యం మాఫియా ఎంతటి సామాజిక విధ్వంసం సృష్టించిందో కళ్లకు కడుతున్నా మద్యంపై సుభాషితాలు, నీతులు చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదా అంటున్నారు ప్రజలు.