- జగన్ డైరెక్షన్లో జరిగిన కుట్రలో వెల్లంపల్లి, కోవర్ట్ నానిల పాత్ర
- టీడీపీ నేత బొండాను ఇరికించేందుకు కుట్ర
- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
అమరావతి,చైతన్యరథం: జగన్ పర్సనల్ సర్వీసుగా వ్యవహరిస్తూ గులకరాయి డ్రామాలో పాత్రదారులయ్యే పోలీసు అధికారులను వదలిపెట్టేదిలేదని, రాష్ట్రంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. గులకరాయి ఘటనలో టీడీపీ నేత బొండా ఉమాను ఇరికించే కుట్ర జరుగుతోంది, ఆయన కచ్చితంగా గెలవబోతున్నాడని తెలిసే జగన్ డైరెక్షన్లో బొండా ఉమా ప్రత్యర్ధి అభ్యర్ధి వెల్లంపల్లి, కోవర్ట్ నాని కలిసి గులకరాయి డ్రామా కుట్రకు తెరలేపారని అన్నారు. బుధవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడుతూ జగన్ డ్రామాలను చూసి జనం ఆశ్చర్య పోతున్నారన్నారు. 2019 ఎన్నికలకు ముందు కోడి కత్తి డ్రామాతో దళిత బిడ్డను బలిచేసి కోడికత్తి శీనును ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గేలా చేశాడన్నారు. కోడి కత్తి శీను తాను జైల్లో కలిసినప్పుడు జగన్ మోసానికి తాను బలైననాని తనకు చెప్పినట్లు పట్టాభి తెలిపారు. అదే విధంగా ఈ గులక రాయి డ్రామాలో కూడా బీసీ వర్గానికి చెందిన వడ్డెర కులస్తులను దాదాపు పదిమంది పిల్లలను బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి చిత్ర హింసలకు గురి చేస్తున్నారన్నారు. విజయవాడ సీపీ ఆధ్వర్యంలో ఈ అక్రమ అరెస్టులు జరిగాయన్నారు. టీడీపీలో చేరిన దుర్గారావును అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తున్నట్లు తెలిసిందన్నారు.
టీడీపీ నేత బొండాను ఇరికించేందుకు కుట్ర
వైసీపీ అరాచాకాలపై పోరాడుతున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును గులకరాయి డ్రామాలో ఇరికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని పట్టాభి పేర్కొన్నారు.. పోలీస్ శాఖ డీజీ, ఇంటిలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులు, విజయవాడ కమిషనర్ లు ఏదోరకంగా బోండా ఉమామహేశ్వరావును ఇరుకున పెట్టేందుకు ముందుగా ప్రణాళికలు రచించారన్నారు. అందులో భాగంగానే జగన్ రెడ్డి బస్సు యాత్రలో కరెంట్ తీసేసి గులకరాయి డ్రామాకు తెరలేపారన్నారు.
జగన్ డైరెక్షన్.. సుత్రదారులుగా వెల్లంపల్లి, కేశినేని నాని
జగన్ డైరెక్షన్ లో ఈ కుట్రలో ప్రధానపాత్ర పోషించిన వ్యక్తి వెల్లంపల్లి అని పట్టాభి అన్నారు. వెల్లంపల్లి ఒక గజ దొంగ అని.. విజయవాడ వెస్ట్ ను పూర్తిగా దోచుకున్న దుర్మార్గుడు, వ్యాపారస్తులను వేధించిన నీచుడు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి వెల్లంపల్లి చేయని అక్రమాలు లేవన్నారు. ఆఖరికి కొబ్బరి చిప్పలను కూడా వదిలి పెట్టని.. కొబ్బరి చిప్పల మంత్రి అని.. ఈ గులకరాయి దాడిలో కొబ్బిరి చిప్పల మంత్రే కీలక సూత్రాదారి అని అన్నారు. దేవుడికి సంబంధించిన వెండి వస్తువులను మాయం చేసిన ఘనుడు వెల్లంపల్లి అన్నారు. మరో వైపు టీడీపీలో ఉంటూ జగన్ రెడ్డి విసిరే చిల్లరకు ఆశపడిన వ్యక్తి కేశినేని నాని అని.. పూర్తిగా దివాళా తీసిన వ్యక్తి, బ్యాంకులను మోసం చేసిన వ్యక్తి ఈ కోవర్ట్ నాని అన్నారు. శ్రీరామ్ ఫైనాన్స్ కు చేసిన మోసం, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ కు టోపి పెట్టే ప్రయత్నం, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టిన వైనం.. ఎవరికి తెలియదు నీ చరిత్ర అన్నారు. నువ్వు నడిపే హోటల్ డైరెక్టర్లు ఎవరో బయటపెట్టాలన్నారు. నువ్వు బ్యాంకులకు బురిడి కొట్టించిన వ్యక్తివి కాబట్టే నీవు చేసే వ్యాపారాలకు పేర్లు మార్చి నీ గుమస్తాల పేర్లు పెట్టాకున్నావన్నారు. ఇటు వంటి చీటర్లను పెట్టుకుని బొండా ఉమామహేశ్వరరావు, కేశినేని చిన్నిలపై గెలిచేందుకు జగన్ కుట్రకు తెరలేపారని విమర్శించారు.
జగన్ కు కొమ్ము కాస్తున్న అధికారులపై చర్యలు
విజయవాడ కమిషనర్ క్రాంతి ఠాణా ప్రెస్ మీట్ ఒక జబర్దస్ కామెడీ షో కింద మారిపోయింది. అరచేతి సైజులో ఉన్న రాయి ముఖ్యమంత్రికి తగిలి, వెల్లంపల్లికి తగిలి అటునుండి అటే గాల్లో ఎగిరిపోయిందట..!? కొద్దిగా కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇటువంటి డ్రామాల్లో పాత్రదారులు అవ్వడం సిగ్గుచేటు. ఖచ్చితంగా వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే ఎవరిని కూడా వదిలిపెట్టం. జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్న పోలీసులను వదిలి పెట్టం. పొరుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఈ పోలీసు అధికారులు గమనించాలి. ప్రభాకర్ రావు పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలి. రేపు మీ పరిస్థితి కూడే అదే కాబోతుంది. వైసీపీకి కొమ్ముకాస్తున్న క్రాంతి ఠానా, సీతారామాంజనేయులు లాంటి అధికారుల ఇకనైనా మారాలని పట్టాభి హెచ్చరించారు.
బీసీలకు అండగా టీడీపీ
గతంలో దళిత బిడ్డను బలి పశువులు చేసి ఇప్పు బలహీన వర్గాల పిల్లలను మీ కార్యాలయాల్లో బందించి చిత్ర హింసలకు గురిచేస్తారా? బీసీలు అంటే అంత లెక్క లేకుండా ఉందా. కచ్చితంగా దీని పర్యాయవసానం అనుభవిస్తారు. బీసీలకు వెన్నెముకగా టీడీపీ ఉంది. టీడీపీ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కడుపు మంటతో ఉన్నారు. బీసీ బిడ్డ అమర్నాథ్ ను ఏవిదంగా పెట్రోల్ పోసి తగలబెట్టారో… ఒక దళిత బిడ్డ కిరణ్ చావుకు ఏరకంగా కారణం అయ్యారో.. ఒక మైనార్టీ బిడ్డ మిస్బా చావుకు ఏరకంగా కారణం అయ్యారో ప్రజలు మరచిపోలేదు. కచ్చితంగా బలహీన వర్గాలు వైసీపీకి బుద్ధి చెబుతాయని పట్టాభి స్పష్టం చేశారు.
వెల్లంపల్లి, కేశినేని నానీల కాల్ రికార్డ్లను బయట పెట్టాలి
వన్ టౌన్ రౌడీతో గులకరాయ ఘటనకు ప్లాన్
బలహీన వర్గాలను బలిచేసేందుకు జగన్ కుట్ర
టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్
అమరావతి,చైతన్యరథం: జగన్నాటకంతో బలహీన వర్గాలను బలిచేసేందుకు జగన్ కుట్ర పన్నుతున్నాడని టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ మండిపడ్డారు. రూట్ మ్యాప్ మార్చి, కావాలనే కరెంట్ కట్ చేసి, రాయితో దాడి చేయించుకుని సానుభూతి పొందేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వన్ టౌన్ రౌడీతో రాయిదాడికి ప్లాన్
బస్సు యాత్రకు ప్రజాధరణ లేకపోవడంతో విజయవాడలో వన్ టౌన్ రౌడీతో రాయి ఘటనకు జగన్ గ్యాంగ్ ప్లాన్ చేశారని. అందులో కోవర్ట్ నాని, వెల్లపంల్లి శ్రీనివారావులు ముఖ్య పాత్ర వహించారని రాకేష్ విమర్శించారు. వెల్లంపల్లి, కేశినేని నానీల కాల్ రికార్డ్స్ లను బయట పెడితే అసలు నిజం బయటకు వస్తుందన్నారు. దాడి జరిగిన రాయి ఎక్కడకు పోయింది.? దాడి జరిగినా బస్సు యాత్ర ఎందుకు కొనసాగించారు.? ఇదంతా నాటకంలో భాగంగానే చేశారని మండిపడ్డారు.
ప్లాన్ ప్రకారం దాడి… ప్లకార్డ్ లతో వెంటనే నిరసన
జగన్ బస్సు యాత్రకు ప్రజాధరణ లేకపోవడంతో ముందుగానే ప్లాన్ ప్రకారం రాయి దాడి చేయించుకుని.. ప్లకార్డ్ లతో వెంటనే చంద్రబాబు వ్యతిరేకంగా నిరసనలు తెరలేపారన్నారు. వైసీపీ అనుంగులుగా వ్యవహరిస్తున్న పోలీసులు ఈ డ్రామాకు కొమ్ముకాస్తున్నారన్నారు. చీకట్లు సృష్టించుకుని రౌడీలను పురమాయించుకుని పిల్లలకు డబ్బులు ఎరచూపి రాళ్ల దాడి చేయించుకుని నేడు బీసీల బిడ్డలను బలిచేసేందుకు కుట్ర పన్ని టీడీపీపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారన్నారు.