మూడేళ్లుగా పెట్రేగిపోతున్న వైసిపి సైకోలు!
మహిళలపై అడుగడుగునా వేధింపులు
మాట వినని వారిపై దాడులు, హత్యలు
సిగ్గులేకుండా వంతపాడిన వై’ఛీ’పీ మహిళానేతలు
ఒక్క ఏడాదిలోనే మహిళలపై 17,723 అఘాయిత్యాలు
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
ఒక ఫ్యాక్షనిస్టు, రక్తచరితుడు, అధికారం కోసం సొంత బాబాయినే హత్యచేసి లబ్ధిపొందిన నరరూప రాక్షసుడు, తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి 16నెలలు చిప్పకూడు తిన్న నేరప్రవృత్తిగల నేత చేతికి అధికారాన్ని అప్పగిస్తే దాని విపరిణామాలు ఎలా ఉంటాయో గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రజానీకం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా జగన్ రెడ్డి నేరమయ చరిత్రను ఆదర్శంగా తీసుకొని వైసిపి సైకోలు విచ్చలవిడిగా తెగబడుతున్నారు. ముఖ్యంగా గత మూడేళ్లుగా రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేల నుంచి గల్లీ నాయకుడికి వరకు వైసిపి మదపిచ్చగాళ్లు, మానవమృగాలు రెచ్చిపోతున్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కనీసం వారిని పల్లెత్తు మాట అనకపోగా… మహిళలపై లైంగిక వేధింపులకు దిగిన అంబటి రాంబాబు వంటివారికి మంత్రి పదవులిచ్చి ప్రమోషన్ ఇవ్వడంతో వైసిపి కామాంధులు మరింతగా రెచ్చిపోతున్నారు. అదేమని అడిగిన ప్రతిపక్షనేతలపై తప్పుడు కేసులు, ఎదురుదాడులు చేస్తూ గొంతనొక్కే ప్రయత్నం చేస్తున్నారు. భయాందోళనల్లో ఉన్న తోటి మహిళలకు అండగా నిలవాల్సిన వైసిపి మహిళా నేతలు బాధ్యతారాహిత్యంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. గన్ కంటే జగన్ ముందొస్తాడని అసెంబ్లీలో చిడతలు వాయంచిన రోజా ఒకటి, రెండు రేపులకే ఇంత రాద్ధాంతమా అంటూ సిగ్గులేని మాటలు మాట్లాడితే… కొన్నిసార్లు అత్యాచారాలు అలా జరుగుతుంటాయంటూ మహిళా హోంమంత్రి తానేటి వనిత సెలవిచ్చారు. ఈ పరిణామ క్రమంలో గోరంట్ల మాధవ్ అనే మానవమృగం ఒంటిపై బట్టలన్నీ విప్పేసుకొని ఒక మహిళతో నగ్నంగా వీడియో చాట్ చేసి అడ్డంగా బుక్కయి జగన్ రెడ్డి మహత్తర పాలన గొప్పతనాన్ని యావత్ భారతదేశానికి చాటారు.
మహిళా అధికారిణులపై వైసిపి సైకోల వేధింపులు
.రాష్ట్రంలో వైసిపి సైకోలు చెప్పే అడ్డగోలు పనులు కుదరదని చెప్పిన నేరానికి పలువురు మహిళా అధికారులపై దాడులు, వేధింపులకు తెగబడ్డారు.
.అధికార పార్టీ అవినీతిని ప్రశ్నించినందుకు చిత్తూరుజిల్లా దళిత డాక్టర్ అనితారాణికి స్థానిక వైసీపీ నేతల వేధింపులు. నిర్బంధించి వేధింపులు, అసభ్య .మేం చెప్పిన మాట వినకపోతే చీరేస్తామంటూ తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ఎంపిడిఓ కె.ఆర్ విజయపై వైసీపీ నేత వాసంశెట్టి తాతాజీ దాడి. (6-12-2021).
.నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపిడిఓ సరళ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి. చెప్పిన టైంకి ఆయన బంధువు కృష్ణారెడ్డి లే-అవుట్ కు అనుమతులు ఇవ్వలేదని బూతులు దండకం.ఇంటి విద్యుత్ వైర్లు కట్ చేశారు. వాటర్ పైపు లైన్లు ధ్వంసం స్వయంగా స్టేషన్ కు వెళ్లి బాధితురాలు ఫిర్యాదు చేసినా స్వీకరించని పోలీసులు. (5-10-2019).
.స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శ్రీకాకుళం వన్ టౌన్ సీఐ లలితపై చేయి చేసుకున్న వైసీపీ మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సమ్మ. క్యూలో రమ్మన్నందుకు సీఐపై దాడి. (12-3-2021).
.కడప ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మజపై చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్, మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాటలదాడి. అంగన్ వాడీ కేంద్రాల పనితీరు విషయంలో నీవు నీజాయితీపరురాలివా అంటూ ఏకవచనంతో పిలుపు. కడప జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ , కలెక్టర్ విజయరామరాజు సమక్షంలోనే మహిళా అధికారికి అవమానం . కంటతడి పెట్టిన అధికారిణి. (19-3-2022).
వైసీపీ పాలనలో ఊరికో ఉన్మాది
ప్రభుత్వ ఉదాసీన వైఖరితో పేట్రేగుతున్న కిరాతకులు
.రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ఉన్మాది ఊరికొకడు తయారయ్యాడు. మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేవు.
.ఇళ్లలోకి చొరబడి మహిళలను ఎత్తుకెళ్లి అత్యాచారాలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల క్షేమంగా తిరిగివస్తుందన్న నమ్మకం లేదంటే అందుకు ముఖ్యమంత్రి చేతకానితనమే కారణం.
.చంద్రబాబు గారి హయాంలో కట్టదిట్టంగా శాంతిభద్రతలు అమలు చేయడంతో నేరాలు అదుపులోకి వచ్చాయి. ప్రభుత్వం శిక్షిస్తుందనే భయంతో గుంటూరు జిల్లా దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారం చేసినవారు చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. మరి మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం మహిళా రక్షణకు ఏం చేసింది?
.2020-21లో పోలీస్ శాఖ ఇచ్చిన క్రైమ్ రిపోర్ట్ ప్రకారం మహిళలపై అత్యాచారాలు, దాడులు, లైగింక వేధింపులకు సంబంధించి 17,736 కేసులు నమోదయ్యాయి. 2019-20లో 14,603 నేరాలు నమోదుకాగా (14%) ఏడాదికే ఏకంగా 25 శాతానికి పెరిగిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నట్టు? మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నట్టు?
సీఎం సొంత జిల్లాలో వరుస అత్యాచారాలు:
.సొంత జిల్లాలో మహిళలపై అఘాయిత్యలు జరిగితే నిందితులను శిక్షించలేని జగన్ రెడ్డి రాష్ట్రంలోని ఆడపిల్లలకు ఏం రక్షణ కల్పిస్తారు?
.ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరులో 15 ఏళ్ల దళిత బాలికపై 10 మంది మృగాళ్లు పాశవికంగా పలుమార్లు అత్యాచారం చేసి నరకం చూపించారు. గర్భవతి అయిన ఆ చిన్నారికి రక్షణ కల్పించి నిందితులను శిక్షించాల్సిన పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా కేసు మాఫీకి ప్రయత్నించడం దేనికి సంకేతం? నిందితులను కాపాడటమేనా ఈ ప్రభుత్వం ఆడపిల్లలకు కల్పించే రక్షణ?
.2020, డిసెంబర్ లో పులివెందులలో దళిత మహిళ నాగమ్మపై అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంతవరకూ నిందితుడిని పట్టుకోలేదు. పైగా బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం రాజారెడ్డి రాజ్యాంగంలోనే సాధ్యమైంది.
రోజుకో ‘‘దిశ’’ ఘోరం:
.విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో యువతిపై అత్యాచారం, రేపల్లె రైల్వే స్టేషన్ లో భర్త , పిల్లల ఎదుటే వివాహితపై అత్యాచారం, గుంటూరు జిల్లా తుమ్మపూడిలో ఇంట్లోకి చొరబడి మహిళలపై గ్యాంగ్ రేప్,నర్సీపట్నంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం వంటి ఘటనలు నిత్య కృత్యమైనా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదంటే ఏమనాలి?
.శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో ఫార్మసీ విద్యార్థిని తేజస్వినిని అత్యాచారం చేసి ఆమె చున్నీతో ఫ్యాన్ కు ఉరివేస్తే నేరస్థులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నించడం ఎంత దిగజారుడు వ్యవహారమో తెలుస్తోంది. అసలు అత్యాచారమే జరగలేదని మొదట చెప్పిన పోలీసులు ఆ తర్వాత జరిగిందని చెప్పడానికి సిగ్గుగా కూడా అనిపించలేదా?
.నేరాలు, ఘోరాల్లో యూపీ, బీహార్ కూడా మనకంటే చాలా వెనకబడేలా చేయడంలో జగన్మోహన్ రెడ్డి నిర్విరామ కృషి చేశారు.
.ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో యువతిని గ్యాంగ్ రేప్ చేసిన నిందితుడు వెంకట రెడ్డిని నేటికీ అరెస్ట్ చేయలేదు.
.నరసరావుపేటలో బీటెక్ విద్యార్థిని హత్య,నరసరావుపేటలో బీటెక్ విద్యార్థిని అనూష, రాజమండ్రిలో చిన్నారిపై సామూహిక అత్యాచారం వంటి ఘటనలు నిత్యకృత్యమైనా ప్రభుత్వంలో చలనం లేదు.
ఊరికో వైసీపీ కాలకేయుడు:
.స్వయంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలే కొన్ని కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు.
.గుంటూరు జిల్లాలో 13 ఏళ్ల దళిత బాలికపై 80 మంది మానవమృగాలు అత్యాచారం చేసి నరకం చూపించారు. ఈ కేసులో వైసీపీ నేత భూ శంకర్ , ఆప్కాబ్ చైర్మన్ అనిల్ బాబు నిందితులైనా చర్యల్లేవు.
.అరెస్టయిన భూ శంకర్ వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రైట్ హ్యాండ్ అవడం, బాబు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు అనిల్ బాబు ప్రధాన అనుచరుడు కావడంతో. కేసును పోలీసులు అటకెక్కించారు.
.మహిళా ఉద్యోగులను వేధించిన వైసీపీ నాయకులపైనా కనీసం కేసు కూడా నమోదు చేయలేదు.
.హోంమంత్రి సొంత జిల్లా తూర్పుగోదావరి తాళ్లపూడిలో బాలికపై ఓ కిరాతకుడు 6 నెలలు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. బాలిక స్వయంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా మూడు రోజుల వరకూ పోలీసులు కేసు నమోదు చేయలేదు.
.ఈ ఘటనపై హోంమంత్రిని ప్రశ్నిస్తే..విచారణ జరుపుతామని చేతులు దులుపుకున్నారే కానీ నేటికీ బాధితురాలికి న్యాయం జరగలేదు. దిశా కింద నిందితుడిపై చర్యలు తీసుకోలేదు.
ముఖ్యమంత్రి, హోంమంత్రి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు:
.ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి తన బాధ్యత మరిచి ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయని మాట్లాడటం సిగ్గుచేటు.
.మహిళ అయివుండీ సాటి ఆడబిడ్డలు మృగాళ్ల చేతిలో బలైపోతుంటే అత్యాచారాలు యాధృచ్ఛికమని హోంమంత్రి మాట్లాడటం దారుణం.
.మహిళలు మానభంగానికి గురైతే నిందితులను శిక్షించకపోగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు రూ. 120 కోట్లు సాయం చేశామని హోంమంత్రి చెప్పడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.
.దిశ చట్టం అమల్లోకి వచ్చాక ముగ్గురికి ఉరిశిక్ష, ఇరవైమందికి జీవతఖైదు విధించామన్న తప్పుడు ప్రకటనలతో ప్రజలను ఎన్నాళ్లు మభ్యపెడతారు?
ఘటన జరిగినప్పుడు ఒక స్టేట్ మెంట్ ఇచ్చేసి , ఎంతో కొంత ఆర్థిక సాయం చేసేస్తే సరిపోతుందా? తల్లిదండ్రుల కడుపుకోతకు వెలకట్టగలరా?
భద్రతా వైఫల్యాన్ని ఎండగట్టిన నివేదికలు:
.దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో 3వ వంతు ఏపీలోనే జరుగుతున్నాయి. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన ఘటనలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగాయని నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదిక పేర్కొంది.
.దేశంలోనే మహిళలపై జరుగుతున్న భౌతిక దాడుల్లో మొదటి స్థానం, మానవ అక్రమ రవాణాలో 2వ స్థానం, ఎస్సీలపై జరుగుతున్న దాడుల్లో 5వ స్థానం, పని ప్రదేశాల్లో మహిళలపై జరగుతున్న లైంగిక వేధింపు ఘటనల్లో 2వ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపిన ఘనత తుగ్లక్ రెడ్డిదే.
.ఏపీ పోలీసు లెక్కల ప్రకారమే ఇప్పటివరకూ రాష్ట్రంలో 2 లక్షల 12 వేలమంది లైంగిక నేరస్థులను జియో ట్యాగింగ్ చేశారంటే మన రాష్ట్రం కిరాతకులకు అడ్డాగా మారిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
.2021లో రాష్ట్రంలో అత్యాచారం, వేధింపులు పోక్సో కేసుల సంఖ్య బాగా పెరిగింది.
.కేసుల సత్వర విచారణకు 13 జిల్లాల్లోనూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామని ఊదరగొట్టిన వైసీపీ ప్రభుత్వం కోర్టుల ఏర్పాటుపై నేటికీ పేపర్ వర్క్ కూడా పూర్తి చేయకపోవడం సిగ్గుచేటు.
.ప్రతి జిల్లాలోనూ ఫారెన్సిక్ ల్యాబ్స్ పెట్టి 176 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటనలకే పరిమితమయ్యారు.
వైసీపీ పాలనలో మహిళలపై కొనసాగిన కొన్ని అఘాత్యాలు
.ప్రొద్దుటూరులో బాలికపై 10 మంది సామూహిక అత్యాచారం(11.05.2022)
.విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 30 గంటలపాటు యువతిపై గ్యాంగ్ రేప్ (19.04.2022)
.తుమ్మపూడిలో వివాహితపై అత్యాచారం(28.04.2022)
.ఫార్మసీ విద్యార్థిని తేజస్వినిపై గ్యాంగ్ రేప్ (05.05.2022)
.పులివెందులలో నాగమ్మ అత్యాచారం, హత్య(09.12.2020)
.గుంటూరులో రమ్య హత్య(15.08.2021)
.నరసరావుపేటలో అనూష హత్య (26.02.2021)
.విశాఖలో వరలక్ష్మి హత్య(01.11.2020)
.ధర్మవరంలో స్నేహలత దారుణ హత్య(24.12.2020)
.ఒంగోలులో దివ్యాంగురాలు భువనేశ్వరి సజీవదహనం(19.12.2020)
మహిళా రక్షణపై చిత్తశుద్ధిలేదు:
.తెలుగుదేశం హయాంలో మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు, వారి పట్ల అమానుషంగా వ్యవహరించిన వారిపై ఉక్కుపాదం మోపడంతో నేరాలు అదుపులోకి వచ్చాయి.
.కానీ వైసీపీ ప్రభుత్వంలో రక్షణగా నిలవాల్సిన వైసీపీ పాలకులే నేరస్థుల అవతారమెత్తారు. మహిళా రక్షణ కోసం తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఫోర్త్ లయన్ యాప్‌ను పేరు మార్చి దిశా యాప్ పేరుతో ప్రభుత్వం హడావుడి చేయడంలో ఉన్న చిత్తశుద్ధి, శ్రద్ధ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని శిక్షించడంలో లేదు.
.మహిళా భద్రతకు సంబంధించి నిర్భయ కింద కేంద్రం ఇచ్చిన నిధులనూ ఏపీ ప్రభుత్వం సకాలంలో దుర్వినియోగం చేస్తోంది. నిర్భయ నిధి కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు రూ. 112 కోట్లు కేటాయించగా వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.38 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందంటే మహిళా భద్రతపై ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.