దుగ్గిరాల(చైతన్యరథం): ప్రజల ఆస్తులు కాజేసేందుకే రాష్ట్రంలో తరతరాల నుంచి కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను తొలగించి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చారని యువనేత నారా లోకేష్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల మండలం శృంగారపురంలో సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. తొలుత గ్రామంలోని చింతాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ.. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలైతే అధికారుల నిర్ణయమే ఫైనల్ అవుతుందన్నారు. ప్రజలకు కోర్టుకు వెళ్లే అధికారం కూడా ఉండదు. వైసీపీ నేతలకు ఎవరి ఇల్లు నచ్చినా, పొలం నచ్చినా అధికారుల వద్దకు వెళ్లి వారి పేరుపై రాసుకుంటారు. ప్రజల ఆస్తుల ఒరిజనల్ పత్రాలు జగన్ వద్దకు పెట్టుకుని మనకు జిరాక్స్ పేపర్లు ఇస్తారట. అందుకే ఈ చట్టం తీసుకువచ్చారు. లాటరీ కింగ్ ద్వారా జగన్ పార్టీలోకి రూ.165 కోట్లు డబ్బులు వచ్చాయి. పొరపాటున రేపు అధికారంలోకి వస్తే ఇసుక, మద్యంపై దోపీడీతోపాటు లాటరీ కూడా తీసుకువస్తారు. జగన్ పాలనలో తల్లి, చెల్లికే భద్రత లేదు, ఇక మన పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలి. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కష్ట,సుఖాల గురించి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏనాడైనా పట్టించుకున్నారా? ఎన్నికల ముందు బాగా నటిస్తున్నారు. నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకే వచ్చా. మన పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తా. మొదటి ఏడాదిలోనే ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు అందజేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తాం. ఇక్కడి రోడ్లపైకి ఆర్కే వస్తే నడుం నొప్పి వస్తుంది. ఆయన ఆరోగ్యం కాపాడుకునేందుకే ఇటువైపు రావడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు నిర్మిస్తాం. ఎన్నికలయ్యాక గ్రామంలోని చింతాలమ్మ తల్లి ఆలయాన్ని అభివృద్ధి చేస్తా. మంగళగిరిని పర్యాటక కేంద్రంగా మారుస్తా. సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా మంగళగిరిని తీర్చిదిద్దుతా, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని లోకేష్ కోరారు.
యువనేత దృష్టికి శృంగారపురం సమస్యలు
శృంగారపురం వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. కరెంట్ కోతలు లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలి. డొంక రోడ్లు వేయాలి. రేవేంద్రపాడు – శృంగారపురం మధ్య వీధి లైట్లు ఏర్పాటుచేయాలి. శృంగారపురం బ్రిడ్జి నిర్మించాలి. గ్రామానికి విరివిగా రవాణా సౌకర్యం కల్పించాలి. 2016లో బీసీలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు దారి విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇళ్ల స్థలాలకు రోడ్డుతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించాలి. మాదిగ సోదరులకు శ్మశానానికి స్థలం ఇవ్వాలి. హిందూ శ్మశానానికి దారి ఏర్పాటు చేయాలని కోరారు. లోకేష్ స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వంలో గృహాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేసి, పెరిగిన కరెంట్ చార్జీలు తగ్గిస్తామన్నారు. డొంక రోడ్లు ఏర్పాటుచేస్తాం. రేవేంద్రపాడు-శృంగారపురం మధ్య వీధి లైట్లు ఏర్పాటుచేస్తాం. శృంగారపురం బ్రిడ్జి నిర్మిస్తాం. అధికారులతో మాట్లాడి గ్రామానికి బస్సు సౌకర్యంపై చర్యలు తీసుకుంటాం. బీసీలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు దారి, విద్యుత్ సౌకర్యంపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం. దామాషా ప్రకారం శ్మశానాలకు స్థలం కేటాయిస్తాం. దళితులకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.