- 100 మందిని పిలిచి వర్క్‌షాపు పెడదాం
- విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీయాలి
- విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభు త్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విద్యాశాఖ సమీక్షలో మాట్లాడుతూ డ్రాప్ అవుట్ సంఖ్య జీరోకు చేరాలని, బడిబయట పిల్లలను బడిలో చేర్పించాలని ఆదేశించారు. కిట్ల పంపిణీలో 2, 3 నెలల ఆలస్యం అయిందని, సకా లంలో పంపిణీ చేయడంలో విఫలమైన సంబంధిత ఏజెన్సీని పక్కనపెట్టాలని సూచిం చారు. ఉన్నత విద్యాశాఖలో ఏపీఏఏఆర్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) చేస్తే మన రెగ్యులర్ అకాడమిక్ స్కిల్స్‌పై ఒక ఐడియా వస్తుందన్నారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరచాలని సూచించారు. గత ప్రభుత్వంలో విద్యావ్యవస్థ ధ్వంసమైందని, మళ్లీ విజ్ఞాన విహార యాత్రలు, క్రీడలు పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని సూచించారు.
విద్యార్థుల్లో స్కిల్స్ మరింత మెరు గుపరచాలని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పామ ని, వర్క్ స్టేషన్‌లు క్రియేట్ చేయాలని సూచించారు. తద్వారా 5-10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. స్కిల్స్ మెరుగుపరుచుకుంటే అదనపు ఇన్సెంటివ్‌లు ఇస్తామని తెలిపారు. వర్చువల్ వర్కింగ్‌కి పాలసీ తయారు చేయాలని, 100 మందిని పిలిచి ముందు వర్క్ షాప్ పెడదామని, అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత పాలసీ తయారు చేద్దామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని వర్చువల్ వర్కింగ్ హబ్‌గా మారుద్దామని తెలిపారు. గ్రామ సచివాలయం ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల వివరాలు వెలికితీయాలని, ఎంతమంది వర్క్ చేస్తున్నారన్న వివరాలు సేకరించాలని సూచించారు.
డిజిటల్ కరెన్సీ వచ్చిన సమయంలో యూపీఐ, క్యూఆర్ కోడ్ తెచ్చాం. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్ ఫామ్ అనేది యూపీఐ మాదిరి ప్లాట్ ఫామ్ వస్తే ఒకే వేదిక పైకి ఉత్పత్తిదారులు, వినియోగదారులు తీసుకొస్తాం. మిగిలిన వారిని కూడా ఒకే వేదిక పైకి తీసుకురాగలిగితే ఏం కావాలన్నా ఆన్‌లైన్‌లో కొనగలుగుతాం. అదే విధంగా ఉత్పత్తి చేసిన వస్తువును అమ్ముకునే వీలు కలుగుతుంది. ఉదాహరణకు అగ్రి కల్చర్ ప్రొడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్ తదితర వస్తువులను అంతర్జాతీయ స్థాయిలో అమ్ముకునే అవకాశం ఉంది. ఇదే భవిష్యత్తు కాబోతుంది. దీనిపై కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.