బందురు పోర్టుకు ముచ్చటగా మూడోసారి.. సీఎం జగన్ శంకుస్థాపన చేసి.. మరో మోసానికి జగన్ రెడ్డి తెరలేపుతున్నారని.. టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. బందరు పోర్టు కోసం టీడీపీ భూసమీకరణ చేస్తే రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతుందని వైసీపీ నాయకులు రోడ్డెక్కి నానాయాగీ చేశారని గుర్తుచేశారు. 2021లో మచిలీపట్నం ఓడరేవుకు షిప్ వచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ఆ దిశగా పనులు చేపట్టిందన్నారు. టీడీపీ హయాంలో రైతులకు ఎకరాకు 25 లక్షల రూపాయలు ఇచ్చామని కొల్లు రవీంద్ర తెలిపారు. జగన్ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తైనా.. పోర్ట్ నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలు కమీషన్ల కోసం కక్కుర్తిపడి బందరు పోర్టును బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలు పోర్టు భూములను తాకట్టు పెట్టి డబ్బులు దండుకోవాలని చూస్తున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. గంగవరం పోర్టును ప్రైవేట్ సంస్థలకు అమ్మేసిన.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. మచిలీపట్నం పోర్టు నిర్మాణం చేస్తారని అనుకోవడం ప్రజల భ్రమేనన్నారు. బందరు అభివద్ధికి టీడీపీ హయాంలో మూడాను ఏర్పాటు చేస్తే వైసీపీ నేతలు దానిని రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారని విమర్శించారు. పోర్టు పేరుతో మచిలీపట్నం ప్రజల ఆశలతో ఆడుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని.. కొల్లు రవీంద్ర తెలిపారు.
గతంలో పేర్నినాని విప్ పదవి తీసుకుని బందరు పోర్టును అమ్మేశారని.. కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇప్పుడు మంత్రి పదవి కోసం.. పేర్నినాని.. కక్కుర్తి పడి.. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని.. ఈపీసీ మోడ్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. డబ్బులు కొట్టేయడానికి తప్ప.. చిత్తశుద్ధితో పోర్టు నిర్మాణం కోసం కాదనేది వాస్తవమన్నారు. బందరు పోర్టు నిర్మాణ డీపీఆర్ తీస్తే.. అసలు నిజాలు బయట పడతాయని.. కొల్లు రవీంద్ర అన్నారు. ఒక షిప్ రావాలంటే .. కనీసం .. 16 మీటర్ల డెప్త్ ఉండాలన్నారు.
జగన్ సర్కార్ ఇప్పుడు ఇచ్చిన మెగా సంస్థకు.. కనీసం పోర్టులపై అవగాహన ఉందా.. లేకుంటే.. పోర్టులు కట్టిన అనుభవం ఉందాని.. ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం.. కేవలం కమీషన్ల కోసమే.. మళ్లీ ఇప్పుడు శంకుస్థాపన చేసిందన్నారు. వైఎస్ఆర్ హయాంలో 6,200 ఎకరాల్లో పోర్టు అన్నారని.. ఆ తర్వాత వచ్చిన.. కిరణ్ కుమార్ రెడ్డి 5,400 ఎకరాల్లో పోర్టు అన్నారని.. ఇప్పుడు జగన్ రెడ్డి హయంలో 1800 ఎకరాల్లో పోర్టు నిర్మాణమంటున్నారు.. ఎవరిని నమ్మాలని.. ఇదంతా ప్రజధనాన్ని కొల్లగొట్టేందుకు.. ఆడే.. జగన్నాటకమని.. కొల్లు రవీంద్ర విమర్శించారు.