చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరిస్తే ఖబడ్దార్‌ కఠిన చర్యలు తప్పవు

గుంటూరు అరణ్యభవన్‌లో జరిగిన అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

by చైతన్యరధం
Nov 11, 2024 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరిస్తే ఖబడ్దార్‌ కఠిన చర్యలు తప్పవు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అధికారులకు ఎలాంటి అపాయం జరిగినా
  • బెదిరించిన వారిదే బాధ్యత
  • ఐపీఎస్‌ అధికారులు లక్ష్యంగా మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు సరికాదు
  • మరోసారి అలా మాట్లాడితే సమోటోగా కేసులు
  • జగన్‌ పర్యటనల్లో చెట్ల నరికివేతపై వాల్టా చట్టం కింద చర్యలు
  • అటవీ అమరవీరుల త్యాగాలను వృథా కానివ్వం
  • భావితరాలు గుర్తుంచుకునేలా విగ్రహాల ఏర్పాటు
  • ప్రభుత్వభవనాలకు అమరవీరుల పేర్లు
  • గుంటూరు అరణ్యభవన్‌లో జరిగిన అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌
అమరావతి : ‘విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను బెదిరిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఉపముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆదివారం గుంటూరు అరణ్య భవన్‌ లో జరిగిన రాష్ట్ర అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. స్మారక స్థూపం వద్ద అటవీశాఖ ఉన్నతాధికారులతో కలసి అమర వీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ   అధికారులకు ఇంకోసారి హెచ్చరికలు వంటివి చేస్తే సుమోటోగా చర్యలు తీసుకుంటామన్నారు. కేసులు నమోదు చేస్తామన్నారు.  అధికారులపై ఈగ వాలినా, చిన్న గీతపడినా బెదిరింపులకు దిగినవారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సప్త సముద్రాలు దాటినా, రిటైర్‌ అయినా వదిలిపెట్టమని పేర్కొన్నారు.    కర్తవ్య నిర్వహణలో ఉన్న అధికారులు ఎవరూ వాళ్ల బెదిరింపులకు బెదిరిపోరన్నారు. 20 ఏళ్లు తమ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పోలీసు అధికారులను మభ్యపెట్టి  ఘోర తప్పిదాలు చేయించారన్నారు. రోడ్డు మీద నిరసన చూస్తున్న మహిళలపై కూడా హత్యాయత్నం కేసులు పెట్టారని  ఆవేదన వ్యక్తం చేశారు. తాము  ప్రతిపక్షంలో ఉండగా పోలీసులు ఎన్నిసార్లు ఇబ్బందిపెట్టినా బాధ్యతగా వ్యవహరించమని కోరడం తప్ప ఏనాడూ దురుసుగా మాట్లాడలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి కర్తవ్య నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు.  ‘‘తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడను సప్త సముద్రాల ఆవల ఉన్నా వదలం అని, సాక్షాత్తూ డీజీపీని రిటైర్‌ అయినా వదలం అనడంపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు.  గత ప్రభుత్వంలో పోలీసులతో ఘోర తప్పిదాలు చేయించారు. కూటమి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు. వైసీపీ వారు ఇంట్లో కూర్చుని రోడ్డు మీద ఆడ బిడ్డలకు సంరక్షణ లేదని విమర్శలు చేస్తున్నారన్నారు. ఆడ బిడ్డల మీద దాడులు ఎప్పుడు మొదలయ్యాయి? అని ప్రశ్నించారు.  రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఉన్మాదులు ఎందుకు ఇలా పేట్రేగిపోతున్నారో అర్థం కావడం లేదన్నారు.  గత ప్రభుత్వంలో పాలకులు బాధ్యతారాహిత్యంగా నోటికి వచ్చిందల్లా మాట్లాడేశారన్నారు.  నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సతీమణిని తిట్టారన్నారు.  ఇళ్లలోకి వచ్చి బిడ్డలను రేప్‌ చేస్తామని మాట్లాడారన్నారు. పాలించే నాయకులే ఇష్టారాజ్యంగా మాట్లాడితే క్రిమినల్స్‌కి తప్పులు చేసినా పర్వా లేదన్న ధైర్యం వస్తుందన్నారు. సామాజిక మార్పుతోనే ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు ఆగుతాయన్నారు. మొదట మనందరికీ సామాజిక స్పృహ ఉండాలన్నారు.  అన్యాయం జరిగితే ఆపాలన్న ఆలోచన రావాలన్నారు.   కళ్ల ముందు ఆడబిడ్డలను ఏడిపిస్తుంటే చోద్యం చూస్తూ ఉండడం విచారకరమన్నారు.  ముందుగా ప్రజలు కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించాలి.
తన కళ్ల ముందు ఏ ఆడబిడ్డకు ఇబ్బంది కలిగినా చూస్తూ ఊరుకోనన్నారు.  పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన వారిని క్రిమినల్స్‌ గా పరిగణించ కూడదన్నారు.  ఇటీవల కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి కేసు పెట్టడానికి వెళ్తే అధికారులు తగిన రీతిలో స్పందించలేదన్నారు. ఆ కేసులో తమ బిడ్డ బ్రెయిన్‌ డెడ్‌ అయితే అతని తల్లి అవయవాలు దానం చేయడం తనను కదిలించిందన్నారు. ఇలాంటి సమయంలో ప్రాణాలు తీసుకురాలేకపోయినా, మన ప్రవర్తన ద్వారా ఓదార్పునివ్వాలన్నారు.  ప్రజలు కూడా నేరం మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు మనల్ని ఇబ్బందిపెడతారు అన్న ఆలోచనల నుంచి బయటకు రావాలన్నారు.  పది మంది కలిసి వెళ్లి ఫిర్యాదు చేస్తే అలాంటి పరిస్థితులను నిలువరించవచ్చన్నారు.  ఏ కులం అయినా, మతం అయినా తప్పు చేస్తే శిక్షించి తీరాలని ముఖ్యమంత్రి, డీజీపీకి చెప్పామని వెల్లంచారు. దీంతో పాటు ఆడ బిడ్డల సంరక్షణలో ముందుగా చుట్టు పక్కల వారి పర్యవేక్షణ ఉండాలన్నారు. పూంచ్‌ సెక్టార్‌ మాదిరి విలేజ్‌ గ్రామ సంరక్షణ విధానం ఉండాలన్నారు.  ప్రాంతాల వారీగా యువత, పెద్దల కలయికతో డిఫెన్స్‌ కమిటీలు ఏర్పాటు జరగాలన్నారు.  ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు.  దీంతోపాటు విద్యార్ధినులకు విద్యాలయాల్లో నిరంతర స్వీయ రక్షణ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలన్నారు.
గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనల పేరిట ఇష్టానుసారం రోడ్ల పక్కన ఉన్న చెట్లు నరికేశారు. ఈ చర్యలు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీశాయని పవన్‌ విమర్శించారు.  ఈ వ్యవహారంలో బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.  చెట్ల నరికివేత మీద చర్యలు మొదలుపెడితే వైసీపీలో ఉన్న చాలా మంది నాయకులు ఊచలు లెక్కపెట్టాల్సి ఉంటుందన్నారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెట్ల నరికివేతపై తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీస్‌ శాఖ స్పందించలేదన్నారు.  గత ప్రభుత్వం నిర్వాకం వల్ల తమ ప్రభుత్వానికి ఊహించనన్ని సమస్యలు వచ్చాయన్నారు.   సరస్వతి పవర్‌ వ్యవహారంలో పాల్పడిన ఉల్లంఘనలన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
అటవీ అమర వీరుల త్యాగాలను వృధా కానివ్వం
అటవీసంపద దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి  ప్రాణాలర్పించి వీర మరణం పొందిన అటవీ సిబ్బంది  త్యాగాలు వృథా కానివ్వకుండా, వారి ఆశయాలకు అనుగుణంగా మనం పని చేయాలన్నారు. అటవీ సంపద పరిరక్షణలో ఒక ఐఎఫ్‌ఎస్‌ అధికారితో పాటు 23 మంది సిబ్బంది తమ ప్రాణాలు అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారన్నారు. విధి నిర్వహణలో అశువులు బాసిన వారి కుటుంబాలకు  ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు మనది వసుధైక కుటుంబం అన్నారు.  సిబ్బంది, నిధుల కొరత ఉందని వాటిని అధిగమించి అటవీ శాఖను బలోపేతం చేస్తామని చెప్పారు. సిబ్బంది కొరత ఉన్నా అధికారులు నిబద్ధతతో పని చేస్తున్నారని కితాబునిచ్చారు.  రాజకీయ నాయకులు వాళ్ల ముందర కాళ్లకు బంధాలు వేయకుండా వాళ్ల పని వాళ్లను చేసుకోనిస్తే సరిపోతుందన్నారు.
దాతల సహకారంతో సంజీవని పథకానికి నిధులు
అటవీ సంపద సంరక్షణలో ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌, కీర్తిచక్ర అవార్డు గ్రహీత దివంగత పందిళ్లపల్లి శ్రీనివాస్‌ తో సహా 23 మంది ఫారెస్ట్‌ అధికారులు అశువులు బాసారని గుర్తు చేశారు. గంధపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లర్‌ వీరప్పన్‌ తో పోరాటం చేసి శ్రీనివాస్‌  ప్రాణాలు వదిలారని చెప్పారు. భవిష్యత్‌ తరాలు గుర్తించుకునేలా విగ్రహాల ఏర్పాటు చేస్తామన్నారు. నగర వనాలు, అటవీ శాఖ భవనాలకు వారి పేర్లు పెడతామని ప్రకటించారు.  అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి తీసుకొచ్చిన సంజీవని పథకానికి పారిశ్రామికవేత్తలు, దాతలతో మాట్లాడి రూ. 5 కోట్ల నిధులు సమీకరిస్తామని, అమరవీరుల స్తూపాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
 బిష్ణోయ్‌ తెగలా పోరాటం చేద్దాం
చెట్లు, వన్య ప్రాణులను కాపాడుకోవడానికి బిష్ణోయ్‌ తెగ ఎంత వరకైనా వెళ్తుందని జోద్‌పూర్‌ రాజు చేపట్టిన చెట్లు నరికివేతకు వ్యతిరేకంగా అమృతా దేవి నాయకత్వంలో బిష్ణోయ్‌ తెగ శాంతియుతంగా పోరాడి వందల సంఖ్యలో ప్రాణాలను అర్పించిందని వివరించారు. రాజు సైన్యంపై ఎదురుదాడి చేయకుండా చెట్లను కౌగలించుకొని సైన్యం చేతిలో వీరమరణం పొందారన్నారు.  ఆ కోవకు చెందిన వ్యక్తులే మన అమరవీరులు అన్నారు.  ఇలాంటి వారినే స్ఫూర్తిగా తీసుకొనే అటవీ సంపద సంరక్షణ కోసం సుందర్‌ లాల్‌ బహుగుణ చిప్కో ఉద్యమం చేశారని చెప్పారు.  అటవీశాఖ తన చేతిలో ఉన్నంత వరకు ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే ప్రజలకు మేలు జరుగుతుందో అలాంటివి  తప్పకుండా తీసుకొస్తామని హామీ ఇచ్ఛారు. ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అటవీశాఖ బలోపేతానికి కావాల్సిన నిధులు తీసుకొస్తానన్నారు.  ఏలూరు జిల్లా ఐఎస్‌ జగన్నాధపురం పంచాయతీ పరిధిలో సహజ వనరులు ఇష్టారాజ్యంగా తవ్వేశారన్నారు. అనుమతులు లేకుండా సాగుతున్న ఈ దోపిడీ వల్ల అక్రమార్కులు బలపడుతున్నారన్నారు. దీనివల్ల  ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని చెప్పారు.  పంచాయతీలకు సీనరేజ్‌ రావడం లేదన్నారు.  దీన్ని సరి చేయాల్సి ఉందన్నారు. ప్రకృతి వనరుల దోపిడీని అరికట్టేందుకు ఇప్పటికే టోల్‌ ఫ్రీ నంబర్‌ ఇచ్చామని చెప్పారు.  ఆ నంబర్‌ కి కాల్‌ చేస్తే ఇతర శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుని అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేస్తామని చెప్పారు.  స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని త్వరలో అంతర్జాతీయ బిడ్డింగ్‌ ద్వారా వేలం వేయబోతున్నామని ప్రకటించారు.  కార్యక్రమంలో శాసనసభ్యులు  మహ్మద్‌ నసీర్‌, గల్లా మాధవి,  బి రామాంజనేయులు, గుంటూరు జెడ్పీ ఛైర్మన్‌ కత్తెర హెన్రీ క్రిస్టినా, గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ చిరంజీవి చౌదరి, అటవీశాఖ ఉన్నతాధికారులు  కజురియా, ఎస్‌.ఎస్‌. శ్రీధర్‌, రాహుల్‌ పాండే తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

ఉత్తరాంధ్రకు మరో వరం!

Previous Post

వైసీపీ పాలనలో అంతా అరాచకమే

Next Post

జగన్‌ ట్వీట్లు… నిజాలకు తూట్లు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026

కార్యకర్త
@ February 28, 2026
అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

చైతన్యరధం
@ February 28, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు మరో వరం!

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

యూజర్ ఫ్రెండ్లీగా మనమిత్ర

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఆఫీసుగా ఏయూ

చైతన్యరధం
@ February 28, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

ప్రతి పేదకూ సొంతిల్లు

చైతన్యరధం
@ February 28, 2026
సభను అడ్డుకోవడం..ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
ఆంధ్రప్రదేశ్

సభను అడ్డుకోవడం..ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

చైతన్యరధం
@ February 28, 2026
వైసీపీ పుట్టుకే ఫేక్..!
ఆంధ్రప్రదేశ్

నేడు విజయనగరానికి సీఎం

చైతన్యరధం
@ February 28, 2026
Load More

ముఖ్య వార్తలు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

ప్రతి పేదకూ సొంతిల్లు

చైతన్యరధం
@ February 28, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

చైతన్యరధం
@ February 27, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

చైతన్యరధం
@ February 28, 2026
రాష్ట్రానికే గర్వకారణం

ఉత్తరాంధ్రకు మరో వరం!

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

యూజర్ ఫ్రెండ్లీగా మనమిత్ర

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

వైసీపీ ఆఫీసుగా ఏయూ

చైతన్యరధం
@ February 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist