• అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు మండల రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• కొరిశపాడు మండలంలోని 8గ్రామాలు వర్షాధారంపైనే అధారపడ్డాయి. వ్యవసాయానికి నీరు అందక ఇప్పటికే చాలా నష్టపోయాం.
• 1997లో రైతులకు నీరు అందించేందుకు గుండ్లకమ్మ నదిపై ఎత్తిపోతల పథకం నిర్మించారు. అప్పట్లో పథకం కరెంటుబిల్లును ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకున్నారు.
• ఈ ఎత్తిపోతల పథకం క్రింద 4,750 ఎకరాల్లో సన్న, చిన్నకారు రైతుల భూములకు నీరు అందేది.
• వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని నీరు గార్చారు.
• ప్రభుత్వం కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో లిఫ్ట్ ఇరిగేషన్ శిథిలావస్థకు చేరింది.
• నీరు లేక పశుసంపద, పాడి పరిశ్రమ దెబ్బతింది. వ్యవసాయ భూములు బీడు భూములుగా మారిపోయాయి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
• జగన్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య డ్యామ్, పులిచింతల గేట్లు, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి.
• గత టిడిపి హయాంలో ఇరిగేషన్ పై రూ.68,294 కోట్లు ఖర్చుచేశాం. చిన్ననీటి వనరుల అభివృద్ధికి నీరు-ప్రగతి కింధ 18,265 కోట్లు వెచ్చించాం.
• ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు పెట్టడం, లిఫ్ట్ ఇరిగేషన్ లకు విద్యుత్ సరఫరాచేయలేని దివాలాకోరు ప్రభుత్వం జగన్ రెడ్డిది.
• మేం అధికారంలోకి వచ్చాక గుండ్లకమ్మ ప్రాజెక్టుపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం.
• కరెంటు బిల్లును గతంలో ప్రభుత్వమే భరించిన విధంగా భరించేలా చర్యలు చేపడతాం.
• రైతులకు సాగునీరు అందించడంతో పాటు పశుసంపదను అభివృద్ధి చేసుకునేందుకు సహాయసహకారాలు అందిస్తాం.