చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

శాంతిభద్రతలుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం

by చైతన్యరధం
Nov 22, 2024 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వెల్త్‌, హెల్త్‌, హ్యాపీనెస్‌..ఇదే స్వర్ణాంధ్రప్రదేశ్‌-2047 విజన్‌ సారాంశం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గంజాయిపై గత ప్రభుత్వం సమీక్షించిందే లేదు
  • గంజాయి బ్యాచ్‌లు చెలరేగిపోయిందందుకే..
  • తల్లీ చెల్లిని అవమానించనవాళ్లకు జగన్‌ సపోర్ట్‌
  • అసభ్య పోస్టులు చూస్తే మనసు వికలమవుతుంది
  • పేటీయం బ్యాచ్‌తో సోషల్‌ మీడియాలో ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌
  • ఈ పరిస్థితికి గత పాలకులే కారణం..
  • పోలీస్‌ శాఖను బలోపేతం చేస్తున్నాం..
  • త్వరలో 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ
  • రాష్ట్రంలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ క్యాంపస్‌ ఏర్పాటు
  • భూ అక్రమాలకు ఎవరు పాల్పడినా జైలుకు పంపుతాం
  • అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం

అమరావతి (చైతన్య రథం): దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా.. శాంతి భద్రతలు పరిఢవిల్లినచోటే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజలకు ప్రశాంతత ఉంటుంది. భయపడుతూ బతికితే చోట అభివృద్ధి సాగదు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు రావాలంటే పెట్టుబడులు రావాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం శాసన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ‘ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే పటిష్ట చర్యలు, చట్టాలు అవసరం. రాష్ట్రంలో శాంతి భద్రతలుంటే తప్ప పెట్టుబడులు రావని ఆలోచించి తరతమ లేకుండా ఫ్యాక్షన్‌ను అణచేశాం’ అన్నారు. గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా చిరునామాగా ఏపీ పేరు వినిపించేదని అంటూ, ముంద్రా పోర్టుకు ఏపీ అడ్రస్‌తో డ్రగ్స్‌ వచ్చాయని, దీనిపై నిరసన తెలిపితే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారన్నారు. గంజాయిపై ఏనాడూ సమీక్ష చేయకపోవడంతో స్వేచ్ఛదొరికి గంజాయిని విచ్చలవిడిగా పండిరచారని, గంజాయి విక్రేతలూ రాష్ట్రంలో పెరిగారన్నారు. గంజాయి తీసుకున్న వారికి తల్లి, చెల్లికి వ్యత్యాసం తెలీదని, ఏ నేరం జరిగినా గంజాయి మత్తులోనే చేస్తున్నారన్నారు. కాలేజీల పరిసరాల్లోకీ గంజాయి వెళ్లిందంటూ, గంజాయి, డ్రగ్స్‌కు అలవాటుపడిన వారిని మార్చాలంటే కష్టమవుతుందని, ఇదొక దురదృష్టకర పరిణామమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సోషల్‌ మీడియాలో అనుచిత భాషతో పోస్టులు పెడుతున్నారు. ఎప్పుడు ఎవరిపై ఏ ఆర్టికల్‌ వస్తుందో తెలీదు. తల్లి, చెల్లిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టినవారిని జగన్‌ ప్రోత్సహించారు. వర్రా రవీందర్‌ రెడ్డి ఒక నేరస్తుడు. షర్మిల రాజశేఖర్‌రెడ్డి బిడ్డకాదు విజయమ్మ బిడ్డ మాత్రమేనని పోస్టులు పెట్టాడు. ఇంకా నోటితో చెప్పలేని భాషతో పోస్టులు పెట్టాడు. ఇలాంటి దారుణమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని సమర్ధిస్తూ… అతని పేరుతో తప్పుడు పోస్టులు పెట్టారని వెనకేసుకొచ్చాడు. వర్రా రవీందర్‌రెడ్డి పోస్టుల వెనక అవినాష్‌ రెడ్డి, అతని పీఏ ఉన్నారని, అరెస్టు చేయాలని షర్మిల కోరింది. తనపై అసభ్యంగా పోస్టులు పెట్టారని బాధితురాలే చెప్తుంటే ఇంకా సమర్ధిస్తున్నారు’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళ, హోమంత్రి అనితపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, డీజీపీ, ఉప ముఖ్యమంత్రి అంటే లెక్కలేకుండా ప్రవర్తించారని చంద్రబాబు గుర్తు చేశారు. పవన్‌ కళ్యాణ్‌పై పెట్టిన పోస్టులు చూస్తే మనసు వికలమవుతుంది, బాధ కలుగుతుంది. ప్రజలకు సేవ చేయాలని వచ్చి అవమానాలు పడటమేంటన్న బాధ కలుగుతోందన్నారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా పోస్టులు, వ్యాఖ్యలు చేస్తున్నారు. పేటీయం బ్యాచ్‌ను పెట్టుకుని ఆర్గనైజ్డ్‌గా ఇవన్నీ చేస్తున్నారు. డిజిటల్‌ కార్పొరేషన్‌లో సొంత మనుషులను పెట్టి సోషల్‌ మీడియాలో పని చేయించుకున్నారు. వాళ్లే తెలివిగలవాళ్లు, ఆటలు సాగుతాయని అనుకున్నారు. ఇక ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏంచేయాలో చేసి చూపిస్తా. పటిష్ట చట్టాలు తెచ్చి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాం అని చంద్రబాబు హెచ్చరించారు.
‘భూమి సమస్య చాలా సున్నితమైంది. తల్లీబిడ్డకు ఉన్న సంబంధమే భూమికి, యజమానికి ఉంటుంది. రెండు సెంట్ల భూమి కోసం ఎన్నో పోరాటాలు చేసిన సందర్భాలు చూశాం. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్‌ మాఫియాను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తెచ్చింది. 2023 జీవో నంబర్‌ 512 ద్వారా ఈ చట్టం తెచ్చారు. ఈ చట్టం ఒక కుట్ర… రాజ్యాంగ విరుద్ధం. దీంతో మోసాలకు అక్రమాలకు తెరతీశారు. జ్యుడిషియల్‌ అధికారాలు తొలగించారని’ చంద్రబాబు వ్యాఖ్యానించారు. సెక్షన్‌ 38 ప్రకారం సివిల్‌ జడ్జి అధికారాలను రెవెన్యూ అధికారులకు ఇచ్చారు. ఎవరినైనా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అధికారిగా పెట్టుకునేలా చట్టంలో పేర్కొన్నారు. అంటే సాక్షిలో పని చేసే గుమస్తాలను అధికారులుగా పెట్టాలని చూశారు. రెవెన్యూ రికార్డులో పేరు మార్పు చేయాలంటే ఆ యజమానికి నోటీసు కూడా ఇవ్వడానికి అవకాశం లేకుండా నేరుగా హైకోర్టులో తేల్చుకునేలా చేశారు. సామాన్యులు కోర్టులు చుట్టూ తిరగగలరా? టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా ఎవరినైనా నియమించుకోవచ్చని పేర్కొన్నారు. ఇవన్నీ చూశాక సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేశామని చంద్రబాబు వివరించారు. ‘నాకు వచ్చే వినతుల్లో ఎక్కువ శాతం భూ సమస్యలకు సంబంధించినవే. అందుకే కఠినమైన చట్టాన్ని తెస్తున్నాం. అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేశాక యాంటీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ తెచ్చాం. ఎక్కడ భూమి కబ్జా చేసినా ఈ చట్టం అమలవుతుంది. భూమి కబ్జాకు ప్రయత్నించినా బెదిరించినా ఈ చట్టం ప్రకారం శిక్షిస్తాం. ల్యాండ్‌ కబ్జా చేయలేదని వారే నిరూపించుకోవాలి అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ల్యాండ్‌ గ్రాబింగ్‌ చేస్తే బయటకు కూడా రాలేరు. అక్రమాలకు పాల్పడ్డారని తెలిస్తే భూమి పోవడంతో పాటు, చట్ట ప్రకారం జైలుకు కూడా వెళ్తారని హెచ్చరించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని, పీడీ యాక్టుకు కూడా పదును పెడుతున్నామని, పకడ్బందీగా చట్టం ఉంటేనే ఆక్రమణదారులు భయపడతారని సీపం చంద్రబాబు అన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడ్డవారిని 6 నెలల్లోనే శిక్షిస్తామని, కల్తీ విత్తనాలు అమ్మినా, ఇసుక అక్రమాలకు పాల్పడినా, బియ్యం మాఫియాకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్‌ అమలు చేస్తామని చంద్రబాబు వెల్లడిరచారు.
పర్యాటకులు రావాలంటే రాష్ట్రంలో భదత్ర ఉండాలి. గత ప్రభుత్వంలో విదేశాల నుండి ఒక మహిళ వస్తే నెల్లూరులో కిడ్నాప్‌ చేసినా పట్టించుకోలేదు. నాలెడ్జ్‌ ఎకానమీకి ఏపీ చిరునామా కావాలంటే శాంతిభద్రతలు ముఖ్యం. స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ 2024 విజన్‌ సాకారం కావాలన్నా శాంతిభద్రతలు ఉండాలని చంద్రబాబు అన్నారు. ‘పోలీస్‌ వ్యవస్థకు మచ్చ తెచ్చిన వారిని శిక్షిస్తాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఊరుకోం. పోలీసులు ప్రజాహితం కోసం పని చేయాలి. దేశంలోనే మొదటిసారి బాడీ ఓన్‌ కెమెరాలు తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో పోలీస్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం. త్వరలోనే 6,100 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ.60 కోట్లు కూడా విడుదల చేశాం. మేము ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వినియోగించలేదు. వాటిని మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తాం. పోలీసు వాహనాలు కూడా నడిచే పరిస్థితి లేకుండా పోయింది. పర్యటనల కోసం గతంలో బలవంతంగా కార్లు లాక్కున్న పరిస్థితులు చూశాం. 2,812 వాహనాల కొనుగోలుకు రూ.281 కోట్ల నిధులు మంజూరు చేశాం. పోలీసు వాహనాలకు కనీసం పెట్రోల్‌ డబ్బులు కూడా ఇవ్వలేదు. అందుకే నాలుగు చక్రాల వాహనాలను 150 లీటర్లు నుండి 300 లీటర్లు డీజిల్‌, ద్విచక్ర వాహనాలకు 25 లీటర్ల నుండి 50 లీటర్లకు పెట్రోల్‌ వినియోగాన్ని పెంచాం. పోలీసులకు రూ.859 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. వాటిని త్వరలోనే విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. వెల్ఫేర్‌ ఫండ్‌కు రూ.20 కోట్లు విడుదల చేశామని, అమరవీరుల స్థూపం నిర్మాణానికి రాజధానిలో 5 ఎకరాలు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
‘ప్రతి జిల్లాలో ఒక సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తాం. ఎఫ్‌ఎస్‌ఎల్‌ను తుళ్లూరులో రూ.152 కోట్లతో పనులు ప్రారంభిస్తే దాన్ని కూడా పూర్తి చేయలేదు. త్వరలోనే మేము దాన్ని పూర్తి చేస్తాం. రీజియన్‌ ఎఫ్‌ఎల్‌ఎస్‌ను అనంతపురం, తిరుపతి, రాజమండ్రిలో ఏర్పాటు చేస్తాం. నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ రాజధానిలో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడిరచారు. యాంటీ డ్రగ్స్‌ క్యాంపెయిన్‌ను ఈగల్‌ (ఎలైట్‌ యాంటీ నార్కోటిక్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) ద్వారా పర్యవేక్షిస్తామని చంద్రబాబు అన్నారు.
వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో సాక్షిలో గుండెపోటుతో చనిపోయారని కథనం నడిపారు. ఎవరైనా హత్య జరిగిందని తెలిస్తే వెంటనే వచ్చేస్తారు. కానీ తీరిగ్గా సాయంత్రం రోడ్డు మార్గాన వచ్చారు. అక్కడి సీఐని మేనేజ్‌ చేశారు. రక్తం మరకలు కనబడకుండా బాత్రూమ్‌ క్లీన్‌ చేసి వెంటనే ఫ్రీజర్‌లో తెచ్చి పెట్టారు. గుండెపోటుతో చనిపోయారని విజయసాయిరెడ్డి కూడా చెప్పారు. సునీతారెడ్డి పోస్టుమార్టమ్‌ చేయాలని అడగ్గా, అప్పుడు నెత్తిపైన గొడ్డలి వేట్లు ఉన్నాయని తేలింది. మళ్లీ మరుసటి రోజు సాక్షిలో మాత్రం నారాసుర రక్తచరిత్ర అని నేను హత్య చేయించినట్లు రాశారు. ఇలాంటి పని ఎవరైనా చేయగలరా? కోడికత్తితో పొడిపించుకని సింపతీ పొందాలని చూశారు. విజయవాడలో గులకరాయితో కొట్టించుకున్నారు. ఏంటీ ఈ డ్రామాలు.? ఇలాంటి రాజకీయాలు నా జీవితంలో చూడలేదు’ అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
రాజకీయ ముసుగులో నేరాలు చేయాలని చూస్తే ముసుగు తీసి నేరస్తులుగా చూపిస్తా. మేము తప్పులు చేస్తే చెప్పండి, విని సరిచేసుకుంటాం. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆటలు సాగవు. మృగాలకంటే హీనంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడు ఏం చేయాలన్నా చట్టం కట్టేస్తోంది. ఇలాంటి వారిని సమాజం ఛీ కొట్టేలా చేయాలి. ప్రజల నుండి దూరం చేయాలి. పోలీసులు వచ్చేలోపే తిరుగుబాటు చేసి నీచులను కొట్టాలి. ప్రభుత్వం చేసే ప్రయత్నాలను ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలి’ అని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

రూ.119 కోట్లతో టీసీసీ!

Previous Post

త్వరలో నూతన టెక్స్‌టైల్‌ పాలసీ

Next Post

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్‌ రంగానికి మహర్దశ..

మరిన్ని వార్తలు

చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

కార్యకర్త
@ March 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist