- అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సీఎం
- సజ్జల చీకటి మాఫియాను వెలుగులోకి తెచ్చిన వైసీపీ నేత మల్లెల రాజేష్
- అభ్యర్థుల నుంచి దాదాపు రూ.1,000 కోట్లు వసూలు చేసిన సజ్జల
- సజ్జల, మంత్రి రజనిపై కేసు నమోదు చేయాలి
- ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
అమరావతి: రాబోయే ఎన్నికల్లో జగన్‌రెడ్డికి ఓటమి ఖాయమని గ్రహించే టిక్కెట్ల దుకాణానికి తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. సీట్లు అమ్ముకుంటూ కోట్లు వెనకేసుకుంటున్నారని ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. అవినీతి సొమ్ముతో నెగ్గుకురావచ్చని జగన్‌రెడ్డి పగటి కలలు కంటున్నారు. ఒక వైపు ఓటర్లకు బహుమతులు పంచుతూ మరో వైపు అభ్యర్ధుల దగ్గర నుంచి డబ్బులు గుంజుతూ ఎన్నికల వ్యవస్థను ప్రహసనంలా మార్చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి బ్రోకర్లను పెట్టుకొని జగన్‌రెడ్డి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు.
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు, పైరవీలు, సెటిల్మెంట్లకు కేరాఫ్ అడ్రస్‌గా సజ్జల మారారు. బ్రోకర్ పనులు చేస్తూ, డబ్బులు వసూలు చేసి తాడేపల్లి ప్యాలెస్‌కి తరలించేందుకే సజ్జలను ప్రభుత్వ సలహదారునిగా జగన్‌రెడ్డి పెట్టుకున్నారు. చిలకలూరిపేట వైసీపీ అభ్యర్ధిగా మల్లెల రాజేష్ నాయుడుని నియమించినందుకు మంత్రి రజిని, సజ్జల రూ.6.5 కోట్లు తీసుకోవడం సిగ్గుచేటు. అంటే ఒక్కో అభ్యర్ధి నుంచి ఇంత వసూలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్ధుల నుంచి రూ.1,000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కి సజ్జల చేరవేశారు. రాజేష్నాయుడి నుంచి డబ్బు తీసుకున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి విడదల రజనీపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.