దళిత యువకుడు కాండ్రు శ్యామ్కుమార్కు న్యాయం చేయా లంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు, నందిగామ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, తెదేపా శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల వద్ద జాతీయ రహదారిపై శనివారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ దళిత యువకుడికి న్యాయం జరిగే వరకూ టీడీపీ పోరాడుతుందన్నారు. దళిత యవకుడికి న్యాయం చేయకపోతే ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరించారు.