• సంతనూతలపాడు నియోజకవర్గం బూదవాడలో కారుమంచి మేజర్ ఆయకట్టు రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతి సమర్పించారు.
• కారుమంచి మేజర్ ఆయకట్టు కింద 16వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
• చీమకుర్తి మండలంలోని 13గ్రామాలకు సాగు, తాగునీరు ఆయకట్టు నుండి అందుతుంది.
• మేజర్ కాలువకు 2021 జనవరి9న గండిపడి తెగిపోయింది.
• దీనిపై ఆందోళన చేసినా ప్రభుత్వం సకాలంలో పట్టించుకోకపోవడంతో ఓ సీజన్ పంట నష్టపోవాల్సివచ్చింది.
• ఎన్.ఎస్.పీ కార్యాలయం ముందు రైతులమంతా ధర్నా చేస్తే, ప్లాస్టిక్ పట్టాల ద్వారా నీరు అందించే ఏర్పాటు చేశారు.
• మా పొలాలకు 100క్యూసెక్కుల నీరు కావాల్సి ఉండగా, కేవలం 20క్యూసెక్కుల నీరే అందుతోంది.
• ప్రజాప్రతినిధులు ఎవరూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు.
• రెండేళ్లుగా రైతులు పంటలు వేసే అవకాశం లేకుండా పోయింది.
• మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు.
• ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల గేట్లు, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి.
• అడ్డగోలు దోపిడీ, కమీషన్లపై తప్ప ఈ ప్రభుత్వానికి మరే ఇతర ప్రజాసమస్యలపై శ్రద్ధ లేదు.
• గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ పై 68,294 కోట్లు ఖర్చుపెట్టాం.
• అధికారంలోకి వచ్చిన వెంటనే సాగర్ కాల్వల ఆధునీకరణ చేపట్టి, కారుమంచి మేజర్ కాల్వకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం.