• వెంకటగిరి నియోజకవర్గం కుల్లూరు గ్రామానికి చెందిన ముస్లింలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• ముస్లింలకు గతప్రభుత్వం రంజాన్ తోఫా అందజేసేది, వైసిపి వచ్చాక రద్దుచేశారు.
• గతంలో పెళ్లికానుక కింద 50వేలు ఇచ్చేవారు, ఈ ప్రభుత్వం వచ్చాక లక్ష చేస్తానని చెప్పి మోసగించారు.
• మా గ్రామ ముస్లింలు నమాజ్ చేసుకోవాలంటే 7కి.మీ వెళ్లాల్సి వస్తోంది, మసీదు నిర్మించాలి.
• కుల్లూరు గ్రామంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంనాడు తవ్వించిన చెరువు చుట్టూ ముళ్లపొదలతో నిండిపోయింది, శుభ్రపర్చాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• ముస్లింలకోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రద్దుచేసిన ముస్లిం ద్రోహి జగన్ రెడ్డి.
• జగన్ కు ముస్లిం మైనారిటీల ఆస్తులపై ఉన్న శ్రద్ధ వారి సంక్షేమంపై లేదు.
• ముస్లింల కోసం ఖర్చుచేయాల్సిన 5,400 కోట్ల సబ్ ప్లాన్ నిధులను వైసిపి ప్రభుత్వం దారిమళ్లించింది.
• మసీదు ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడిన ఇబ్రహీంను నర్సరావుపేటలో వైసిపి నేతలు దారుణంగా నరికి చంపారు.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో అమలుచేసిన రంజాన్, దుల్హాన్, విదేశీవిద్య వంటి పథకాలను ఎటువంటి కొర్రీలు లేకుండా అమలుచేస్తుంది.
• కుల్లూరులో మసీదు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.