- పొన్నూరు ఎమ్మెల్యే అక్రమాల బాగోతం
- అయిదేళ్లలో రూ.3 వేల కోట్లకు పడగ
- అవినీతిలో రిచెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు బ భూదందా, మైనింగ్ మాఫియా మామూలే
- వంద కోట్ల డ్వాక్రా రుణాలు హాంఫట్ బ గుడినీ, లింగాన్నీ మింగేసిన వైనం
- కిలాడి దెబ్బకు వట్టిపోయిన పొన్నూరు
స్వర్ణపురిగా గుంటూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన సెగ్మెంట్ పొన్నూరు.2019లో కిలారి వెంకట రోశయ్య ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటినుంచీ స్వర్ణపురి ప్రతిష్ట మసకబారడం మొదలైంది. బీకామ్ పూర్తికాకుండానే చదువు ఆపేసి.. వ్యాపారంలోకి దిగినా.. బుర్ర తక్కువ పనులతో చేతులు కాల్చుకున్నాడు కిలారి. 2019లో ఎమ్మెల్యే అయిన తర్వాతే సీన్ మారింది. సెగ్మెంట్‌కు కళతప్పడం మొదలైతే.. కిలారిలో కాసుల కళ మొద లైంది. ఐదేళ్ల అధికారంతో`సెగ్మెంట్‌ను ఇనుప చీపుళ్ల తో తుడిచేశాడు. నియోజకవర్గ రక్తమాంసాలు పీల్చే శాడు. ఆయన అవినీతి కష్టం విలువ`జస్ట్ రూ.3వేల కోట్లు. జగన్ పదేపదే చెప్పుకునే అక్కచెల్లెమ్మల ఆస్తి ` డ్వాక్రా రుణాలు 100కోట్లు హాంఫట్ చేశారంటే.. కిలారి కిలాడీతనాన్ని అంచనా వేసుకోవచ్చు. అవినీతి సొమ్ము కూడబెట్టిన `రిచెస్ట్ ఎమ్మెల్యే రికార్డు ఇప్పుడు కిలారి తలపైనే ఉంది.
పొన్నూరు అవినీతి చక్రవర్తిగా నిలిచిన ఎమ్మెల్యే కిలారి చేయని అరాచకమంటూ లేదు. జె`ట్యాక్స్ చెల్లించకుంటే సినిమాహాల్‌లో షోలు ఆపేయడం, ప్రైవేటు ఆసుపత్రులకు కరెంటు నిలిపేయ డం, అపార్ట్‌మెంట్లపై దాడులు చేయడం వంటి సంఘ టనలు కోకొల్లలు. ప్రభుత్వ భూములు, స్మశానాలను, రోడ్డు పక్కన డ్రైనేజీ భూములను, చిన్నపాటి కొండలను కూడా వదలకుండా పెద్దఎత్తున భూములు అన్యాక్రాం తానికి పాల్పడ్డారు. ఇతని ధనదాహానికి ప్రభుత్వ భూ ములేకాదు పేద రైతు భూములూ బలయ్యాయి.
ఇంతజరిగీ` పొన్నూరు మొత్తాన్ని భూతద్దంపెట్టి వెతికినా అభివృద్ధి ఆనవాలే కనిపించదు. చెరువులు, మట్టికొండలు, ప్రభుత్వ భూముల్లో యధేచ్ఛగా మట్టి, రాళ్లనుతవ్వి తరలిస్తూ వందల కోట్ల రూపాయలు కిలాడి వెనకేసుకున్నాడు. బోగస్ పేర్లతో డ్వాక్రా రుణా లు, దేవాలయ భూములు అన్యాక్రాంతం చేయడం, పొన్నూరు మున్సిపాలిటీని అవినీతి కేంద్రంగా మార్చ డం, కంకర, క్రషింగ్ యూనిట్ల నుంచి డబ్బులు వసూ లు చేయడం, బార్‌కు రూ.20 లక్షల చొప్పున ఏడాదికి కమిషన్ విధించడం వంటి నేరాలు, ఘోరాలు కిలారి ఖాతాలో లెక్కలేనన్ని.
బోగస్ డ్వాక్రా రుణాలు
చీమల పుట్టలో పాములు చేరిన చందాన డ్వాక్రా సంఘాలు తీసుకునే గ్రూపురుణాల్లో కూడా పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. బోగస్ డ్వాక్రా గ్రూపులను ఏర్పాటుచేసి అయిదేళ్లలో రూ.100 కోట్ల రుణాలను దిగమింగిన ఘనుడు కిలారి. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేసినా `తప్పించుకున్న టక్కరి కిలారి. డ్వాక్రా రుణాలే కాదు రైతుల పేరిట కూడా బినామీ రుణాలు రూ.150 కోట్ల మేర తీసుకున్నారు. మెప్మా, సీయంయం సంతకం ఫోర్జరీతో కోట్ల రూపాయల దోపిడీ బట్టబయలైంది.
భూములు మింగిన అనకొండ
పొన్నూరు నియోజకవర్గాన్ని కబ్జాకోరులకు అడ్డాగా మార్చాడు కిలారి. భూముల రికార్డులను ట్యాంపరింగ్ చేస్తూ ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను, బి పట్టా భూములను పెద్దఎత్తున ఆక్రమించుకోవడం జరిగింది. చేతికి మట్టండకుండా సాగించిన అవి నీతి చరిత్రలో మచ్చుకు నాలుగైదు అంశాలను తీసుకుంటే`100 ఎకరాల అక్రమ లే అవుట్‌లకు అనుమతులిచ్చి రూ.25 కోట్ల మేర దోపిడీకి పాల్పడ్డారు. అనుమర్లపూడిలో నిరుపేదలకు కేటాయించిన 35ఎకరాల అసై న్డ్ భూమిని కబ్జాచేసి తన అనుచరుల పేరు మీద పట్టాలు పుట్టించాడు.
ఈ భూమి విలువ రూ.80 కోట్ల పైమాటే. ఎన్జీవో కాలనీల్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం యజ మానుల నుంచి రూ.4 కోట్ల వరకు వసూలు చేశారు. సుద్ధపల్లిలో 20 ఎకరాల భూములను ఆక్రమించారు.
పెదకాకానిలో 8 ఎకరాల భూమిని దిగమింగారు. దీని విలువ రూ.10 కోట్లు ఉంటుందని అంచనా.
పంట కొనుగోళ్లలో అక్రమాలు
రేయింబవళ్లు శ్రమించి రైతు పండిరచిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా చేసి కోట్ల రూపాయ లు వెనకేసిన నీచ చరిత్ర కిలారి రోశయ్యది. జొన్న, మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రూ.26.5 కోట్లు వసూలు చేశారు.మిల్లర్లు కిలాడి దెబ్బకు ధాన్యం కూడా కొనుగోలు చేయకుండా మిల్లులు మూతేసుకున్న సంద ర్భాలున్నాయి. మండలానికి ఇద్దరు చొప్పున ఏజెంట్లను నియమించి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసేలా ప్రణాళికలు వేసి మరీ దోపిడీకి పాల్పడ్డాడు.
దేవుడినీ వదల్లేదు
దేవాలయాల భూములనూ వదలకుండా దోపిడీకి పాల్పడ్డారు. భూములే కాదు మరో అడుగు ముందుకేసి కుంభాభిషేకాల పేరుతో చందాలు వసూలు చేసి పెద్ద ఎత్తున చేతివాటం ప్రదర్శించారు. పెదకాకాని శివాల యం ఛైర్మన్ నియామకంలో కూడా రూ.20 లక్షలు చొప్పున ఏడాదికి ఇవ్వాలని షరతు పెట్టి నియమించి నట్లు సమాచారం. పెదకాకాని, పొన్నూరు దేవాలయా ల్లో పోస్టింగ్‌లకు కూడా డబ్బులు వసూలు చేశారు.
ఇళ్ల స్థలాల వెనుక చేతివాటం
నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసమంటూ జరిగిన భూసేకరణలో చేతివాటంప్రదర్శించి అక్షరాలా రూ.30 కోట్లు కిలాడి వెనకేశారని ఆపార్టీ నాయకులే బహిరం గంగా మీడియా ముందుకొచ్చి చెప్పారు. ఎందుకూ పనికిరాని ఇళ్ల స్థలాలను కొనుగోలు చేయించి క్విడ్ ప్రోకో ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారు.మరో వైపు జగనన్న కాలనీలు చదును, మెరక పేరుతో మరో రూ.10కోట్లు మింగారు. నియోజకవర్గంలో సినిమా ధియేటర్లను, ఆసుపత్రులను కూడా వదలకుండా డబ్బు లు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రుల అనుమతుల కోసం, నిర్వహణ కోసం ఒక్కొక్క యజమాని నుంచి రూ.10లక్షల నుంచి రూ.25లక్షల వరకు వసూలు చేశారు. ఈ అయిదేళ్లలో కిలారి వీటి ద్వారా సంపాదిం చింది రూ.3కోట్ల పైమాటే.
బినామీల బాగోతం
అవినీతిలో అందరికంటే ముందంజలో ఉన్న కిలారి ఏ అవినీతి బాగోతం చేసినా తన చేతికి మట్టి అంటకుండా అన్నింటిలోను బినామీలను ముందుపెట్టి తెరవెనుక బాగోతం నడుపుతుంటాడు. బోగస్ గొర్రెల ఫారంపెట్టి గొర్రెల యూనిట్‌ల పేరుతో నకిలీ రుణాలు, బోగస్ డ్వాక్రా గ్రూపులు, రైతు గ్రూపుల పేరిట బోగస్ రుణాలు ఇలా అన్నీ కిలారి మైండ్ నుంచి పుట్టినవే. ఎర్రమట్టికి సంబంధించిన ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టులు, అనుమతులు అన్నీ బినామీల మీదే నడిపిస్తుంటారు.
లిక్కర్ మాఫియా
నియోజకవర్గంలో ఒకప్పుడు బెల్ట్ షాపులు అనేవి కనిపించేవి కావు. కిలారి రంగ ప్రవేశం చేయడంతో గ్రామానికి 2నుంచి 10 వరకు అనధికారికంగా మద్యం దుకాణాలు ఏర్పాటుచేసి వాటినుంచి ఐదేళ్లలో సంపాదించిన కమిషన్ అచ్చంగా రూ.5 కోట్లు. బార్‌లు నిర్వహించాలంటే ఏడాదికి రూ.20 లక్షల చొప్పున కిలారికి ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఇవి కాకుండా వైసీపీ కార్యక్రమాల కోసం మద్యం సరఫరా చేయాల్సిన బాధ్యత కూడా బార్‌లమీదే పెడుతుండటం ఈయన స్పెషాలిటీ.
కిలారి బాగోతాలు
నియోజకవర్గంలో కిలాడి ఓ డాన్. ఇతని అరాచకా లకు అంతు లేదు. జె`ట్యాక్స్ చెల్లించకుంటే పోలీసు లను పంపించి బెంబేలెత్తిస్తారు. ప్రతి పనికీ ఒక రేటు పెట్టి పెద్దఎత్తున జె`ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.
అనుచరులదీ అదే పంథా
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఒకవైపు కిలారి అనుచరులు, మరోవైపు కుటుంబసభ్యుల అరాచకం రాజ్యమేలుతోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తే వారి ఇల్లు కూలగొట్టడం, దుకాణాలు తగులబెట్టడం, స్టేషన్‌కెళ్లి న్యాయం చేయమని కోరితే బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం వంటివి పొన్నూరు సెగ్మెంట్‌లో పెద్దఎత్తున చోటుచేసుకున్నాయి. ఈ అయిదేళ్లలో సుమారు 300 మంది మీద అక్రమ కేసులు పెట్టించి అడ్డగోలు అరాచకత్వానికి తెరలే పారు. ఈ అరాచకాలకు కిలారి రోశయ్య మేనల్లుడు రాజేష్, ప్రధాన అనుచరులు సుబ్బారావులు నడుపుతున్నారు. సహజ సంపదను అడ్డగోలుగా దోచేయడం, భూము ల ఆక్రమణ, ఆస్తుల కబ్జాలు వంటి వాటికి కిలాడి ప్లాన్ రూపొందిస్తే క్షేత్రస్థాయిలో అమలు చేసేది వీళ్లే. మద్యం వ్యాపారం మూడు సీసాలు, ఆరు గ్లాసులుగా నడుస్తోం నంటే దాన్ని నడిపించే కిలాడీ ఎంతటి ఘనుడో అర్థం చేసుకోవచ్చు.
మైనింగ్ మాఫియా
పొన్నూరు పట్టణ సమీప గ్రామాల్లో 700కు పైగా ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేపట్టి.. అయిదేళ్లలో రూ.2,100 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు కిలారి. గ్రావెల్ లారీల నుంచి నెలకు రూ.25 లక్షల చొప్పున కోట్లు వెనకేసుకున్నాడు. కాలువలు, చెరువులను తవ్వి తీసిన మట్టితో వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు గడిరచాడు. ఎర్రమట్టిని ఆదాయ వనరుగా మార్చుకుని నియోజకవర్గంలో ఎక్కడా ఎవరు వెంచర్లు వేసినా… అవసరమున్నా లేకున్నా కిలాడి రోశయ్య నుంచి మట్టి కొనాల్సిందే. లేకుంటే గ్యాంగ్ దిగుతారు. పనులు అడ్డుకుంటారు. ఇలా ఎర్రమట్టి, రాళ్ల తవ్వకాల నుంచి సంపాదించిన రూ.2 వేల కోట్లతో హైదరాబాద్, బెంగుళూరు, విశాఖలో 700 ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేశాడు ఈ కిలాడీ.