రాష్ట్రానికి అరిష్టంగా తయారైన వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ అన్నారు. గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామంలో శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి వైసిపి వైఫల్యాలను ప్రజలకు వివరించారు. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మిత్తిరెడ్డి వెంకటరమణ, లెంక సత్యనారాయణ, లెంక చిన్నంనాయుడు గోవింద, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.