.పాలన చేతగాని వాడే కులాల గురించి మాట్లాడతాడు
.ఆ డర్టీ ఎంఫి బాగోతంపై సిఎం సిగ్గుతో తలదించుకోవాలి
.నోరేసుకు పడిపోతే భయపడి పారిపోతామనుకుంటున్నారా?
.వైసిపి నేతల తీరుపై విరుచుకుపడిన చంద్రన్న
అమరావతి: డర్టీ ఎంపి మాధవ్ చేసిన పనికి ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి.. ఆ పని చేయకపోగా మళ్లీ అతనితోనే మాపై ఎదురుదాడి చేయిస్తున్నరు.. నోరేసుకుని పడిపోతే భయపడి పారిపోతామనుకుంటున్నారా.. మీ కథ తేల్చేదాకా వదలనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెనాలికి చెందిన గుదిబండ గోవర్థన్ రెడ్డి అనుచరులు, మద్దతుదారులతో కలిసి వైసిపిని వీడి టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. డర్టీ పిక్చర్ లో ఉన్నది ఎవరి రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు..ఎంపీ మాధవ్పైమ ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఎక్లిప్స్ నివేదిక ఫేక్ అని ఎవరు చెబుతారు? కులాల పేరుతో రాజకీయం చేసేవాడిని చెప్పుతో కొట్టండి.. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేందుకు కొందరు దుర్మార్గులు తయారయ్యారు.. వారి ఆటలు సాగునీయబోమని స్పష్టం చేశారు. నిన్న ఒక్క రోజులో రాష్ట్రంలో అయిదు ఘటనలు జరిగాయి.. ప్రభుత్వ దారుణ పాలనకు ఇది నిదర్శనమని అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఇసుక మాఫియాను ప్రశ్నించిన కిషన్ శవమై తేలాడు. తమతో విభేదించాడని ఏలూరి జిల్లాలో వైసిపి ఎంపిటిసి సాల్మన్ రాజును వేధించారు. వేధింపులు తట్టుకోలేక..సెల్పీ వీడియో విడుదల చేసి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. పల్నాడులో మైనింగ్ అక్రమాల్లో వైసిపి లోని రెండు వర్గాలే గొడవలు పడ్డారు. ఈ వివాదంలో వడ్డర నేత దేవళ్ల రేవతిపై వైసిపి వాళ్లే దాడి చేశారు. వైసిపి కి చెందిన ఉయ్యూరు జడ్పిటిసి పూర్ణిమ సొంత పార్టీ వేధింపుల తో పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఎవరినీ బతకనీయరా అంటూ చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. తెనాలి ప్రాంతానికి చెందిన గుదిబండ వెంకట్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు..ఆయన నాకు సన్నిహితులు.. అతని బంధువు గుదిబండ గోవర్థన్ రెడ్డి ఇప్పుడు పార్టీలో చేరారు..వైసిపి ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి పార్టీ మారుతున్నట్లు గోవర్దన్ రెడ్డి చెప్పారన్నారు.
వైసిపి దాష్టీకానికి అమాయకుల బలి
తమకు 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది కదా అని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదు.. ప్రజాస్వామ్యంలో పరిపాలన నిర్వహించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటికి లోబడే ఎవరైనా వ్యవహరించాల్సి ఉంటుందని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.రాష్ట్రంలో రౌడీయిజం పరాకాష్ఠకు చేరుకుంది. సెటిల్ మెంట్లతో అందరిఆస్తులు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు ఒక కేసు పెట్టాలి అంటే ఎంతో ఆలోచన చేసేవాళ్లు.. కానీ ఇప్పుడు పోలీసులు మీటింగ్ కు వచ్చినందుకు కూడా కేసులు పెడుతున్నారు. నర్సీపట్నంలో ఒక డాక్టర్ మాస్క్ అడగడం తప్పా..మా ప్రభుత్వాన్నే మాస్క్ అడుగుతా అని పిచ్చివాడిగా ముద్ర వేసి చంపేశారు. ఎస్ సి వర్గం నుంచి ఒక డాక్టర్ కావడం అంటే ఎంత కష్టమో ఒక సారి ఆలోచించండి. కాకినాడలో వైసిపి ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్‌ను చంపేసి..మళ్లీ అతని కార్‌లోనే మృత దేహాన్ని ఇంటిదగ్గర పడేశాడు. రైతుల డబ్బులు ఇవ్వలేదని ప్రశ్నించారని ప్రకాశం జిల్లాలో ఒక మహిళను తీవ్రంగా వేధించారు. నంద్యాలలో అబ్దుల్ సలాంను వేధిస్తే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రంలో వైసిపి వేధింపులకు ఎంతో మంది బలయ్యారు.
ప్రజారాజధానిని నాశనం చేశారు
ప్రజారాజధాని అమరావతిని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత విధానాలతో నాశనం చేశారని చంద్ర బాబునాయుడు మండిపడ్డారు.హైదరాబాద్ లాంటి అభి వృద్ది ఇక్కడా జరగాలని అమరావతికి శ్రీకారం చుట్టాం. దానికిపైనా బుదర వేశారు..రెండు మూడు లక్షల కోట్ల సంపద నాశనం చేశారు. అమరావతి, పోలవరం అనేవి రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి. 72 శాతం పూర్తి అయిన పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. నదుల అను సంధానంతో రాయలసీమ బాగుపడుతుందని ఐదేళ్లలో 64 వేల కోట్లు ఖర్చు చేశాం. పోలవరం డయాఫ్రం వాల్ ఏమయ్యిందో ఇప్పటికీ తేల్చలేదు. పోలవరం లో తప్పిదాలపై పిపిఎ స్వయంగా హెచ్చరించింది. ఏజెన్సీలను మార్చవద్దని పిపిఎ, కేంద్రం స్పష్టంగా చెప్పినా రాష్ట్రం వినలేదు. తొందరపాటు వద్దు అని స్వయంగా లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం వినలేదు. పోలవరంలో జరిగిన నష్టం టిడిపి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పోలవరం విషయంలో కేంద్రాన్ని తప్పు పట్టే పని మొదలు పెట్టారు.
చివరకు జనానికి గోచీకూడా మిగలనివ్వరు!
రాష్ట్రంలో ప్రస్తుతం 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు..చివరికి గోచి కూడా తీసేస్తారని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. అంబేద్కర్ విదేశీ విద్యకు పేరు మార్చి జగన్ పేరు పెట్టుకుంటాడా..అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా.. కనీసం బుద్ది ఉందా..దేశంలో ఎక్కడైనా ఉందా? సోషల్ మీడియాలో ప్రశ్నించిన రాజేష్ అనే వ్యక్తిని కేసులు పెట్టి వేధించారు. రాష్ట్రంలో ప్రాణాలు తీయడం అంత సులభం అయి పోయింది. ఉదయం నన్ను తిట్టడంతోనే వైసిపి నేతల దినచర్య ప్రారంభం అవుతుంది. నా ఇంటికి వైసిపి ఎమ్మెల్యే కర్రలతో దాడికి వచ్చి మాట్లాడడానికి వచ్చాను అని చెప్పాడు..ఇప్పుడు అతను మంత్రి అయ్యాడు. అమరావతిలో నా కాన్వాయ్ పై రాళ్లు వేస్తే నాడు డిజిపి సమర్థించారు. మట్టిలో మాణిక్యాలు మన పేదల పిల్లలు..వారికి అవకాశాలు కల్పించాం. ఇప్పుడు ప్రపంచంలో మేటిగా మారారు.
టీచర్లు ఫోటోల పంపాలా.. మీరు పబ్జీ ఆడుకుంటారా?
రాష్ట్రంలో ఇప్పుడు శాడిస్టు ప్రభుత్వం టీచర్లపై వేధింపులకు పాల్పడుతోందని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.టీచర్లు ఫోటోలు తీసి పంపించాలా.. మీరు ఇంట్లో పబ్జీ అడుకుంటారా? పోస్టింగ్ ల కోసం రాజకీయ నేతల ఇళ్ల వద్దకు టీచర్లు వెళ్లకూడదు అని కొత్త విధానం తెచ్చింది టిడిపినే. పాఠశాలల విలీనం వల్ల పిల్లలు బడి మానేసే పరిస్థితులు వచ్చాయి. ఇవన్నీ తుగ్లక్ నిర్ణయాలు. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆనందంగా లేరు. దేశంలో ఎక్కువ అప్పున్నది ఎపి రైతులు. వైసిపిలో అరటి తోటలు తగలేస్తే ఎంపి అవుతారు, బట్టలు విప్పేస్తే కేంద్రంలో మంత్రి అవుతారామో. సమాజంలో వర్గ విభేదాలు సృష్టిం చి లబ్ది పొందే ప్రయత్నాలను అడ్డుకోవాలి. వైసిపి వారే కుల రాజకీయాలకు ఆజ్యంపోస్తూ..కులం పేరుతో జన సేనను తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను తిడుతున్నారు. ఇదేమి సంస్కృతి అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.