• ఆత్మకూరు నియోజకవర్గం కామిరెడ్డిపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
• అనంతసాగరం చెరువు అలుగు ఎత్తు పెంచడంతో మా పొలాలు ముంపునకు గురయ్యాయి.
• దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలుగు ఎత్తు తగ్గించాలి.
• లిఫ్ట్ ఇరిగేషన్ రిపేరు రావడంతో నిరుపయోగంగా మారింది.
• రిపేరుకు కావాల్సిన ఎస్టిమేషన్ వేసి టెండర్ పిలవకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.
• మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• ముఖ్యమంత్రి జగన్, ఆయన సామంతరాజులకు దాచుకోవడం, దోచుకోవడం తప్ప రైతుల ఇబ్బందులు పట్టడం లేదు.
• రైతుల కోసం కోట్లాదిరూపాయలతో గత ప్రభుత్వ హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఏర్పాటుచేస్తే నిర్వహణ నిధులు, కరెంటు బిల్లులు కట్టకుండా జగన్ ప్రభుత్వం నిరుపయోగంగా మార్చింది.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలన్నింటినీ తిరిగి వినియోగంలోకి తెచ్చి, రైతుల కష్టాలు తీరుస్తాం.
• రైతులకు ఇబ్బంది లేకుండా అనంతసాగరం అలుగు ఎత్తు సమస్యను పరిష్కరిస్తాం.