మచిలీపట్నం: రాష్ట్రంలో ప్రతి గడపను జగన్ రెడ్డి మోసం చేశాడని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నంలో నేటినుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని 25వ డివిజన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడపగడపను కడప జగన్ రెడ్డి మోసం చేశాడని కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశాడు. అర్హులైన వారికి పెన్షన్ తీసేసి వారి ఉసురు పోసుకుంటున్నాడన్నారు. తెలుగుదేశం పార్టీ హాయాంలో అర్హులైన వారు ప్రభుత్వం మారగానే ఎలా అనర్హులవుతారని ప్రశ్నించారు. వైసిపి నాయకులు కక్ష కట్టి సంక్షేమ పథకాలు ఆపేస్తున్నారని.. సాకుగా కరెంటు బిల్లులు, కలర్ టీవిలు అని డ్రామాలాడుతు పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైన ప్రశ్నిస్తే వాలెంటీర్లతో బెదిరిస్తూ పథకాలు కట్ చేస్తాం అని భయపెడుతున్నారన్నారు. ఇటీవల వర్షాలకు రోడ్లు దెబ్బతిని కనీసం మౌళిక సదుపాయాలు లేకుండా, డ్రైనేజీల సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ జగన్ రెడ్డి, వారి నాయకులు తాడేపల్లిలో 175 సీట్లు ఎలా గెలవాలా, ప్రజలను ఇంకా ఏలా మోసం చేయాలి, ఏం అబద్దాలు చెప్పి మళ్ళి అధికారంలో రావాలి అని క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బందరును అభివృద్ధి చేశామని చొక్కాలు చించుకునే వైసిపి బ్యాచ్ ఎక్కడ ఏమీ అభివృద్ధి చేశారో ప్రజలకు తెలియజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ బొడ్డు శ్రీను, డివిజన్ నాయకులు ఈశ్వర్ బాబి, మెరుగుమాల దుర్గాప్రసాద్, విశ్వనాథ్, నిమ్మకాయల రాజు, బూపతి సూర్య, దళాయి గోపాల్, బడే రమణ, రాథా సింగ్, కొల్లు రంగా, సింగోతు రవి చంద్ర, బుజ్జి, ధనబాబు, నాయకులు పాల్గొన్నారు.