- తప్పు కప్పిపుచ్చుకునేందుకే ప్రధానికి లేఖ
- ప్రపంచంలోనే కరడుగట్టిన హిందూ ద్వేషి జగన్
- జంతుకొవ్వు కలిసిన కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదం తయారీ మహాపచారం
- తిరుమలలో ఏఆర్ ఫుడ్స్ నుంచి నెయ్యి కొనుగోలు మొదలైంది జగన్ హయాంలోనే
- చంద్రబాబు సీఎం అయిన తరువాతే దిద్దుబాటు చర్యలు
- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి స్పష్టీకరణ
అమరావతి(చైతన్యరథం):ప్రపంచంలోనే అత్యంత కరుడుగట్టిన హిందూ ద్రోహి, హిందూ ద్వేషి జగన్ రెడ్డి…తిరుమల ప్రతిష్టను సీఎం చంద్రబాబు దిగజారుస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయటం చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని జగన్ దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో పట్టాభి మాట్లాడుతూ స్వామివారి ప్రసాదంలో జగన్ చేసిన పాపం గురించి తెలుసుకున్నాక ప్రతిరోజు, ప్రతి హిందువు వెంకటేశ్వరుడి ముందు నిలబడి క్షమించమని కోరాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎంతో భక్తి భావంతో నైవేద్యంగా సమర్పించే ప్రసాదాన్ని జగన్ ప్రభుత్వం అపవిత్రం చేసింది. భక్తులకు అందించిన ప్రసాదంలో జంతు కొవ్వు ఉండడం క్షమించరాని నేరం. రాష్ట్రాన్ని పాలించిన ఒక దుర్మార్గుడు చేసిన పాపం ఇది. జంతు పదార్థాలతో మిళితమై, కలుషితమైన నెయ్యితో శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూలను తయారు చేయడం మహా అపచారం. జగన్ అనే హిందూ ద్రోహి, ద్వేషిని ప్రపంచం క్షమించదు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందనే వార్తను జీవిత కాలంలో వినాల్సి వస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. తిరుపతి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న విషయం ఎన్‌డీడీబీ ల్యాబ్ రిపోర్టు ద్వారా తేటతెల్లమైంది. ఇంత స్పష్టంగా ల్యాబ్ రిపోర్టు ఆధారంగా తప్పు బయటపడినా.. మీడియా ముందుకొచ్చి జగన్ బుకాయిస్తూ చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాడు. ఇంత ఘోరమైన తప్పు చేసి సిగ్గు లేకుండా బుకాయించడం జగన్‌కే చెల్లింది. ఈ విషయంలో మీడియాకు వివరణ ఇచ్చే సమయంలో జగన్ ముఖంలో బాధ అనేది ఏ కోశాన లేదు. అయ్యో ఇంత పాపం జరిగిందా అనే పాశ్చాత్తాపం కనబడలేదు. ఇంతటి పాపం కలలో కూడా ఎవరూ చేసి ఉండరని పట్టాభి దుయ్యబట్టారు.
జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే
తిరుపతి ప్రసాదం లడ్డూ విషయంలో జగన్ అన్నీ అబద్ధాలు వండి వార్చాడు. చంద్రబాబు అబద్ధాలు చెప్పారని జగన్ అంటున్నాడు. మరోపక్క ఆ భగవంతుడే నాతో నిజం మాట్లాడిరచాడని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏఆర్ ఫుడ్స్ నుంచి నేతి కొనుగోలు ప్రారంభం అయింది జగన్ హయాం నుంచే. నెయ్యి కొనుగోలుకు సంబంధించిన టెండరు 2024, మార్చి 12 న పిలిస్తే.. మే 8న ఏఆర్ ఫుడ్స్‌కు అనుకూలంగా టెండర్ ఖరారు చేసి మే 15 నెయ్యి కొనుగోలుకు పర్చేజ్ ఆర్డర్ కూడా విడుదల చేశారు. ఆ మరుసటి రోజు నుండే ఏఆర్ ఫుడ్స్ టీటీడీకి కలుషిత నెయ్యి సరఫరా ప్రారంభించింది. జూన్ 12న ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, టీటీడీకి నూతన ఈవో శ్యామల రావు నియామకం జరిగింది. ఆ తరువాత ప్రసాదాల నాణ్యత విషయమై భక్తుల నుండి పదే పదే వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ప్రసాదాలు, అన్నదానాలకు సంబంధించి వాడుతున్న ముడి సరుకుల నాణ్యతను పరీక్షించమని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆయన ఆదేశానుసారం ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేస్తున్న నెయ్యిపౖౖె కూడా దృష్టి సారించి దానిలో నాణ్యతా లోపం ఉందని ప్రాథమికంగా గుర్తించి, మరిన్ని సాంకేతికపరమైన పరీక్షల కోసం గుజరాత్‌లోని ఎన్డీడీబీ ల్యాబ్ కు నెయ్యి శాంపిళ్లను పంపించారని పట్టాభి తెలిపారు.
నెయ్యి కొనుగోలు ప్రారంభయింది ఎవరి హయాంలో?
జులై 12వ తేదీన మాత్రమే ఏఆర్ ఫుడ్స్ నుంచి నెయ్యి వచ్చిందని జగన్ అంటున్నారు. ఆ తర్వాత నెయ్యే రాలేదంటున్నారు. ఇందులో అర్థంలేదు. జులై నెలలో చంద్రబాబే ముఖ్యమంత్రి అనే రీతిగా మాట్లాడుతున్నాడు. మా ప్రభుత్వం లేదని జగన్ బొంకుతున్నాడు. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలవాలి. 204, మార్చి 12న నెయ్యి కొనుగోలుకు టెండర్ పిలిచినప్పుడు సీఎం ఎవరో జగన్ చెప్పాలి. మే 15 నుంచి ఏఆర్ ఫుడ్స్ నుంచి నెయ్యి కొనుగోలు ప్రారంభమైంది. అప్పుడు సీఎం ఎవరో చెప్పాలి. గత 5 సంవత్సరాల కాలంలో లడ్డూ ప్రసాదాలపై, అన్న ప్రసాదం నాణ్యతపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. స్వామివారి భక్తులు ధర్నాలు కూడా చేశారు. అయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కర్నాటక మిల్క్ ఫెడరేషన్ 2013 నుంచి 2018 మధ్య టీటీడీకి, దాదాపుగా 4 వేల టన్నుల నందినీ నెయ్యి సరఫరా చేసిందని ఆ సంస్థ ఛైర్మన్ బీమా నాయక్ చెప్పారు. 2019లో 2 వేల టన్నుల నెయ్యి సరఫరా చేసింది. జగన్ అధికారంలోని రాగానే ఆ సంస్థ నుంచి నెయ్యి కొనుగోళ్లు నిలిపివేశారు. అక్కడి నుంచే నెయ్యిలో కల్తీకి బీజం పడిరది. ఐదేళ్ల జగన్ పాలనలో ఎన్నో ఆలయాలు కూల్చేశారు. రథాలు తగులబెట్టారు.. విగ్రహాలు పగలగొట్టారు. జగన్ రెడ్డి హిందూ ద్రోహి. రామతీర్థంలో రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే తాడేపల్లి కొంపలో కూర్చుని పైశాచిక ఆనందం పొందారని పట్టాభి అన్నారు.
వాస్తవం తెలిసీ బుకాయింపు
హిందూ ద్వేషి జగన్‌రెడ్డి.. ప్రధానికి లేఖ రాయడం విడ్డూరం. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే ప్రధానికి లేఖ రాశావు. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు. టీడీపీ హయాంలో వేల టన్నుల స్వచ్ఛమైన నందిని నెయ్యి సరఫరా చేసినట్లు కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ఛైర్మన్ మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఆయన ప్రెస్ మీట్ ని కూడా యూట్యూబ్‌లో ఇప్పుడు కూడా చూడొచ్చు. జగన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో తప్పుడు సమాచారం ఇచ్చారు. ఏది రాస్తే అది గొర్రెల్లా నమ్మేస్తారని జగన్ అనుకుంటున్నాడు. ఏదైనా రిపోర్టు గురించి ప్రస్తావన తెచ్చినప్పుడు మనం ఆ రిపోర్టులో ఎన్‌క్లోజ్డ్ మెన్షన్ రిపోర్టు కాపీ అని పెట్టి ఆ రిపోర్టును జతచేస్తాం. జంతు కొవ్వు లేదని నిర్ధారించారని చెబుతున్నారు. అలాంటప్పుడు ఆ కాపీని ఎందుకు జతచేయలేదు? రిపోర్టులో తాటికాయంత అక్షరాలతో ఉంది. లాడ్(పంది కొవ్వు), బీఫ్ టాలో(గొడ్డు కొవ్వు), ఫిష్ ఆయిల్ ఉన్నట్లు స్పష్టంగా ఉంది. ఈ విషయాలు జగన్‌కు తెలుసు. వాస్తవాలు తెలిసీ బుకాయిస్తున్నాడు. తాను చేసిన పాపమేంటో జగన్‌కు తెలుసు. అందుకనే ప్రధానికి రాసిన లేఖకు రిపోర్టు కాపీని జతపరచలేకపోయాడని పట్టాభి ధ్వజమెత్తారు.
జగన్ పాపం అందరికీ అర్థమయింది
ఈ రిపోర్టులో కొన్ని స్పెషల్ కండిషన్స్ అంటూ ప్రస్తావించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ల పరిశీలనలో తేలిన అంశాలు వాస్తవం కాకపోయే అవకాశం ఉంది. ఈ రిపోర్టు పబ్లిక్ డొమైన్‌లోనే ఉంది. ఇంగితజ్ఞానంతో ఆలోచించాలి. ఆవులో కొన్ని లోపాలుంటే రిపోర్టులో తేడా ఉండొచ్చని రాశారు. ఒక్క ఆవు వేల టన్నుల నెయ్యి తయారు చేసే పాలు ఇచ్చేస్తుందా అనే విషయం ఆలోచించాలి. అలాంటా సూపర్ కౌస్ ఎక్కడా లేవు. జగన్ ఆలోచనా ధోరణి సరిగా లేనట్లు స్పష్టమౌతోంది. ప్రెస్ మీట్ లో రిపోర్టు చదవడానికే కిందా మీద పడ్డాడు. నీకున్న చదువు పరిజ్ఞానమేంటో ప్రెస్‌మీట్ లో జనమంతా చూశారు. ప్రజల్ని ఏదో ఒక విధంగా తప్పుదోవ పట్టించాలనేదే జగన్ ఉద్దేశం. పచ్చి అబద్ధాలు వండి వార్చుతున్నారు. జగన్ చేసిన పాపం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక హిందువుకి స్పష్టంగా అర్థమైంది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జగన్ దిష్టి బొమ్మలు తగలేస్తున్నారు. అవసరమైతే సీబీఐ ఎంక్వైరీ వేయడానికి కూడా కూటమి ప్రభుత్వం వెనకాడదు. దీని వెనుక ఉన్న పాపాత్ములందరికీి కఠినాతికఠినమైన శిక్ష పడాలని ప్రపంచంలోని హిందువులతోపాటు అన్ని మతాలవారు కోరుకుంటున్నారని పట్టాభి స్పష్టం చేశారు.