• సర్వేపల్లి నియోజకవర్గం కృష్ణపట్నంకు చెందిన ఉప్పు భూముల రైతులు, రైతు కూలీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• పోర్టు రాకముందు గోపాలపురం గ్రామంలో 678 ఎకరరాలు ఉప్పు భూమి తరతరాలుగా సాగులో ఉంది.
• ఉప్పు భూములపై ఆధారపడి కృష్ణపట్నం, గోపాలపురం, పాదర్తిపాళెం, బేసిన్, ముత్తకూరుతో పాటు మరి కొన్ని గ్రామాల రైతులు, కూలీలు జీవనం సాగిస్తున్నాం.
• కృష్ణపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా భూములు సేకరించారు. దీనికి గాను ఉప్పు భూములకు పరిహారంగా ఎకరాకు రూ.15 లక్షల చొప్పున చెల్లించాలని 2015లో టిడిపి ప్రభుత్వం జిఓ కూడా విడుదల చేసింది.
• పరిహారం కోసం ప్రభుత్వానికి, కలెక్టర్ కు ఎన్నిసార్లు విన్నివించుకున్నా ఫలితం లేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక ఉప్పుభూముల రైతులకు 2015 జిఓ ప్రకారం పరిహారం చెల్లించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• భారీ ప్రాజెక్టులు, పరిశ్రమలు, పోర్టులు నిర్మాణం సమయంలో నిర్వాసితులకు పరిహారం అందించడం ప్రభుత్వాల బాధ్యత.
• గత ప్రభుత్వంలో జిఓ ఇచ్చినా ఇంతవరకు పరిహారం చెల్లించకపోవడం దురదృష్టకరం.
• ఉప్పుభూముల రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వానికి లేఖరాస్తాం.
• ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే టిడిపి ప్రభుత్వం ఉప్పుభూముల రైతులకు వడ్డీతో సహా పరిహారం చెల్లిస్తుంది.