అమరావతి(చైతన్యరథం): ఒమన్ దేశంలో చిక్కుకుపోయిన మహిళను స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మామిడి దుర్గ అనే మహిళ ఏజెంట్ల ద్వారా ఒమన్ దేశం వెళ్లి అక్కడ చిక్కుకుపోయింది. పనిప్రాంతంలో పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నామి. ఆరోగ్యం క్షీణించినా ఎవరూ పట్టించుకోవటం లేదు. తనకు లోకేష్ అన్నే దిక్కు.. రక్షించాలంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. దీనిపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. భయపడవద్దమ్మా.. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగానికి నీ విషయం తెలియజేశాను. వీలయినంత త్వరలో వాళ్లు నిన్ను వెనక్కి తీసుకొస్తారని సోషల్ మీడియా వేదికగా లోకేష్ స్పందించారు.