- టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో టెక్కలి నుండి కుప్పం వరకు
- గోడ పత్రిక ఆవిష్కరించిన అచ్చెన్నాయుడు
అమరావతి: టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు సారథ్యంలో ఈ నెల 6వ తేదీన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుండి చిత్తూరు జిల్లా కుప్పం వరకు కార్మిక చైతన్య యాత్ర ప్రారంభించనున్నారు. ఆ యాత్రకు సంబంధించిన గోడ పత్రికను తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి కార్మిక వర్గాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయన్నారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు హయాంలో కార్మికులు ఎంతో సంతోషంగా గడిపారు. టెక్కలి నుండి ప్రారంభం అయ్యే యాత్ర లో ప్రతి నియోజకవర్గం లో కార్మికులను కలిసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు కార్మికులు ఎంత ఆనందంగా వున్నారో గుర్తు చెయ్యాలన్నారు అలాగే సైకో రెడ్డి అధికారం లోకి వచ్చిన తరువాత కార్మికులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి వివరించాలి. అలాగే 2024 లో గెలిచిన తరువాత కార్మికులకు అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి, యువగళం పాదయాత్ర లో యువనేత లోకేష్ ఇచ్చిన హామీలను కార్మికులకు వివరించి వారిలో చైతన్యం తీసుకు రావడం కోసం ఈ కార్మిక చైతన్య యాత్ర చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర రావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్, సబ్బతి ఫణిశ్వర రావు, ప్రధాన కార్యదర్శిలు రెంటపల్లి శ్యామ్, మహంకాళి నరసింహారావు, మెకర అధిబాబు, గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు దొంతా నాగ గౌడ్, తదితర నాయకులు పాల్గొన్నారు.