• వినుకొండ నియోజకవర్గం కొచ్చర్ల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• గ్రామంలో 5,500 జనాభా ఉంది. శుభకార్యాలు జరుపుకోవడానికి మండపం నిర్మించాలి.
• గ్రామంలో డ్రైనేజీ అస్తవ్యస్థంగా ఉంది.
• సురక్షిత నీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలి.
• ఎస్సీలకు కమ్యూనిటీ హాలు నిర్మించాలి.
• అసైన్డ్ భూములు కబ్జాకు గురవుతున్నాయి, వాటిని పేదలకు అందించాలి.
• పేదలకు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
• అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు గుక్కుడు నీళ్లివ్వలేని అసమర్థుడు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రప్రజల దౌర్భాగ్యం.
• జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం నిధులిచ్చి వాటా సొమ్ము చెల్లించలేక పథకాన్ని అమలుచేయలేని చేతగాని ప్రభుత్వమిది.
• టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ఇంటింటికీ స్వచ్చమైన తాగునీరు అందిస్తాం.
• కబ్జాకు గురైన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతాం.
• ఇల్లులేని ప్రతి పేదవాడికి ఇంటిస్థలంతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తాం.