అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో సోమవారం నుంచి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. నిరసనకు దిగారు. ఆయన చేపట్టిన దీక్ష 4వ రోజుకి చేరుకుంది. ప్రజా సమస్యలను పరిష్కరించాలని టీడీపీ కౌన్సిలర్స్‌తో దీక్ష చేస్తున్నారు జేసీ. ఉన్నతాధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల తీరును, కమిషనర్ అక్రమాలను నిరసిస్తూ ప్రభాకర్ రెడ్డి మునిసిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని రోడ్డుపైనే దీక్షకు దిగారు. రోడ్డుపైనే స్నానం చేశారు. అనంతరం కౌన్సిలర్లతో కలిసి నిరసన కొనసాగించారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న మునిసిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని జెసి ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో దీక్ష చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున చేరుకున్నారు. ఆయన నిరసన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా నిర్లక్ష్య ధోరణి వ్యతిరేకంగా సోమవారం నుంచి టిడిపి మున్సిపల్ కౌన్సిలర్లు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఆఫీస్ సమీపంలోని నిద్రిస్తున్నారు.