విజయవాడలోని మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని అరకు నియోజవర్గ టిడిపి నేత మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇందులో భాగంగా చంద్రబాబుతో మాజీమంత్రి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ. అరకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంటా అరకు నియోజవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.