చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నూతనోత్సాహంతో పనిచేద్దాం

సచివాలయంలో ముఖ్య అధికారులతో చంద్రబాబు

by చైతన్యరధం
Jan 2, 2025 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నూతనోత్సాహంతో పనిచేద్దాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కొత్త సంవత్సరం..కొత్త ఆలోచనలతో సాగుదాం
  • 2025 అతిపెద్ద మార్పునకు గేమ్‌ చేంజర్‌ కావాలి
  • పేదల జీవన ప్రమాణాలు పెంచేలా పనిచేయాలి
  • నూతనత్వం, సాంకేతికతతో అద్భుత ఫలితాలు
  • ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయి
  • పేదల జీవితాలను మార్చేలా సంస్కరణలు ఉండాలి
  • ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా నిర్ణయాలు చేద్దాం
  • స్మార్ట్‌ వర్క్‌ చేయండి..సాంకేతికను జోడిరచండి
  • స్వర్ణాంధ్ర విజన్‌ లక్ష్యాల సాధనకు కృషిచేయాలి
  • బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్ర దశ దిశ మారుస్తుంది
  • సచివాలయంలో ముఖ్య అధికారులతో చంద్రబాబు
  • ఆలోచనలు, ప్రాధాన్యతలు, లక్ష్యాలు వివరించిన సీఎం

అమరావతి(చైతన్యరథం): కొత్త సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సచివాలయంలో అధికారులతో కొద్ది సేపు ముచ్చటించారు. ఈ సమావేశాని కి సీఎస్‌, డీజీపీ, సీఎంవో అధికారులతో పాటు ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు హాజ రయ్యారు. రోజువారీ సమీక్షలకు భిన్నంగా జరిగిన మాటామంతీలో తన ఆలోచనలు, ప్రభు త్వ ప్రాధాన్యతలు, లక్ష్యాలు వివరించిన సీఎం…ఆ అంశాలపై అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో పనిచేద్దాం ఒక టీంగా కలిసి పని చేద్దాం.. ప్రజల జీవితాలు మారుద్దామని తన ఆలోచనలను పంచుకు న్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేలా సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన మార్పు తేవాలనే సంకల్పానికి నూతనత్వం, సాంకేతికత జోడిస్తే శాఖ ల్లో అద్భుత ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ముందుగా అధికారులకు, వారి శాఖలలో పనిచేసే ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో ఒక పాజిటివ్‌ ఎనర్జీతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పాలసీలకు సంబంధించి తన అనుభవాలను గుర్తు చేసి వారికి సూచనలు చేశారు. 2025 సంవత్సరం లక్ష్యాలు ఏమి టి, పనితీరు ఎలా ఉండాలనేది వారికి వివరించి కార్యాచరణ అమలు చేయాలని సూచిం చారు. ప్రతి శాఖలో కూడా ఫలితాలు సాధించేలా పని జరగాలని అభిప్రాయపడ్డారు.

సంస్కరణలు పేదలకు వ్యతిరేకం కాదు
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో సంస్కరణలు అంటే పేదలకు వ్యతిరేకం అనే ప్రచారం ఉండేది. కానీ నాడు ధైర్యంగా సంస్కరణలు అమలు చేశాం. వెనుకడుగు వేయ కుండా కొత్త పాలసీలు తీసుకువచ్చి అమలు చేశాం. సంస్కరణలు పేదలకు వ్యతిరేకం కాదు.. పేదల జీవితాలు మార్చేవి అని నాడు తీసుకున్న నిర్ణయాలు నిరూపించాయి. అందుకే పేదల జీవితాలను మార్చే సంస్కరణల అమలులో ఎప్పుడూ చొరవ చూపు తాను. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో కూడా సంస్కరణలు మొదలు పెట్టాం. నేషనల్‌ హైవేల విషయంలో నాడు తీసుకున్న నిర్ణయంతో స్వర్ణచతుర్భుజి రోడ్లు వచ్చాయి. ఓపెన్‌ స్కై పాలసీ వల్ల విమానయాన రంగంలో అనూహ్య మార్పులు వచ్చా యి. పీపీపీ విధానం వల్ల సంపద సృష్టి జరిగింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిం చాయి. నాడు హైదరాబాద్‌లో చేసిన ప్రతి అభివృద్ధి నేడు అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఆయా నిర్ణయాల సమయంలో తాను ఎదుర్కొన్న విమర్శలను కూడా గుర్తుచేసుకున్నారు. అయినా సరే మంచి సంకల్పంతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఫలితాలు వచ్చాయని తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

రూ.119 కోట్లతో టీసీసీ!

2019లో కొనసాగి ఉంటే…
విభజన తరువాత మళ్లీ ఏపీలో పెద్దఎత్తున అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేప ట్టాం. 2019లో ప్రభుత్వం కొనసాగి ఉంటే రాష్ట్రం ఎంతో పురోగతి సాధించేది. రాష్ట్రాల అభివృద్దిలో సుస్థిర ప్రభుత్వం అనేది కూడా ముఖ్యం. అప్పుడే అనుకున్న విధంగా ప్రాజె క్టులు పూర్తి అవుతాయి. ప్రజలకు మేలు జరుగుతుంది. 2024 ఎన్నికల్లో ప్రజలు తిరుగు లేని తీర్పు నిచ్చారు. ప్రభుత్వంపై అనేక ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి. వీటిని నెరవేర్చే క్రమంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాం. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలసీలు తెచ్చాం. ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయి. ఇది మంచి పరిణామం. మనకున్న పేరుతో, కొత్తపాలసీతో మళ్లీ పెట్టుబడులు వస్తున్నాయి. ఒకప్పుడు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజెనెస్‌ అన్నాం…ఇప్పుడు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజెనెస్‌ అంటున్నాం. దీనికి అనుగుణంగా సమస్త అధికార యంత్రాంగం పనిచేయాలని సూచించారు.

వేగంగా నిర్ణయాలు..తొందరగా ఫలితాలు
రాష్ట్రం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరగా ఫలితాలు రాబట్టాలి. టెక్నాలజీ సాయంతో చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి శాఖ లో టెక్నాలజీ వాడకాన్ని పెంచాలి. రానున్న రోజుల్లో 150 సర్వీసులు వాట్సాప్‌ ద్వారా ఇవ్వనున్నాం. దీనికి సమాయత్తం కావాలి. ఆధార్‌ను సమర్థవంతంగా ఉపయోగిస్తాం. ప్రతి ఇల్లు జియో ట్యాగ్‌ చేస్తాం. పింఛన్లు ఇంటి వద్దనే ఇచ్చారా లేదా అనేది రియల్‌ టైంలో తెలిసిపోతుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, సీసీ కెమేరాలు, డ్రోన్లు, రియల్‌ టైం డాటాను సమర్థవంతంగా వినియోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. రెవెన్యూ శాఖలో చాలా సమస్యలున్నాయి. వీటన్నింటికి పరిష్కారం చూపాలి. రాత్రింబవళ్లు పనిచేయాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ వర్క్‌ చేయండి. టెక్నాలజీని వాడండి కచ్చితంగా ఫలితాలు వస్తాయి అని తెలిపారు.

విజన్‌ 2047 లక్ష్యాల సాధనకు కృషి
ప్రజలకు ఐదేళ్ల కాలంలో ఏం చేయాలి అని మాత్రమే కాదు… భవిష్యత్‌ అవసరా లను గుర్తించి విజన్‌ 2047ను తీసువచ్చాం. ఇందులో పేర్కొన్న 10 లక్ష్యాలను సాధిం చేందుకు అధికారులు కృషిచేయాలి. అన్ని కార్యక్రమాలకు డబ్బుతోనే కాదు… కొత్త ఆలోచనలతో కొత్త మార్గాల్లో ప్రయాణం చేయాలి. మంచి చేయాలనే తపన, ఆలోచన ఉంటే చాలా అంశాల్లో ప్రజలకు మేలు చేయవచ్చు. 2025 సంవత్సరం ఆ తరహా ఆలో చనలకు వేదిక కావాలని కోరుకుంటున్నా. 2025 గేమ్‌ చేంజర్‌లో కీలకం కావాలి. అతిపెద్ద మార్పుకు ఈ ఏడాదిలో నాంది పడాలి. రూ.80 వేల కోట్లతో గోదావరి నీళ్లు బనకచర్లకు సాధ్యమా అని అడుగుతున్నారు. అర్థికంగా అతి పెద్ద ప్రాజెక్ట్‌.. అయినా సరే దీన్ని చేపట్టాలి. ఇది రాష్ట్ర దశ దిశ మారుస్తుంది. ఇప్పుడు చేపట్టకపోతే ఈ ప్రాజెక్టును ఇక ఎప్పటికీ చేపట్టలేం. ఇవన్నీ ప్రజల జీవితాల్లో నేరుగా మార్పులు తెచ్చే కార్యక్రమా లు అని తెలిపారు.

మార్పు, వేగం, పాలనలో కొత్త పుంతలు
నేను మీ నుంచి వినూత్న ఆలోచనలు కోరుకుంటున్నా. 1995లో మా దగ్గర డబ్బు లేదు. కానీ ఆలోచనలతో మార్పు తెచ్చాం. అధికారులు సరికొత్త ఆలోచనలతో పనిచేస్తే ఫలితాలు వస్తాయి. కలిసి సమష్టిగా, వేగంగా అడుగులు వేద్దాం. మనం ఎంత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తే అంత త్వరగా ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంగా పాలనా అంశాలపై అధికారులు కొందరు తమ అభిప్రాయాలు చెప్పారు. అతి పెద్ద పెట్టుబడులు పెట్టే సంస్థల కార్యకలాపాలు వేగంగా కార్యరూపం దాల్చడం కోసం ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించాలని సూచించారు. ఈ సూచనను సీఎం స్వాగతించారు. అలాగే ఆయా శాఖలకు సంబంధం ఉన్న పెద్ద పెద్ద సంస్థలు సీఎస్‌ఆర్‌ కోసం నిధులు ఖర్చు చేస్తాయని… వాటిని ఒక గొడుగుకిందకు తెచ్చి మంచి ఫలితాలు వచ్చేలా వాటిని ఖర్చు చేసేలా చూడాలని సూచించారు. దీనికి కూడా సీఎం అంగీకారం తెలిపారు. 2025 మార్పునకు, వేగానికి, పాలనను కొత్త పుంతలు తొక్కించ డానికి, ప్రజల సంతృప్తిని పెంచడానికి వేదిక కావాలి. ఆ దిశగా అన్ని స్థాయిల్లో సిబ్బం ది, అధికారులు, పనిచేయాలని సూచించారు.

Previous Post

వైద్య సిబ్బందికి మంత్రి సత్యకుమార్‌ లేఖ

Next Post

అమరావతిలో పనులకు టెండర్ల ఆహ్వానం

మరిన్ని వార్తలు

చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

కార్యకర్త
@ March 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist