- సమయం లేదు మిత్రమా.. యుద్ధానికి సిద్ధమా
- బాంబులకే భయపడలేదు
- చిల్లర కేసులకు భయపడతామా
- పాలకొండ శంఖారావం సభలో లోకేష్
పాలకొండ: సమయం లేదు మిత్రమా.. యుద్ధానికి సిద్ధమా.. వచ్చే రెండు నెలలు కష్టపడి టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలని రెండు పార్టీల కార్యకర్తలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో మంగళవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటీయం బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది.. ఆ జిత్తులను తిప్పికొట్టాలి.. మన లక్ష్యం ఒక్కటే ఆంధ్ర రాష్ట్రం నుంచి సైకో జగన్ ను తరిమికొట్టాలని స్పష్టం చేశారు. అసలు ఉత్తరాంధ్ర స్పీడే వేరు. ఎవరైనా మంచిపని చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు. చెడు చేస్తే తాట తీస్తారు. మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు నడిచిన పుణ్యభూమి. ఇలాంటి ప్రాంతానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ అర్జునుడు, అభిమన్యుడు కాదు…సైకో, భస్మాసురుడు, సద్దాం హుస్సేన్. టీడీపీ కట్టిన వాటికి వైసీపీ రంగులు వేసుకుంటున్నారని లోకేష్ దుయ్యబట్టారు.
చిల్లర కేసులకు భయపడతామా
చంద్రబాబులా ఇమేజ్ తెచ్చుకోవాలని జగన్ తెగ ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు విజనరీ, జగన్‌రెడ్డి ప్రిజనరీ. ఏ తప్పూ చేయని చంద్రబాబును 53 రోజు లు జైలుకు పంపారు. లక్ష కోట్లు లూటీ చేసిన జగన్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్తాడు. జగన్‌కు సవాల్ విసు రుతున్నా… అవినీతి ఆరోపణలపై చర్చకు మేం సిద్ధం, మీరు సిద్ధమా? బాంబులకే భయపడని కుటుంబం మాది… చిల్లర కేసులకు భయపడతామా? నేను రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతుంటే నాన్ బెయిలబుల్ కేసు లు పెట్టారు. తప్పు చేస్తే వచ్చి అరెస్ట్ చేసుకోండి. చంద్రబాబుపై దొంగకేసులు పెట్టి అర్థరాత్రి అరెస్ట్ చేశారు. అరెస్టు చేసినప్పుడు స్కిల్ డెవలెప్మెంట్లో రూ.3 వేల కోట్ల కుంభకోణం అన్నాడు.తర్వాత రూ.3 వందల కోట్ల కుంభకోణం అన్నారు. ఇప్పుడు రూ.27కోట్ల కుంభకోణం అంటున్నారు. చంద్రబాబుపై ఛార్జ్ షీట్ ఇస్తే ఇదేం ఛార్జ్ షీట్ అని కోర్టు కూడా చీకొట్టింది. నిజాయితీకి మారు పేరు చంద్రబాబు. అవినీతిపై చర్చించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని జగన్ కు సవాల్ విసురుతున్నా. చంద్రబాబు జైల్లో ఉంటే ఆయన చేసిన మంచి పనులు రోజుకొకటి బయటకు వచ్చాయి. జగన్ లోపలుంటే ఆయన చేసిన కుంభ కోణాలు బయట కొచ్చాయని లోకేష్ ఎద్దేవా చేశారు.
ప్రజల కోసం రుషికొండ ప్యాలెస్
ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్‌రెడ్డి. మూడు రాజ ధానులు నాటకమాడి ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. 500 కోట్లతో విశాఖలో ప్యాలెస్ కట్టుకున్నారు. ఆ రూ.500 కోట్లతో పేదలకు వేల ఇళ్లు కట్టవచ్చు. రోడ్లు వేయ వచ్చు. నియోజకవర్గాల రూపురేఖలు మార్చవచ్చు. రేపు ఆ ప్యాలెస్‌ను ప్రజల కోసం వినియోగించే బాధ్యత టీడీపీ-జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. విశాఖ రైల్వే జోన్ కు భూములు కేటాయించలేదు. అధికారంలోకి వచ్చాక విశాఖ రైల్వే జోన్ కు భూమి కేటాయిస్తాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తున్నారు. అవసరమైతే ఆ ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. రైల్వే జోన్ కు భూములు కేటాయించని వ్యక్తి జగన్. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు. ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. అవసరమైతే ఉక్కు ఫ్యాక్టరీని మన రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
హామీలపై మాటతప్పిన జగన్
జగన్ పాదయాత్ర సమయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మాట తప్పారు. ఉత్తరాంధ్రను అభి వృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీనే. రోడ్లు, బ్రిడ్జిలు, ఆసుపత్రులు, పార్క్‌లు నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ. నేను పంచాయతీ రాజ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు తండాల్లో మంచినీటి సమస్య ఉంటే సోలార్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటుచేశాం. 2019లో వైకాపాను గెలిపిం చారు.
అభివృద్ధిని అటకెక్కించారు. 2014లో టీడీపీ ఇక్కడ గెలవకపోయినా పాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం.రూ192కోట్లతో తోటపల్లి ఆధునీకరణ పనులు చేశాం. 22కోట్లతో జంపర్ కోట రిజర్వాయర్ పనులు పూర్తిచేశాం. సీతంపేటలో భూగర్భ డ్రైనేజీ, తాగునీరు కోసం రూ.4కోట్లు ఆనాడు నేను కేటాయిం చాను. తండాలకు 15ఫీడర్ అంబులెన్స్‌లు కూడా ఆనాడు టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేశాం. సీతంపేటలో రూ.3 కోట్లతో పార్క్ కట్టాం. 2019లో వైకాపాను గెలిపిం చారు. అభివృద్ధిని అటకెక్కించారని లోకేష్ అన్నారు.
పాలకొండను దోచుకుంటున్నారు
పాలకొండ ఎమ్మెల్యేగా కళావతిని రెండుసార్లు గెలిపించారు. మీజీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీరు ఒక్క ఎమ్మెల్యేను గెలిపిస్తే బంపర్ ఆఫర్ లా ఇద్దరు వచ్చారు. నియోజకవర్గాన్ని కేక్‌లా కట్ చేసుకు ని ఇద్దరూ పంచుకుంటున్నారు. ఒకవైపు కళావతి, మరోవైపు ఎమ్మెల్సీ విక్రాంత్. ఇద్దరూ ప్రజలను పీడిర చుకు తింటున్నారు. పాలకొండలో కోట్ల విలువైన భూమిని బినామీ పేర్లతో రాయించుకున్నారు. గవర్న మెంట్ డిగ్రీ కళాశాల భూమిని కూడా ఇద్దరు నాయకులు కబ్జా చేశారు. నాగావళి, వంశధార నుంచి పెద్దఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక ఆనాడు రూ. 700 నుంచి రూ.వెయ్యి ఉంటే నేడు రూ.5వేలకు చేరింది. ఇద్దరూ దోచుకోవడం వల్లే ఇసుక ధర పెరిగిపోయింది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పెద్దలు కోరారు. తప్పకుండా చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
అన్ని రోడ్లు వేస్తాం
పాతపట్నం మీటింగ్ తరువాత రోడ్డు మార్గంలో పాలకొండ వస్తుంటే.. మా సెక్యురిటీ సిబ్బంది ఆంధ్రా రోడ్లు బాగా లేవు, ఒడిశా రోడ్లు బాగున్నాయని, అటు వైపు నుంచి వెళ్దామని చెప్పారు. రెండు నెలలు ఓపిక పడితే అన్ని రోడ్లు వేస్తాం. మొదటి వంద రోజుల్లో జీవో 3 తెచ్చి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు కూడా ఏర్పాటుచేస్తాం. తోటపల్లి లెఫ్ట్ కెనాల్ పనులు కూడా పూర్తిచేస్తాం. జంపర్ కోట రిజర్వాయర్ పనులు కూడా పూర్తిచేస్తాం.
నిలిచిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేస్తాం. అవన్నీ చేయాలంటే టీడీపీ-జనసేన నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ మీ ఎమ్మెల్యే నన్ను కలవలేదు. ఒక్క రోడ్డు అడగలేదు. పైపెచ్చు నేను చేస్తుంటే అడ్డుపడ్డారు. మా అభ్యర్థిని గెలిపిస్తే ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. సూపర్ -6 హామీలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత టీడీపీ శ్రేణులపై ఉందని లోకేష్ అన్నారు.