శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం కొత్తరామాపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
గత ప్రభుత్వం నిర్మించిన సిద్దాపురం చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మా పొలాలకు పిల్లకాల్వలు తీయించాలి.
గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన డ్రిప్స్, స్ప్రింక్లర్లు, నల్లపట్టాలు, స్ప్రేయర్లు, సబ్సిడీపై ట్రాక్టర్లు ప్రస్తుత ప్రభుత్వం రద్దుచేసింది, వాటిని పునరుద్దరించండి.
గత ప్రభుత్వంలో ప్రారంభించిన సిసి రోడ్ల నిర్మాణపనులను ఇంతవరకు పూర్తిచేయలేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మిగిలిపోయిన రోడ్లు పూర్తిచేయాలి.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలులేవు.
గత ప్రభుత్వంలో మాదిరి మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
జగన్ ప్రభుత్వానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప రైతుల సమస్యలు పట్టడంలేదు.
జగన్ ముఖం చూసి రాష్ట్రంలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.
టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిద్దాపురం లిఫ్ట్ కు అనుబంధంగా పిల్లకాల్వల పనులు పూర్తిచేస్తాం.
డ్వాక్రాసంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు విధానాన్ని పునఃప్రారంభించి, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలుచేస్తాం.
పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటి చేస్తాం.