అమరావతి : చట్ట సభల్లో జరుగుతున్న విషయాల్ని ప్రజలు గమనించాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి, స్పీకర్ కలిసి చట్ట సభలని చట్టు బండలుగా మర్చారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బుచ్చయ్య చౌదరి అన్నారు. అబద్ధాల కోరు ముఖ్యమంత్రి శాసనసభని సినిమా హాల్‌గా మర్చారు. సినిమా వాళ్ళు సినిమా తీసి ఎడిట్ చేసినట్లు లేనిదాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు అబద్దాలు సృష్టించి ప్రచారం చేయడంలో అగ్రగన్యుడు జగన్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం. తెలుగుదేశం పార్టీ హయాలో త్వరిత గతిన 72 శాతం పనులు పూర్తి చేశారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో కాల్వలు తవ్వి బిల్లులు చేసుకున్నారు తప్ప సివిల్ నిర్మాణాలులేవు.
నమ్మించి నట్టేట ముంచారు
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2014లో భూసేకరణ చేసిఎకరానికి రూ.14లక్షల చొప్పున నష్ట పరిహారంఇచ్చి అక్కడ పనులు ప్రారంభించింది. ఐదే ళ్ళలో 72శాతం పనులు పూర్తిచేసింది. వైఎస్.రాజశే ఖర్‌రెడ్డి, చంద్రబాబు హయాంలో దాదాపు రూ.6వేల కోట్లు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ఖర్చుపెట్టారు. ప్రతి పక్షంలో జగన్‌రెడ్డి ఉన్నప్పుడు రూ.లక్షా 50వేలు సరి పోవని,తాను అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.5 లక్షలు అదనంగా ఇస్తానని చెప్పి ప్రజలని నమ్మించి నేటికి ఒక్కరూపాయి చెల్లించకుండా మోసం చేశారు. రూ.19లక్షలు ఒక్కో ఎకరా నికి ఇస్తానని చెప్పారు. ఆ తరువాత రూ.10లక్షలు అన్నారు. నేడు జీవో ఇచ్చా ను అంటూ తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అనే రీతిలో జీవో ఇంప్లి మెంటేషన్‌లో లేదు. జగన్‌రెడ్డి పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలని దగా చేశారు. ఏటీఎం అంటూ గతంలో తప్పుడు ప్రచారం చేశారు. నేడు కేంద్రాన్ని రూ.55వేల కోట్లు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజి ఇవ్వడానికి 2013 లో వచ్చిన చట్టం ప్రకారం టీడీపీ ప్రయత్నిస్తూ కేంద్రా న్ని ఒప్పిం చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తే జగన్‌రెడ్డి ఏటీఎం అంటూ ఆరోపణలు చేశారు. జగన్‌రెడ్డి తప్పుడు ప్రచా రాలు చేసి అధికారంలోకి వచ్చారు.
వ్యక్తిగత ఎజెండాతోనే ఎత్తు కుదింపు
కేసిఆర్‌తో జగన్‌రెడ్డి లాలూచీపడి తన భూములని కాపాడుకోవడం కోసం వాళ్లు చెప్పినదానికి తలూపు తున్నారు. ప్రాజెక్ట్ ని 45.72 మీటర్ల నుంచి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. 322టీఎంసీల నీటి సామర్ధ్య మున్న ప్రాజెక్ట్‌ని కేవలం 91 టీఎంసీలకు తగ్గిస్తున్నా రు. 41.5 మీటర్లు చేస్తే 20,946 కుటుంబాల్ని తర లించాలి. ఇప్పుడు 11,556 కుటుంబాల్ని మాత్రమే తరలించారు. 8,670 కుటుంబాల్ని తరలించలేదు. ఒక్క రూపాయి నష్ట పరిహారం చెల్లించలేదు. ప్రభు త్వానికి ప్రాజెక్ట్ మీద చిత్తశుద్ధి లేదు.
కాంట్రాక్టర్లను ఎందుకు మార్చారు?
ప్రభుత్వం మారటంతోనే పాత కాంట్రాక్ట్ ఏజెన్సీల ని రద్దు చేశారు. జగన్‌రెడ్డి బంధు వర్గానికి కాంట్రాక్టు లని కట్టబెట్టారు. కృష్ణ పట్నం పోర్టుని వారికే కట్ట బెట్టారు. మెగా కృష్ణారెడ్డి ఎవరు? ఆయన కంపెనీకి ఉన్న అర్హతలేమిటి? ఎల్‌అండ్ టీ, బావర్ కంపెనీలని తప్పించారు. జగన్‌రెడ్డి తెలివి తక్కువ పని వల్ల రెండు సంవత్సరాలు అయినా పవర్ ప్లాంట్ పూర్తి కాలేదు. చట్టసభలో జరుగుతున్న విషయాల్ని ప్రజలు గమనిం చాలని విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి, స్పీకర్ కలిసి చట్ట సభలని చట్టుబండలుగా మార్చారు. వైఎస్. రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాల్వలు తవ్వి బిల్లులు చేసుకున్నారు తప్ప సివిల్ పనులు చేయలేదని, భూసే కరణ చేయలేదని బుచ్చయ్యచౌదరి చెప్పారు.