- ఎవరి స్క్రిప్టో చదివి బెంగళూరుకు తుర్రుమనడమే తెలుసు
- జగన్‌కు జనంపై ప్రేమ లేదు…శవరాజకీయం మాత్రమే వచ్చు
- శవాలు దొరకలేదంటే జనాలను చంపేసి వాలిపోవడం సైకో తత్వం
- అందుకే అనుచరుడు నందిగంతో బోట్లతో బ్యారేజ్ ధ్వంసానికి కుట్ర
- లక్షల మంది ప్రాణాలు తీసి ఆ బురదను ప్రభుత్వంపై జల్లాలనుకున్నారు
- బాధితుల వైపు చూడని ఆయన జైళ్లు, శవాల దగ్గరకు పరుగెత్తడం సిగ్గుచేటు
- జగన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): శవ రాజకీయాలు చేసే వైసీపీ క్రిమినల్స్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు ఖబడ్దార్ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురా ధ హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో జనం ఈడ్చి కొట్టి 11 సీట్లకు పరిమితం చేసినా జగన్‌కు బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువా రం విలేకరుల సమావేశంలో జగన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. వరద బాధితు ల పరామర్శకు మనసురాని జగన్‌రెడ్డి జైళ్లకు, శవాల దగ్గరకు మాత్రం పరుగులు పెడతా డు. ప్రజలు కష్టాల్లో ఉంటే తూతూ మంత్రంగా పరామర్శకు వచ్చి ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్టు చదివి బెంగళూరుకు తుర్రుమన్న ఆయనకు రాజకీయ పార్టీ అవసరమా? అని ప్రశ్నించారు.
క్రిమినల్స్‌ను పరామర్శించడం..ప్రభుత్వంపై బురద జల్లడమే పని
అనేకమందిని హత్యలు చేసి ఈవీఎంలను సైతం పగులగొట్టి జైల్లో ఉన్న పిన్నెల్లిని, అమరావతిలో సీసీ రోడ్లు తవ్వేసి కంకర అమ్ముకుని, అరటి చెట్లు నరికేసిన దుర్మార్గుడు, టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన దుష్టుడు నందిగం వంటి వ్యక్తులను పరామర్శించడం దేనికి సంకేతం? సామాన్య ఫొటోగ్రాఫర్ అయిన నందిగం సురేష్‌కు ఐదేళ్లలో వందల కోట్లు ఎలా వచ్చాయి? గత ఐదేళ్లలో ఏ బోట్లలో అయితే ఇసుకను దోచుకున్నారో ఆ బోట్లతోనే బ్యారేజ్‌ను ఢీకొట్టేలా కుట్ర పన్నారు. లంక గ్రామాలను ముంచేసి వేల మంది ప్రజల ప్రాణాలు తీసి శవ రాజకీయం చేయాలనుకున్నారు. దుర్మార్గపు ఆలోచనలతోనే జగన్ నందిగం సురేష్‌తో ములాఖత్ అయ్యారని మండిపడ్డారు. తర్వాత బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి ఫోక్సో కేసులో అరెస్టు అయిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ను పరామర్శించాలనుకుంటున్నాడు
. క్రిమినల్స్‌ను పరామర్శించడం.. ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్లలో మాట్లాడి బెంగళూరుకు వెళ్లి పడుకునే జగన్‌కు రాజకీయం అవసరమా? టీడీపీ కార్యాలయంపైకి దాడికి ప్రోత్సహించి అలాంటి క్రిమినల్స్ కు పదవులు ఇచ్చిన జగన్‌రెడ్డిని ఏమనాలి? అని ప్రశ్నించారు. 164 సీట్లతో కూటమి గెలిస్తే ఆ గెలుపును జీర్ణిం చుకోలేక ఢల్లీికి వెళ్లి ధర్నా చేశారు. 36 మందిని చంపారంటూ ఆరోపణలు చేశారు. సాక్ష్యాలు ఇవ్వమని హోంమంత్రి, చంద్రబాబు, లోకేష్‌లు డిమాండ్ చేస్తే బెంగళూరుకు పారిపోయాడు. 2019 నుంచి 2024 వరకు బుడమేరు ఆక్రమణకు గురి కావడం వల్ల వరద పోటెత్తింది. ఈ వరదల నుంచి ప్రజలను కాపాడాలని మేము ప్రయత్నిస్తుంటే మరో వైపు ఇసుక బోట్లను విడిచిపెట్టి బ్యారేజ్‌ను కూల్చి ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నారు. చేస్తే శవరాజకీయం.. శవాలు దొరక్కుంటే జనాలను చంపేసి శవ రాజకీయం చేయడమే జగన్‌రెడ్డికి తెలిసిన విద్య అని ధ్వజమెత్తారు.
నేరగాళ్ల ముఠా అధినేత జగన్‌రెడ్డి
బోట్లకు ఉన్నవన్నీ వైసీపీ రంగులే… దేశంలో క్రిమినల్స్ అందరూ ఒక సంఘంగా ఏర్పడి దానికి అధినాయకుడిగా జగన్‌రెడ్డిని ఎన్నుకుని వైసీపీ పార్టీ పెట్టారు. గత ఐదేళ్లు ఈ క్రిమినల్స్ అందరూ చేయని దందాలు, చేయని అకృత్యాలు లేవు. హత్యలు, లైంగిక వేధింపు లతో పాటు అనేక అకృత్యాలకు తెగబడ్డారు. ఇలా దందాలు చేసే వందల కోట్ల ఆస్తులను నందిగం సురేష్ కూడబెట్టారు. లెక్కలేనన్ని కార్లు, హైదరాబాద్ పరిసరాల్లో అనేక చోట్ల భూములను కొన్నాడు. ఎంపీగా ప్రజలకు ఏం చేశాడని నందిగం సురేష్‌పై బయోపిక్ తీస్తున్నారో అర్థం కావడం లేదు. ఎక్కడైనా ఒక క్రిమినల్ దొరికాడంటే వాడి వెనక బ్యాక్ గ్రౌండ్ వైసీపీనే ఉంటుంది. ఇలాంటి వాళ్ల పరామర్శలకు వచ్చి చంద్రబాబు గురించి మాట్లా డానికి జగన్‌రెడ్డికి సిగ్గుండాలని మండిపడ్డారు. చంద్రబాబు మీద రాళ్ల దాడి చేయడమే కాకుండా తిరిగి ఆయనపైనే అక్రమంగా 307 కేసు పెట్టారు.
పాదయాత్రలో ఉన్న నారా లోకేష్‌పై ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. ఇన్ని అకృత్యాలకు ఒడిగట్టిన మీకు అసలు కేసుల గురుంచి మాట్లాడే అర్హత లేదు. జగన్‌రెడ్డిపై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇన్ని క్రిమినల్ కేసులు పెట్టుకుని రైతుల కోసం, యువత కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం అహర్నిశలు పనిచేస్తున్న చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా? అసలు చంద్రబాబును అనడానికి నీకు ఉన్న అర్హత ఏంటి జగన్ రెడ్డి? నీది శవరాజకీయం అని నీ చెల్లే అంటుంది.. ముందు వెళ్లి ఆమెకు సమాధానం చెప్పు అని హితవుపలికారు. మీ క్రిమినల్ చర్యలన్నింటిపై చట్టబద్ధంగానే చర్యలు ఉంటాయి.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు.