• కోవూరుకు చెందిన రైతులు యువనేత నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం అందించారు.
• మేము సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.
• సాగునీటి నీటి సమస్యకు పరిష్కారానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలి.
• పెన్నానది నుంచి గొలుసుకట్టు చెరువులకు నీరు సరిగా అందక తాగు, సాగు నీటికి ఇబ్బందిగా ఉంది.
• ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు పెట్టినా లాభం లేకుండా పోయింది.
• మీరు అధికారంలోకి మా సమస్య పరిష్కరించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
• టిడిపి ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, వనరులపై రూ.68,294 కోట్లు ఖర్చుచేస్తే, జగన్ వచ్చాక అందులో నాలుగోవంతు కూడా ఖర్చుచేయలేదు.
• టిడిపి అధికారంలోకి రాగానే లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేసి కోవూరు ప్రజల సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.
• రాష్ట్రంలో రైతాంగ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది.