- దళితులు మైనార్టీలను పొట్టన బెట్టుకున్న నరరూప రాక్షసుడు
- పదవి చేపట్టిన రెండోరోజే కోర్టులో పత్రాలు దొంగిలించిన ఘనుడు
- లోకేష్‌కు వచ్చిన స్పందన చూసి వైసీపీ నేతల పిచ్చిప్రేలాపనలు
- భూకబ్జాలు చేయడంలో దిట్ట కాకాని గోవర్థనరెడ్డి
- లోకేష్‌ను విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదు
- బాబును తిట్టకపోతే మంత్రి పదవి ఊడుద్దని భయం
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కావలి పర్యటనకు ప్రభంజనంలా వచ్చిన జనాన్ని చూసి జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు పిచ్చి ప్రేలాపనలు పేలుస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యా లయం ఎన్టీఆర్ భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధిత దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన లోకేష్ కార్యక్రమాలకు జనం భారీస్థాయిలో రావడంతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి, సాంఫీుక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, కావలి శాసన సభ్యులు ప్రతాప్ రెడ్డి ప్రెస్‌మీట్‌లు పెట్టి కారుకూతలు కూశారని మండిపడ్డారు. కాకాణి గోవర్థన సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక అక్రమాలకు పాల్ప డినట్లు చెప్పారు. ఆయన కబ్జాలు చేయడంలో దిట్టని ఆరోపించారు. ఆయన చేయని దందా లేదన్నారు. దళితుల భూములు ఆక్రమించుకొని వారికి అన్యా యం చేసినట్లు తెలిపారు.
- మాగంటి లేఅవుట్ లో ఫోర్జరీ సంతకాలతో స్థలాలను అమ్ముకున్నారని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగుల భూములను బలవంతం గా లాక్కొని రిజిష్ట్రేషన్ చేయించుకున్నట్లు పేర్కొ న్నారు. అక్రమ మైనింగ్‌పై మాజీ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ విచారణ చేపడితే కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. గోవర్థన రెడ్డి మంత్రి అయిన మూడవ రోజే తన అపార్టమెంట్ లో మైనార్టీ యువకుడు చనిపోయాడని, అతని కుటుంబానికి రూ.3 లక్షలు ఇచ్చి బెదిరించినట్లు చెప్పారు. మంత్రి అయిన రెండవ రోజు అతనిపై ఉన్న కేసు తాలుకు ఫైళ్లని దొంగల సాయంతో దొంగలించినట్లు తెలిపారు. ఆ ఘటనపై జిల్లా ఎస్పీ ఒక కథ అల్లి చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ ఫైళ్లని దొంగలించటం వల్ల ఏ దొంగలకు ఉపయోగమో ప్రజలందరికి తెలుసన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి పోలీసు స్టేషన్లకి తీసుకెళ్ళి లాఠీలతో కొట్టించినట్లు తెలిపారు. లాకప్ డెత్ చేయించడానికి కూడా వెనకాడటం లేదని మండిపడ్డారు. కాకాణి గోవర్థన రెడ్డి చరిత్ర ఇదని చెప్పారు. ఇంతటి నేర చరిత్ర ఉన్న వ్యక్తి నిజాయితితో రాజకీయాలలో ఉన్న యువనేత నారా లోకేష్‌ను విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. జగన్ రెడ్డి రోడ్డుపైకి రావాలంటే వేల మంది పోలీసుల రక్షణ అవసరమని, లోకేష్ కు అలాంటి అవసరం లేదని చెప్పారు. భాష మార్చుకోవాలని బూతులు మాట్లాడే కొడాలి నాని వంటివారికి చెప్పాలని హితబోధ చేశారు.