- నిర్వాసితులకు మెరుగైన పరిహారం, మౌలిక సదుపాయాలు
- పొల్యూషన్ ట్రీట్ మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తాం
- కంపెనీలు తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం
- ఎస్‌ఈజడ్ నిర్వాసితులతో యువనేత లోకేష్ ముఖాముఖి
యలమంచిలి: ఎస్‌ఈజెడ్ బాధితులను జగన్ మోసం చేశాడు. టిడిపి హయాంలో ఎస్‌ఈజెడ్ బాధితులకు కొంత మేర న్యాయం చేసాం. మళ్లీ అధికారంలోకి వెంటనే ఎస్‌ఈజెడ్ నిర్వాసితులకు న్యాయం చేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నాన్నారు. యలమంచిలి నియోజకవర్గం వెదురువాడలో కొప్పులవెలమ సామాజికవర్గీయలు, ఎస్‌ఇజెడ్ నిర్వాసితులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. లోకేష్ మాట్లాడుతూ… బాధితులకు గతంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అందించాం. ఈసారి ప్యాకేజ్ తో పాటు కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎస్‌ఈజెడ్ బాధితులు, ప్రభుత్వం చర్చించి మెరుగైన ప్యాకేజ్ అందిస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్‌ఈజెడ్ కాలనీల్లో నాణ్యమైన ఇళ్లు కడతాం. గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. ఎస్‌ఈజెడ్ నుండి కలుషితనీరు బయటకి రాకుండా పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తాం. పొల్యూషన్ లేని కంపెనీలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. మొదటి 100 రోజుల్లో భారీ ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొచ్చి స్థానికంగా యువత కు ఉద్యోగాలు కల్పిస్తాం. ఎస్‌ఈజెడ్ లో ఉన్న కంపెనీల ద్వారా వచ్చే సిఎస్‌ఆర్ నిధులు ఎక్కువ శాతం నిర్వాసిత కాలనీల అభివృద్ధి కి వినియోగిస్తాం.
కొప్పులవెలమలకు జగన్ అన్యాయం
కొప్పుల వెలమలు అంటే గుర్తువచ్చేది ఆత్మగౌరవం. ఇచ్చే గుణమే తప్ప చెయ్యి చాపే అలవాటు కొప్పుల వెలమలకు ఉండదు. వ్యవసాయం మీద ఎక్కువగా కొప్పుల వెలమలు ఆధారపడి ఉన్నారు. జగన్ పాలనలో వ్యవసాయాన్ని దెబ్బతీసి కొప్పుల వెలమలకు తీరని అన్యాయం చేసాడు. ఎస్‌ఈజెడ్ బాధితుల సమస్యలు తెలుసుకోవడానికి మీ ముందుకి వచ్చాను. అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు రావాలి అంటే కంపెనీలు రావాలి. భూసేకరణ వలన ఎవరూ నష్టపోకూడదు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులను ఆదుకుంటాం. నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తాం. పని లేని సమయంలో సాయం అందిస్తాం. లిక్కర్ షాపుల్లో వాటా ఇస్తాం. తాటి చెట్ల పెంపకం కోసం సాయం చేస్తాం. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందిస్తామని చెప్పారు.
ఎస్‌ఈజెడ్ బాధితులు మాట్లాడుతూ…
ఎస్‌ఈజెడ్ కోసం భూములు, ఉపాధి కోల్పోయాం. నిర్వాసితులకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు అవ్వలేదు. మేజర్ సన్స్, మేజర్ డాటర్స్ కి ప్యాకేజ్ ఇస్తామని ఇప్పటి వరకూ ఇవ్వలేదు. ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు జగన్ ప్రభుత్వం కల్పించడం లేదు. ఎస్‌ఈజెడ్ నుండి వస్తున్న పొల్యూషన్ వాటర్ వలన అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఎస్‌ఈజెడ్ కోసం భూములు ఇచ్చిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఇవ్వలేదు. ఎస్‌ఈజెడ్ లో ఉన్న కంపెనీల ద్వారా వచ్చే సిఎస్‌ఆర్ నిధులు వైసిపి ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది. నిర్వాసిత కాలనీలకు చెందాల్సిన సిఎస్‌ఆర్ నిధులు ఇతర గ్రామాలకు ఖర్చు చేసి ప్రభుత్వం చేసినట్టు కలరింగ్ ఇస్తున్నారని చెప్పారు.