హైదరాబాద్: ప్రముఖ సినీనటులు, సూపర్‌స్టార్ ఘట్ట మనేని కృష్ణ పార్థీవ దేహానికి తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కృష్ణ కుమా రుడు మహేష్‌బాబు సహా ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. తెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయిందని చంద్రబాబు అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ లో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖ రుడిగా, సూపర్‌స్టార్‌గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నటుడిగా, దర్శ కుడిగా, స్టూడియో అధినేతగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాత కృష్ణ అని కొనియాడారు. టాలీవుడ్ జేమ్స్ బాండ్‌గా, విలక్షణ నటునిగా పేరున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటన్నారు. కృష్ణ మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయిందని పేర్కొన్నారు. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్‌బాబుకు తీరని వేదన మిగిలిందన్నారు.ఈ బాధ నుంచి మహే ష్‌బాబు త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కృష్ణ మృతికి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ మృతి బాధాకరం: అచ్చెన్నాయుడు
సూపర్‌స్టార్ కృష్ణ మృతి బాధాకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజ రాపు అచ్చెన్నాయుడు పేర్కొ న్నారు. కళామతల్లి నేడు తన ముద్దు బిడ్డను కోల్పోయిందని మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, నిర్మాణ సంస్థ అధినేతగా తెలుగు సినిమా రంగంపై ఐదు దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేశారన్నారు. కృష్ణ మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటని పేర్కొ న్నారు. ఆయన కుటుంబం సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాల ని అచ్చెన్నాయుడు దేవుడిని ప్రార్ధించారు.
సాహసానికే ఊపిరి ఘట్టమనేని కృష్ణ: మాజీ ఎంపీ కంభంపాటి
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యులు కం భంపాటి రామమోహన్‌రావు తెలిపారు. నమ్మిన ఆదర్శాలకు జీవితాంతం కట్టు బడిన హీరో కృష్ణ అని, సినీ పరిశ్రమలో ఆయనలేని లోటు పూడ్చలేనిదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. నటనలో, వ్యక్తిత్వంలో ఆయనకు ఆయనే సాటని కొనియాడారు. తెలుగులో తొలి పూర్తి నిడివి కలర్, సినిమాస్కోప్, 70ఎంఎం సినిమాలు నిర్మించిన స్రష్ట అన్నారు. వందలాది సినిమా ఓలతో లక్షలాది సినీ కార్మికులకు ఉపాధి కల్పించిన ధన్యజీవి అని వివరించారు. నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా కృష్ణ అధిరోహించని ‘సింహాసనం’ లేదన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు, అభిమానులకు కంభంపాటి రామమోహన్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టాలీవుడ్ జేమ్స్ బాండ్ కృష్ణ : కాలవ శ్రీనివాసులు
తెలుగు సినీ వినీలాకాశం లో దశాబ్దాలుగా మెరిసిన టాలీవుడ్ జేమ్స్ బాండ్ కృష్ణ అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీని వాసులు కొనియాడారు. కృష్ణ మరణం పట్ల ఆయన ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నటుడిగా, నిర్మాత గా అనేక ప్రయోగాలు చేసిన సాహసిగా పేర్కొన్నారు. ఆయన సినీ ప్రయాణం స్పూర్తిదాయకమన్నారు. తెలుగుచిత్ర జగత్తులో ఉన్నత శిఖరాలకు ఎదిగిన నటశేఖరుడని, నటవిశ్వరూపంతో పాటు తన మంచి తనంతో లక్షలాది మంది అభిమానులను సంపాదిం చుకున్నారని వివరించారు. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వెంటవెంటనే తలి దండ్రులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నవ తరం సూపర్‌స్టార్ మహేష్‌బాబు కుటుంబానికి కాలవ శ్రీనివాసులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎన్నో ప్రయోగాలు చేసిన సూపర్ స్టార్ :నారా లోకేష్
సూపర్‌స్టార్ కృష్ణ సిని మారంగంలో ఎన్నో ప్రయోగాలుచేసి విజయా లు సాధించారని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనియాడా రు. కృష్ణ మృతికి మంగళవారం ఆయన ఒక ప్రకటనలో సంతా పం తెలిపారు. విభిన్న పాత్రలు పోషించడంతోపాటు వేగంగా సినిమాలు పూర్తి చేయడంలో రికార్డులు సృష్టించిన ఘనుడన్నారు. నేటి సినీరంగం ఎదుర్కుంటున్న ఒడిదుడుకుల నుంచి బయటపడేందుకు ఆయన ఒక మార్గదర్శ కుడిగా పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆదేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కళామతల్లి ముద్దుబిడ్డ ఘట్టమనేని కృష్ణ: నందమూరి బాలకృష్ణ
నటనలో కిరీటి, సాహసానికే మారుపేరు,సాంకేతికతలో అసాధ్యుడు, స్వయం కృషి తో ఎదిగిన సూపర్‌స్టార్,అపర దానకర్ణుడు ఘట్టమనేని కృష్ణ అని ప్రముఖ సినిమా హీరో,హిందూపూరం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కొనియాడారు. కళామతల్లి ముద్దుబిడ్డ ఘట్టమనేని అని ఆయన ఒకప్రకటనలో పేర్కొన్నారు. తెలుగులో కౌబాయ్ సినిమాలకు ఆధ్యుడు, గూఢచారి(సీక్రెట్ ఏజెంట్) సినిమాల్లో ఘనాపాఠి, సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో విశేష ప్రతిభను కనపరిచన నటుడని తెలిపారు. వర్ధమాన నటులకు, కళాకారులకు ఆదర్శప్రాయుడు కృష్ణ అన్నారు. ఆయనలేని లోటు తీర్చలేనిదని, సూపర్‌స్టార్ కృష్ణ మృతితో తెలుగు సినీపరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవం తుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.కృష్ణ కుటుంబ సభ్యులకు,అభిమానులకు బాలకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలిపారు.