• కావలి నియోజకవర్గం కొనదిన్నె గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో 200కుటుంబాలు నివసిస్తున్నాయి.
• మా గ్రామంలో తాగునీటి పైపులైన్లు నిత్యం రిపేర్లు వస్తున్నాయి, కొత్త లైన్లు వేయాలి.
• గ్రామంలో డ్రైనేజీలు లేకపోవడంతో మురికినీరు రోడ్లపైకి వచ్చి దోమల బెడద అత్యధికంగా ఉంది.
• గౌడ కులస్తులకు శ్మశానవాటిక చుట్టూ ప్రహరీగోడ, గేటు నిర్మించాలి.
• ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు అప్పు చేసి కట్టాం. కానీ బిల్లులు ఇవ్వడం లేదు.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యంచేశారు.
• గ్రామపంచాయితీలకు చెందిన 9వేలకోట్లను సర్పంచ్ లకు తెలియకుండా జగన్ ప్రభుత్వం దొంగిలించింది.
• ప్రస్తుతం పంచాయితీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేని దుస్థితి నెలకొంది.
• శ్మశానాలను సైతం వైసిపి పిశాచాలు వదలకుండా కబ్జా చేస్తున్నాయి.
• పేదల ఇళ్లకు కేంద్రం ఇచ్చిన డబ్బును కూడా జగన్ పక్కదారిపట్టించారు.
• టిడిపి అధికారంలోకి రాగానే గ్రామసీమలకు గతవైభవం తెస్తాం.
• పేదల ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తాం.