- 21 స్థానాలతో కూటమి ఎంపీ అభ్యర్థులదే హవా
- తెదేపా 16, బీజేపీ 3, జనసేన 2 స్థానాలు
- 22 నుంచి 4 స్థానాలకు పడిపోయిన వైకాపా
- కూటమి అభ్యర్థుల మెజారిటీలు లక్షల్లో..
- వైసీపీ అభ్యర్థుల మెజారిటీలు కేవలం వేలల్లో
- గెలిచిన స్థానాల్లోనూ వైసీపీ పట్ల వ్యతిరేకత
అమరావతి (చైతన్య రథం): ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థులను కసితీరా ఓడిరచారు. మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో 21 స్థానాలతో కూటమి అభ్యర్థులు హవా చూపిస్తే… వైసీపీ భారీ ఓటమితో నాలుగు స్థానాలకు పరిమితమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం మూడు పార్లమెంట్ స్థానాలను మాత్రమే గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ, వర్తమాన ఎన్నికల్లో 16 స్థానాలను కైవసం చేసుకుంది. కూటమి పక్షాలైన బీజేపీ 3 స్థానాలు గెలిస్తే.. జనసేన 2 స్థానాల్లో విజయం సాధించింది. వైకాపా 4 స్థానాలు గెలుచుకుంది. కూటమి అభ్యర్థుల్లో అధికశాతం 2 లక్షలకుపైగా మెజార్టీలతో విజయం సాధిస్తే.. వైసీపీ అభ్యర్థులు మెజార్టీలు కేవలం వేలకే పరిమితమైంది. అంటే, గెలిచిన స్థానాల్లోనూ వైసీపీపట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపించడం విశేషం.
విశాఖపట్నంలో తెదేపా అభ్యర్థి ఎం భరత్ తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి బొత్స రaాన్సీలక్ష్మిపై 504247 ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. గుంటూరులో తెదేపా అభ్యర్థి డా.పెమ్మసాని చంద్రశేఖర్, వైకాపా అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యపై 3,44,695 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు.
అమలాపురంలో తెదేపా అభ్యర్థి గంటి హరీష్ వైకాపా అభ్యర్థి రాపాక వరప్రసాదరావుపై 342196 ఓట్ల మెజార్టీ సాధించారు. శ్రీకాకుళంలో తెదేపా అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు వైకాపా అభ్యర్థి పేరాడ తిలక్‌పై దాదాపు 327901 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విజయవాడలో తెదేపా అభ్యర్థి కేశినేని చిన్ని తన సోదరుడు కేశినేని నానిపై 2,82,085 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. నరసాపురంలో భాజపా అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ వైకాపా అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 276802 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నెల్లూరులో తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డిపై దాదాపు 245902 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విజయనగరంలో తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు వైకాపా అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌పై 249351 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజమండ్రిలో భాజపా అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి వైకాపా అభ్యర్థి గూడూరి శ్రీనివాసులుపై 239139 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాకినాడలో జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ వైకాపా అభ్యర్థి చలమశెట్టి సునీల్‌పై 229491 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.
చిత్తూరులో తెదేపా అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు వైకాపా అభ్యర్థి ఎన్ రెడ్డప్పపై 220479 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. అనకాపల్లిలో భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుపై 296530 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బాపట్లలో తెదేపా అభ్యర్థి టి కృష్ణప్రసాద్ వైకాపా అభ్యర్థి నందిగం సురేష్‌పై 202941 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మచిలీపట్నంలో జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి వైకాపా అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావుపై 223179 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నరసరావుపేటలో తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వైకాపా అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్‌పై 1,59,729 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. తిరుపతిలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి భాజపా అభ్యర్థి వరప్రసాదరావుపై కేవలం 14569 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నంద్యాలలో తెదేపా అభ్యర్థి బైరెడ్డి శబరి వైకాపా అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిపై 111975 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. హిందూపురంలో తెదేపా అభ్యర్థి బీకే పార్థసారథి వైకాపా అభ్యర్థి శాంతపై 125607 మెజార్టీతో విజయం సాధించారు. కడపలో వైకాపా అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి భూపేష్ సుబ్బరామిరెడ్డిపై 62695 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
అనంతపురంలో తెదేపా అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, వైకాపా అభ్యర్థి ఎం శంకరనారాయణపై 188555 మెజార్టీతో విజయం సాధించారు. రాజంపేటలో వైకాపా అభ్యర్థి మిథున్‌రెడ్డి భాజపా అభ్యర్థి కిరణ్‌కుమార్ రెడ్డిపై 76071 మెజార్టీతో విజయం సాధించారు. కర్నూలులో తెదేపా అభ్యర్థి బస్తిపాటి నాగరాజు వైకాపా అభ్యర్థి బీవై రామయ్యపై 111298 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అరకులో వైకాపా అభ్యర్థి తనూజారాణి భాజపా అభ్యర్థి కొత్తపల్లి గీతపై 50580 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఒంగోలులో తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై 48542 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.