- సూత్రధారులు, పాత్రధారులను అరెస్టు చేయాలి
- ఆమె జీవితం నాశనం చేసిన వారిని శిక్షించాలి
- టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్
విజయవాడ(చైతన్యరథం): వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు బాలీవుడ్ నటి జెత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారం చూశాం. గంట, అరగంట మంత్రులను చూశాం. ఇప్పుడు సకలశాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నాం. జగన్, చంద్రబాబు పాలనకు ఎంత తేడా ఉందో ప్రజలు తెలుసుకోవాలని కోరారు. జగన్, వారి మంత్రులు చేసిన అరాచకాలు, దారుణాలకు లెక్క లేదు. ఆడుదాం ఆంధ్రా అని కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు జెత్వానీ కేసులో పోలీసు అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే ఐపీఎస్‌లు పరుగులు పెట్టారంటే ఆశ్చర్యంగా ఉంది. చీటింగ్ కేసులో పోలీసులు అంత త్వరగా స్పందించడం అభినందనీయమే. మరి ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. సజ్జల కనుసన్నల్లో ఈ వ్యవహారం మొత్తం నడిపారు..ఆనాటి డీజీపీ కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాలని కోరారు. ఈ కేసులో విద్యాసాగర్, సజ్జల, రాజేంద్రనాథ్‌రెడ్డి, కాంతి రానా టాటాలను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత్రధా రులు, సూత్రధారులపై దర్యాప్తు చేయాలని కోరారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది..చివరకు ఖాకీలు కూడా కర్కశంగా వ్యవహ రించడం సిగ్గుచేటన్నారు. అమ్మాయి జీవితం నాశనం చేసిన వారందరినీ కఠినంగా శిక్షిం చాలని డిమాండ్ చేశారు.