- బీసీలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలిస్తాం
- చంద్రన్న బీమాను రూ.10 లక్షలకు పెంచుతాం
- మత్స్యకారుల పొట్టగొట్టే 217 జీఓ రద్దుచేస్తాం
- జగన్ పాలనలో బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం
- బీసీలతో ముఖాముఖిలో యువనేత లోకేష్
పాయకరావుపేట: బీసీలకి రాజకీయ, ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చింది అన్న ఎన్టీఆర్.. బీసీలకు పుట్టినిల్లు టిడిపి. బీసీలకు న్యాయం టిడిపి తోనే సాధ్యమని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం పెనుగొల్లులో బీసీ సామాజికవర్గ ప్రతినిధులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… స్థానిక సంస్థల్లో బీసీ లకి రిజర్వేషన్ కల్పించింది టిడిపి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే. ఆదరణ పథకం అమలు చేసింది చంద్రబాబు. కీలకమైన పదవులు బీసీలకి ఇచ్చింది టిడిపి. తిరిగి టిడిపి అధికారంలోకి వచ్చాక బీసీ సర్టిఫికేట్ సమస్య ను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఫోన్లో ఒక్క బటన్ నొక్కగానే శాశ్వత బీసీ సర్టిఫికేట్లు అందిస్తాం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దామాషా ప్రకారం కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. టిడిపి హయాంలో కట్టిన కమ్యూనిటీ భవనాలు పూర్తి చెయ్యలేని చెత్త ప్రభుత్వం జగన్ ది. చేనేత కార్మికులకు టిడిపి పాలనలో యార్న్, కలర్, పట్టు, మగ్గాలు సబ్సిడీ లో అందించాం. జగన్ చేనేత కార్మికులకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక చేనేత పరిశ్రమను ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.
బీసీిలను మోసగించిన జగన్
నా బీసీ, నా ఎస్సీ అంటూ జగన్ మాయ మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసగించాడు. బీసీ కార్పొరేషన్లు జగన్ నిర్వీర్యం చేసాడు. బీసీ రిజర్వేషన్లు 10 శాతం తగ్గించిన దుర్మార్గుడు జగన్. బీసీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించింది జగన్. బీసీ మంత్రి కి 100 సార్లు సవాల్ చేశా. ఎవరి హయాంలో బీసీలకు న్యాయం జరిగిందో చర్చకు సిద్ధమా అని… అటు నుండి స్పందన లేదు. బీసీ మంత్రి పేషీ లో జీతాలు ఇచ్చే దిక్కు లేదని లోకేష్ విమర్శించారు.
జగన్ పాలనలో బీసీిల ఊచకోత
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలను ఊచకోత కోయిస్తున్నారు. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని దారుణంగా వైసిపి నాయకులు చంపేశారు. అమర్నాథ్ గౌడ్ అక్క ను మా అమ్మ చదివిస్తున్నారు. బీసీ నేత నందం సుబ్బయ్య ని వైసిపి నేతలు ఘోరంగా హత్య చేశారు. 64 మంది బీసీ లను వైసిపి నాయకులు చంపేశారు. 26 వేల మంది బీసీ ల పై అక్రమ కేసులు పెట్టింది వైసిపి ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని లోకేష్ చెప్పారు.
దామాషా పద్ధతిన బీసీలకు నిధులిస్తాం
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీిలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి నిధులు కేటాయిస్తాం. జగన్ అమ్మ ఒడి, పెన్షన్ లాంటి పథకాలకు అయ్యే ఖర్చు బీసీల పేరు మీద రాస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ తగ్గించిన 10 శాతం రిజర్వేషన్లు పెంచుతాం. మత్స్యకారులకు బోట్లు, వలలు, డీజిల్, టూ వీలర్, ఐస్ బాక్సులు అన్ని సబ్సిడీలో అందించింది టిడిపి ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు అందిస్తాం. మేత , మందులు కూడా సబ్సిడీలో అందిస్తాం. పెంపకం కోసం బంజరు భూములు కేటాయిస్తామని లోకేష్ చెప్పారు.
చంద్రన్న బీమా రూ.10లక్షలకు పెంచుతాం
టిడిపి అధికారంలోకి వచ్చాక చంద్రన్న బీమా రూ. 5 లక్షల తో ప్రారంభించి రూ. 10 లక్షలకు పెంచుతాం. కల్లుగీత కార్మికులను ఆదుకుంది టిడిపి. జగన్ కల్లుగీత కార్మికుల పొట్ట కొట్టాడు. జే బ్రాండ్లు అమ్ముకోవడానికి కల్లుగీత కార్మికులను వేధిస్తున్నాడు జగన్. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చెట్ల పెంపకం కోసం సాయం చేస్తాం. చెట్ల పై నుండి పడిపోయి చనిపోయిన వారి కుటుంబాలకు జగన్ ప్రభుత్వం ఎటువంటి సాయం అందడం లేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కుటుంబాలను ఆదుకుంటాం. లిక్కర్ షాపుల్లో కల్లుగీత కార్మికులకు వాటా ఇస్తాం. కల్లుగీత కార్మికులకు పని లేని సమయంలో సాయం అందిస్తాం. నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
మత్స్యకారుల సమస్య పరిష్కరిస్తా
బంగారమ్మపాలెం ఎన్‌ఎఓబి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాను. ప్రభుత్వం వచ్చిన వెంటనే నేవీ వారితో సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాను. మత్స్యకారులను జగన్ చావుదెబ్బ కొట్టాడు. జీఓ 217 తీసుకొచ్చి మత్స్యకారుల చేతిలో ఉన్న చెరువులను వైకాపా నేతలు కొట్టేశారు. మత్స్యకారులను రోడ్డు పైకి నెట్టేశారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జిఓ 217 రద్దు చేసి చెరువులు మత్స్యకారులకు అందిస్తాం. వలలు, బోట్లు, ఐస్ బాక్సులు, వ్యాన్లు, టూ వీలర్లు, డీజిల్ అన్ని సబ్సిడీ లో అందిస్తాం. సబ్సిడీ కూడా పెంచుతామని లోకేష్ చెప్పారు.
పౌల్టీరంగానికి సబ్సిడీలు ఇస్తాం
జగన్ విధ్వంసక పాలనలో పౌల్ట్రీ రంగం సంక్షోభంలో పడిరది. టిడిపి హయాంలో పౌల్ట్రీ రంగానికి అనేక సబ్సిడీలు అందించాం. మన ప్రభుత్వం వచ్చిన తరువాత పౌల్ట్రీ, కాయిర్ రంగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. పౌల్ట్రీ రంగానికి పాత విధానంలో తక్కువ ధర కి విద్యుత్ అందిస్తాం. సబ్సిడీ లు అందిస్తాం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీల పై పెట్టిన అక్రమ కేసులు ఎన్ని ఎత్తేస్తాం. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెచ్చి, కోర్టు ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించేలా చేస్తామని లోకేష్ అన్నారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ…
బీసీ అయిన నన్ను 25 ఏళ్లకే ఎమ్మెల్యే చేసింది అన్న ఎన్టీఆర్. బీసీలకి రాజ్యాధికారం ఇచ్చింది టిడిపి. సేవకులను ప్రజా ప్రతినిధులుగా మార్చింది టిడిపి. బీసీలకు ఆదరణ పథకం పెట్టింది చంద్రబాబు. బీసీలను నట్టేట ముంచింది జగన్. ఆదరణ పథకం రద్దు చేసింది జగన్.
వంగలపూడి అనిత మాట్లాడుతూ…
బీసీలకు గుర్తింపు వచ్చింది టిడిపి వల్లనే. పాయకరావుపేట లో బీసీలు టిడిపి కి వెన్నుదన్ను గా ఉన్నారు. నియోజకవర్గం లో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్ పాలనలో బీసీ లు అణిచివేతకు గురయ్యారు.
బిసి సామాజికవర్గ ప్రతినిధులు మాట్లాడుతూ…
బిసిలు తన వెన్నుముక లాంటి వారన్న జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల వెన్నుముక విరగ్గొట్టాడు. గొర్రెల కొనుగోలు కోసం జగన్ ప్రభుత్వం ఎటువంటి సాయం అందించడం లేదు. టిడిపి హయాంలో మాకు గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు ఇచ్చేవారు. గొర్రెల పెంపకం కోసం బంజరు భూములు కేటాయించాలి. జగన్ ప్రభుత్వం చంద్రన్న బీమా ఎత్తేసింది. చేతి వృత్తులు చేసుకునే మేము ప్రమాదాలకు గురైతే కుటుంబం అనాథ గా మిగిలిపోతుంది. జగన్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులను పట్టించుకోవడం లేదు. చెట్ల పై నుండి పడిపోయి ఎవరైనా చనిపోతే కుటుంబానికి ఎటువంటి సాయం అందించడం లేదు. మత్స్యకారులకు జగన్ అనేక హామీలు ఇచ్చి మోసం చేసాడు.
భూముల సమస్య పరిష్కరిస్తానని మోసగించాడు
బంగారమ్మపాలెం లో నేవి భూముల సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి జగన్ మోసం చేశాడు. పోలీసుల పహారా లో వేట కి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. చేనేత కార్మికులను జగన్ నట్టేట ముంచేసింది. ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందడం లేదు. సొసైటీ ని నిర్వీర్యం చేసారు. సగర కులస్తులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. జగన్ ప్రభుత్వం బీసీ కమ్యూనిటీ హాల్స్ నిర్మించడం లేదు. మీ ప్రభుత్వం వస్తే భవనాలు నిర్మించాలి. పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. విద్యుత్ ఛార్జీలు, మేత రేటు విపరీతంగా పెరిగిపోయింది. టిడిపి పాలనలో క్యాటగిరి 5 లో ఉండేది. అది ఎత్తేసి జగన్ మమ్ములని బాదేస్తున్నాడు. జగన్ ప్రభుత్వం లో బీసీల పై పెట్టిన అక్రమ కేసులు అన్ని మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎత్తేయాలి.